సూర్యదేవర రామచంద్ర రావు
సూర్యదేవర రామచంద్ర రావు | |
---|---|
జననం | ఆంధ్రప్రదేశ్ |
ఇతర పేర్లు | ఎస్. ఆర్. రావు |
వృత్తి | ప్రభుత్వోద్యోగి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సూరత్ నగరం అభివృద్ధి |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం తిరుపతి రాజు స్మారక పురస్కారం |
సూర్యదేవర రామచంద్ర రావు భారతదేశానికి చెందిన ప్రభుత్వ అధికారి. గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద మునిసిపాలిటీల్లో ఒకటైన సూరత్కు మునిసిపల్ కమీషనరుగా పనిచేశాడు.[1] 1994 లో సూరత్ నగరంలో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు దాన్ని అరికట్టడానికి ఆయన విశేష కృషి చేశాడు. ఆయన కృషి వల్ల మురికి నగరంగా పేరు పడిన ఈ నగరం భారతదేశంలో రెండో పరిశుభ్రమైన నగరంగా పేరు తెచ్చుకున్నది. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ నిర్వహించిన అభిప్రాయ సేకరణ ప్రకారం దేశంలో చండీఘర్ తర్వాత ఇదే అత్యంత పరిశుభ్రమైన నగరం.[2]
దీని తర్వాత ఈయన విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు ఛైర్మన్ గా పనిచేశాడు. దానిని దేశంలో ముఖ్యమైన ఓడరేవుగా అభివృద్ధి చేశాడు.[3] తర్వాత కేంద్ర ప్రభుత్వంలో సమాచార, సాంకేతిక శాఖ, వాణిజ్య శాఖల్లో కూడా కార్యదర్శిగా పనిచేశాడు.[4]
1998లో ఈయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. సర్వీసులో ఉండగానే పద్మ పురస్కారం అందుకున్న అతికొద్ది మంది అధికారుల్లో ఈయన ఒకడు.[5] తిరుపతి రాజు స్మారక పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Cleaning Up The Plague City". Outlook. 27 November 1996. Archived from the original on 10 డిసెంబరు 2015. Retrieved October 27, 2015.
- ↑ "Not the same Surat". Himal. March 1998. Archived from the original on 2016-03-04. Retrieved October 27, 2015.
- ↑ "His was a purposeful life". The Hindu. 14 April 2003. Archived from the original on 7 మే 2003. Retrieved October 27, 2015.
- ↑ "SR Rao named Union commerce secretary". Kammas World. 30 May 2012. Archived from the original on 5 మార్చి 2016. Retrieved October 27, 2015.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.