సుష్మా స్వరాజ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుష్మా స్వరాజ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ (The Sushma Swaraj Institute of Foreign Service) ఇండియన్ సర్వీస్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చే సివిల్ సర్వీస్ ఫారిన్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్). ఈ సంస్థ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది.

భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 68వ జయంతి సందర్భంగా ఆమె గౌరవార్థం 2020 ఫిబ్రవరి 14న ఈ సంస్థకు సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ గా మార్చబడింది[1].

సుష్మా స్వరాజ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్
सुषमा स्वराज विदेश सेवा संस्थान
ఇతర పేర్లు
ఫారిన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్
రకంసివిల్ సర్వీస్l సివిల్ సర్వీస్ శిక్షణా సంస్థ
స్థాపితం1986
డీన్అరుణ్ కుమార్ ఛటర్జీ , ఐ ఎఫ్ ఎస్ (additional charge)
స్థానంన్యూ ఢిల్లీ , NCT Delhi , భారతదేశం
కాంపస్Urban
అనుబంధాలుభారత విదేశాంగ వ్యవహారాల శాఖ

అవలోకనం[మార్చు]

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ (ఎస్ఎస్ఐఎఫ్ఎస్) ను భారత ప్రభుత్వం 1986 లో ఏర్పాటు చేయబడింది. ప్రధానంగా ఇండియన్ ఫారిన్ సర్వీస, న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వృత్తిపరమైన శిక్షణ అవసరాలను తీర్చడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో స్నేహం, సహకారానికి వారధులు,విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇతర సివిల్ సర్వీసెస్ లోని అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులకు శిక్షణలో ( కోర్సుల్లో) విదేశీ దౌత్యవేత్తలకు కోర్సులను చేర్చేందుకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ ఎస్) కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ 1986 సంవత్సరంలో పనిచేయడం ప్రారంభించినప్పటికీ, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారుల శిక్షణ ప్రారంభాలు, అక్టోబర్ 1946 క్యాబినెట్ నిర్ణయానికి వెళతాయి, అందులో "దౌత్యవేత్తకు అవసరమైన ప్రత్యేక జ్ఞానం, వృత్తి నైపుణ్యాన్ని జాగ్రత్తగా శిక్షణ ద్వారా మాత్రమే పొందగలడు అనే " ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది.

ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ప్రారంభంలో, అధికారుల శిక్షణ ఢిల్లీలో మూడు నెలల ప్రాథమిక ఉపన్యాసాల కోర్సును కలిగి ఉంటుంది, తరువాత విదేశీ విశ్వవిద్యాలయాలలో 18 నెలలు సంబంధిత దేశంలో భారతీయ ప్రతినిధి సాధారణ పర్యవేక్షణలో విద్యార్థులుగా ఉంటారు, తరువాత భారతదేశంలోని ప్రధాన కార్యాలయంలో సుమారు ఒక సంవత్సరం శిక్షణ ఉంటుంది.1950 మార్చి 21 న భారత విదేశాంగ వ్యవహారాల శాఖ( మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్)(ఎంఇఎ) ఫారిన్ సర్వీస్ బోర్డ్ (ఎఫ్ఎస్ బి ) శిక్షణ కొత్త కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో చరిత్ర ( హిస్టరీ), భౌగోళికం(జాగ్రఫీ), ఆర్ధిక శాస్త్రం (ఎకనామిక్స్), భారతదేశ సంస్కృతీ (ఇండియన్ కల్చర్), భారత దేశ విదేశీ సంభంధాల సిద్ధాంతాలు (ఇండియన్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ పాలసీ), ఆధునిక చరిత్ర, రాజకీయం (మోడ్రన్ హిస్టరీ అండ్ పాలిటిక్స్, డిప్లొమాటిక్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్) వంటి రంగాల్లో శిక్షణలో ఉన్న వారి నైపుణ్యత పెంచడం వంటివి గాక, ప్రసంగం,రచనలో స్పష్టంగా, సంక్షిప్తంగా వ్యక్తీకరించే వారి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, వారి అంతర్-వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపరచడం కొరకు విద్యావేత్తలు, పరిశోధన, మీడియా, ప్రజా జీవితం, పరిశ్రమ, వాణిజ్యం, ఉన్నత పదవులలో పదవీ విరమణ పొందినవారు, పదవీ విరమణ పొందిన దౌత్యవేత్తలు, ఇతర ప్రభుత్వ అధికారుల అతిథి అధ్యాపకులుగా వీరికి శిక్షణ ఇచ్చేవారిలోఉన్నారు[2].

