Jump to content

సుహాసిని గంగూలి

వికీపీడియా నుండి
సుహాసిని గంగూలి
సుహాసిని గంగూలొ
జననం3 ఫిబ్రవరి 1909
మరణం23 మార్చ్ 1965
ఇతర పేర్లుపటుడి
ఉద్యమంభారతదేశ స్వాతంత్రపోరాటం

సుహాసిని గంగూలి ( 1909 ఫిబ్రవరి 3 - 1965 మార్చి 23) భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న భారతీయ మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు.[1]

జీవితవిశేషాలు

[మార్చు]

గంగూలి 1909 ఫిబ్రవరి 3న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్‌లోని ఖుల్నాలో అభినాశ్చంద్ర గంగూలి, సరళా సుందరా దేవి దంపతులకు జన్మించారు. వారి కుటుంబం బెంగాల్‌లోని ఢాకాలోని బిక్రంపూర్‌కు చెందినది. ఆమె 1924లో ఢాకా ఈడెన్ స్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పాసైంది. ఇంటర్మీడియట్ ఆఫ్ ఆర్ట్స్ చదువుతున్నప్పుడు, ఆమె చెవిటి, మూగ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించి కోల్‌కతాకు వెళ్లింది. కోల్‌కతాలో ఉంటూనే, కళ్యాణి దాస్, కమలా దాస్‌గుప్తాతో పరిచయం ఏర్పడింది. వారు ఆమెను జుగంతర్ పార్టీకి పరిచయం చేశారు.అటుపై ఆమె ఛత్రీ సంఘ సభ్యురాలైంది. అక్కడ ఆమెకు 1929 విప్లవకారుడు రాశిక్ దాస్‌తో పరిచయం ఏర్పడింది. బ్రిటీష్ ప్రభుత్వం ఆమె కార్యకలాపాలను తెలుసుకున్నప్పుడు ఆమె ఫ్రెంచ్ భూభాగంలో ఉన్న చందన్‌నగర్‌లో ఆశ్రయం పొందింది.

1930 ఏప్రిల్ 18న చిట్టగాంగ్ ఆయుధశాల దాడి తరువాత, ఛత్రీ సంఘ నాయకుల సూచన మేరకు, భార్యాభర్తల వేషధారణలో ఉన్న చంత్రి సంఘల నాయకులకు గంగూలి ఆశ్రయం కల్పించారు. 1930 సెప్టెంబరు 1న, బ్రిటిష్ పోలీసులు వారి ఇంటిపై దాడి చేశారు. ఆ దాడిలో కొందరు చత్రీ సంఘనాయకులు తుపాకీ కాల్పుల్లో మరణించారు. గంగూలిని బ్రిటీష్ పోలీసుల చేతిలో పట్టుబడింది. అయితే వారు కొద్దిసేపటికే ఆమెను విడుదలచేశారు.

ఆమె 1932 బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన బీనా దాస్‌తో సంబంధం కలిగి ఉంది. అందువలన బెంగాల్ క్రిమినల్ లా అమెండ్‌మెంట్ (BCLA) చట్టం ప్రకారం, గంగూలి 1932 నుండి 1938 వరకు బందీగా చేయబడింది. కొంతకాలానికి ఆమె విడుదలైన తర్వాత, ఆమె భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్గొన్నది. ఆమె కమ్యూనిస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా యొక్క మహిళా ఫ్రంట్‌కు జోడించబడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పాల్గొననందున ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొననప్పటికీ, ఆమె తన కాంగ్రెస్ సహచరులకు సహాయం చేసింది. క్విట్ ఇండియా ఉద్యమ కార్యకర్త హేమంత తరఫ్దార్‌కు ఆశ్రయం ఇవ్వడంతో ఆమె 1942, 1945 మధ్య మళ్లీ జైలులో నిర్బంధించబడింది. గంగూలికి కమ్యూనిజంతో ఉన్న అనుబంధం కారణంగా 1948 పశ్చిమ బెంగాల్ భద్రతా చట్టం కింద 1948, 1949లో చాలా నెలలు జైలు శిక్ష అనుభవించారు.

గంగూలి తన జీవితాంతం సామాజిక పోరాటంలో పాల్గొన్నారు. 1965లో రోడ్డు ప్రమాదం కారణంగా కోల్‌కతాలోని పీజీ ఆస్పత్రిలో చేరారు. కానీ నిర్లక్ష్యం కారణంగా, ఆమె ధనుర్వాతం బారిన పడి 1965 మార్చి 23న మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. సెన్ గుప్తా, సుబోధ్; బసు, అంజలి (2016). Sansad Bangali Charitavidhan సంసాద్ బంగాల్ చరితవిధాన్ (బెంగాలి). Vol. 1. Kolkata: Sahitya Sansad. p. 827. ISBN 978-81-7955-135-6.
  • ఆంగ్ల వికిపీడియా Suhasini Ganguly ఆధారంగా అనువాదించబడింది.