సుహాస్ గోపీనాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుహాస్ గోపీనాథ్
Suhas gopinath1 full-2.jpg
జననం(1986-11-04) 1986 నవంబరు 4
బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం
వృత్తివ్యాపారవేత్త

సుహాస్ గోపీనాథ్ (కన్నడ : ಸುಹಾಸ್ ಗೋಪಿನಾಥ್ ), (జ. 1986, నవంబరు 4) ఒక భారతీయ వ్యాపారి. ఇతడు సమాచార సాంకేతిక బహుళ జాతి సంస్థ అయిన గ్లోబల్స్ ఇంక్ సంస్థాపకుడు, సీ.ఈ.వో, మరియు ఛైర్మన్.

ప్రారంభ జీవితం[మార్చు]

సుహాస్ గోపీనాథ్ బెంగళూరులో పుట్టారు. ఇతడు 14 ఏళ్ల ప్రాయంలోనే కూల్‌హిందుస్తాన్.కామ్ (CoolHindustan.com) అని పిలువబడే వెబ్‌సైట్‌ని ప్రారంభించాడు, తన కంపెనీని కూడా 14 ఏళ్ల వయసులోనే స్థాపించాడు. దీంతో అప్పట్లోనే ప్రపంచంలోనే అతి పిన్నవయసులోనే సీ.ఈ.వో అయినా వ్యక్తిగా పేరుపొందాడు.[1][2][3]

వెబ్‌సైట్‌లను నిర్మించి, అమెరికాలోని చిన్నా చితకా సంస్థలకు పోర్టళ్లను ఎలా అమ్మాలి అనే విషయాన్ని గోపీనాథ్ తనకు తానుగా నేర్చుకున్నాడు.[4][5][6]

గుర్తింపు[మార్చు]

2005లో గోపీనాథ్ కర్నాటక రాష్ట్ర రాజ్యోత్సవ అవార్డును స్వీకరించిన 175మంది గ్రహీతలలో అతి చిన్నవాడుగా పేరుకెక్కాడు.[7][8]

2007 డిసెంబర్ 2న యూరోపియన్ పార్లమెంట్ మరియు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ గోపీనాథ్‌కు బ్రస్సెల్‌లో జరిగిన యూరోపియన్ పార్లమెంట్‌లో “యంగ్ అచీవర్ అవార్డు”ను బహకరించింది. అతడిని యూరోపియన్ పార్లమెంట్‌ని, దానిలో సమావేశమైన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించివలసిందిగా ఆహ్వానించారు.[9]

2008 నవంబర్లో, ఆఫ్రికా ఖండ దేశాలలో ఉపాధికల్పనను పెంచడం, ఈ దేశాల విద్యార్థులలో ICT నైపుణ్యాలను పెంపొందించడానికి గాను ఆఫ్రికాలో ICTని చేపట్టడం కోసం ఏర్పరుస్తున్న ప్రపంచ బ్యాంకు యొక్క ICT లీడర్‌షిప్ రౌంట్ టేబుల్‌లో ప్రాతినిధ్యం వహించవలసిందిగా ఇతడిని ఆహ్వానించారు.[10]

యువ ప్రపంచ నేత[మార్చు]

గోపీనాథ్‌ని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరంలో 2008-2009కి గాను "యంగ్ గ్లోబల్ లీడర్"గా ప్రకటించారు. ఈ పదవిలో ఇతడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ నుంచి గ్లోబల్ లీడర్‌షిప్ మరియు పబ్లిక్ పాలసీపై డిప్లోమా పూర్తి చేశాడు.[11]

మూలాలు[మార్చు]

 1. "Dares to dream, strives to realise it". The Hindu. 2003-11-06. Retrieved 2007-01-13. Mr. Suhas shot to limelight when he became the youngest Indian to found a company at the age of 17. Cite web requires |website= (help)
 2. PTI (2006-11-10). "World's Youngest CEO, has big plans". Rediff.com. Retrieved 2010-06-10. Suhas Gopinath, who at 14 earned the distinction of being the world's youngest CEO... Cite web requires |website= (help)
 3. Bangalore Mirror (2010-06-05). "GIM over, but babus should not take it easy". Bangalore Mirror. Retrieved 2010-06-18. Gopinath, founder and CEO of Globals Inc who was recognised as the world’s youngest certified professional web-developer at 14... Cite web requires |website= (help)
 4. Rajesh Menon (2003-11-06). "Another Gates in the making! Founder at 14, CEO at 17, what next". The Indian Express. Retrieved 2007-07-07. Cite web requires |website= (help)
 5. Habib Beary (2003-11-17). "Indian teen at gates of success". BBC. Retrieved 2007-07-07. Cite web requires |website= (help)
 6. "Teenager hopes his firm will become another Microsoft". The Sydney Morning Herald. 2003-11-10. Retrieved 2007-07-07. Cite web requires |website= (help)
 7. "List that outgrew Hanuman's tail". The Times of India. 2005-11-01. Retrieved 2007-07-07. Cite web requires |website= (help)
 8. "Suhas Gopinath, Youngest CEO". PETADishoom.com. Retrieved 2007-07-07. Cite web requires |website= (help)
 9. "Young Achiever Award". EICC. 2007-12-04. Retrieved 2008-03-18. Cite web requires |website= (help)[dead link]
 10. "Youth with a Mission". City News Singapore. 2009-10-13. Retrieved 2009-10-25. Cite news requires |newspaper= (help)
 11. "Young Global Leaders 2008". World Economic Forum. 2008-03-11. Retrieved 2008-03-18. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]