శిక్షణ ప్రత్యేకత[మార్చు]

భారత ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ పరిధిలోని అఖిల భారత సర్వీసులు (సెంట్రల్ సివిల్ సర్వీసెస్) లో ఒకటి. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) సభ్యులు అంతర్జాతీయ భూభాగంలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు.ఈ సేవ ఇతర సేవల కంటే చాలా భిన్నంగా ఉంటుంది, దీనిలో దౌత్యం, వాణిజ్య,సాంస్కృతిక సంబంధాలకు సంబంధించినవి ఉంటాయి. విదేశీ విధానాలను రూపొందించడం, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల నిర్వహణ ఈ సేవ ప్రాధమిక లక్ష్యాలలో ఒకటి.

ఇటీవలి సంవత్సరాలలో, ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో ప్రవేశం సంవత్సరానికి సగటున 30-35 మంది మధ్య ఉంది. ప్రస్తుతం సుమారు విదేశాల్లో, స్వదేశంలో 193 భారతీయ రాయబార కార్యాలయాలు, స్థానాలలో (పోస్టుల్లో) 850 మంది అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.

భారతదేశంలో ఫారిన్ సర్వీస్ అధికారి ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిగా పనిచేయవచ్చు లేదా రక్షణ మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం, వాణిజ్య మంత్రిత్వ శాఖ, అంతరిక్ష శాఖ లేదా ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు మొదలైన వాటికి డిప్యుటేషన్లపై వెళ్ళవచ్చును.

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)లో ఎంపికైన అభ్యర్థికి సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ శిక్షణ అభ్యర్థికి దౌత్య లక్షణాలు, దౌత్య నైపుణ్యాల గురించి సమగ్ర జ్ఞానాన్ని అందిస్తుంది. అభ్యర్థికి చరిత్ర, దౌత్య పరిజ్ఞానం, అంతర్జాతీయ సంబంధాలపై అవగాహన కల్పించడమే ఈ కోర్సు అంతిమ లక్ష్యం. శిక్షణ చివరలో, అధికారికి అతని / ఆమె నిర్బంధ విదేశీ భాష ( కంపల్సరీ ఫారిన్ లాంగ్వేజ్ -సి ఎఫ్ ఎల్) కేటాయించబడుతుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కొంతకాలం పనిచేసిన తర్వాత, ఆ అధికారి తన కంపల్సరీ ఫారిన్ లాంగ్వేజ్( సిఎఫ్ఎల్) మాతృభాషగా ఉన్న దేశంలోని భారతీయ రాయబార కార్యాలయంలో నియమించబడతారు. ఆ అధికారి తన కంపల్సరీ ఫారిన్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలని, అతను సర్వీసులో ధృవీకరించబడటానికి ముందు అవసరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని సూచిస్తారు[3].

భాద్యతలు[మార్చు]

ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ గా అనేక బాధ్యతల్లో ఒకటి భారతదేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం ఎంచుకునే స్వప్రయోజన వ్యూహాలు అయిన విదేశీ విధానాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం, ప్రపంచ దేశాలతో ప్రజాస్వామిక, వ్యూహాత్మక వ్యవహారాలు, ప్రయోజనాల విజయం కోసం కొన్ని అంశాలను అధికారి ప్రదర్శించాలి, దేశ ఔన్యతి చూసుకోవాలి[4].

మూలాలు[మార్చు]

  1. "MEA remembers Smt. Sushma Swaraj on her birth anniversary". www.mea.gov.in (in english). Retrieved 2023-02-03.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "About Institute  : HISTORY OF THE INSTITUTE". ssifs.mea.gov.in. Retrieved 2023-02-03.
  3. "Indian Foreign Service Exam, Indian Foreign Service Syllabus, Indian Foreign Service Eligibility, UPSC Indian Foreign Service". www.civilserviceindia.com. Retrieved 2023-02-03.
  4. "Hey, did you know about Indian Foreign Services Officer (IFS Officer)?". idreamcareer.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-02-03. Retrieved 2023-02-03.