Jump to content

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్

వికీపీడియా నుండి
సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెంటర్
సంకేతాక్షరంసీఎస్ఈ
స్థాపన1980 (1980)
వ్యవస్థాపకులుఅనిల్ అగర్వాల్
రకంప్రజా ప్రయోజన పరిశోధన
కార్యస్థానం
సేవా ప్రాంతాలుభారతీదేశం
ముఖ్యమైన వ్యక్తులుసునీతా నారాయణ్[1]
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ సునీతా నారాయణ్ పార్లమెంట్ సభ్యులతో 'నీటి సంరక్షణ' ఉపన్యాసం

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (ఆంగ్లం: Centre for Science and Environment) భారతదేశంలోని న్యూఢిల్లీ కేంద్రంగా ప్రజా ప్రయోజన పరిశోధన, న్యాయ రంగాలలో లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. దాని ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో కొన్ని ఆహార కల్తీ, వినియోగదారు ఉత్పత్తుల భద్రతను పరిశోధించడం వంటివి ఉన్నాయి.[2][3]

1980లో ఏర్పాటైన సీఎస్ఈ దేశంలో పర్యావరణ అభివృద్ధి సమస్యలు, పేలవమైన ప్రణాళిక, దేశంలోని సుందర్‌బన్‌లను నాశనం చేస్తున్న వాతావరణ మార్పులు, విధాన మార్పులు, ఇప్పటికే ఉన్న విధానాలను మరింత మెరుగ్గా అమలు చేయడం కోసం కృషిచేస్తుంది.

ఈ సెంటర్ డైరెక్టర్ సునీతా నారాయణ్ కాగా, ఆమె నాయకత్వంలో, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కోక్, పెప్సీ వంటి అమెరికన్ బ్రాండ్‌ల శీతల పానీయాలలో ఉన్న అధిక స్థాయి పురుగుమందులను బహిర్గతం చేసింది.[4]

2018లో సీఎస్ఈకి శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి లభించింది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. https://www.cseindia.org/page/directors-cse
  2. "Honey adulteration: CSE rebuts Chinese firm's claim". The Hindu Business Line (in ఇంగ్లీష్). 9 December 2020. Archived from the original on 11 December 2020. Retrieved 2021-01-04.
  3. "After new quality control rule, toy safety finally set to become a reality in India". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-01-02. Retrieved 2021-01-04.
  4. "Pesticide cocktail in Coke, Pepsi brands". The Economic Times.
  5. "Centre for Science and Environment to receive Indira Gandhi Prize | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 18 November 2019. Archived from the original on 24 February 2022. Retrieved 2021-01-04.
  6. https://www.cseindia.org/cse-gets-2018-indira-gandhi-prize-9149>