Jump to content

సూర్యదేవర సామ్రాజ్యం

వికీపీడియా నుండి
(సూర్యదేవర కమ్మరాజులు నుండి దారిమార్పు చెందింది)

"'సూర్యదేవర నాయకులు"' పధ్నాలుగు, పదిహేనవ శతాబ్దములలో విజయనగర సామ్రాజ్యములో సేనాధిపతులుగా పేరొందిన ప్రాంతీయ పాలకులు, సైనిక నాయకులు. వీరు తెలుగు చోడ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు. గుంటూరు మండలం, రేపల్లె ప్రాంతము లోని పులివర్రు సీమను పాలించారు.

వీరి ప్రస్తావన 1500వ సంవత్సరమునుండి శాసనములలో కనపడుతుంది. శ్రీ కృష్ణదేవరాయలు కళింగ గజపతులతో చేసిన యుద్ధములలో (కటకము, ఆరుట్లకోట, విశాఖపట్టణము) ముఖ్యపాత్ర వహించి ఒరయూరి పురవిహార, పులియతలతరాయ, గండభేరుండ, గండరగండ, కరవాలభైరవ, రాజీవచూరకార, విశాఖపట్టణ తలగుండుగండర, కటకహన్నిబ్బరగండ, సప్తదీవిచూరకార, కదనప్రసంగ అను గొప్ప బిరుదులు పొందారు. ఈ బిరుదులవల్ల సూర్యదేవరవారి ప్రతాపము వెల్లడగుచున్నది. వీరు రాచూరు, పేటేరు కోటలని కట్టించారు.

సూర్యదేవర కమ్మవారిలో ముఖ్యులు తిమ్మనాయుడు, యెర్రనాయుడు, ముసలయ్యనాయుడు .

తళ్ళికోట యుద్ధము తరువాత సూర్యదేవరవారి ప్రభావము తగ్గుముఖము పట్టింది. 1600లో గొల్లకొండ నవాబు కుతుబ్ షా రాచూరు కోటను మాణిక్యారావు అను వెలమకు ఇచ్చెను.

వనరులు

[మార్చు]
  • కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు.