సెయింట్ మార్టిన్ ద్వీపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సెయింట్ మార్టిన్ ద్వీపం, బంగ్లాదేశ్‌లో 3 చ.కి.మీ. విస్తీర్ణం మాత్రమే ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది బంగాళాఖాతపు ఈశాన్య భాగంలో కాక్స్ బజార్ - టెక్నాఫ్ ద్వీపకల్పపు కొన నుండి దక్షిణంగా దాదాపు 9 కి.మీ. దూరంలో ఉంది. ప్రక్కనే చేరా ద్వీప్ అనే పేరున్న ఒక చిన్న ద్వీపం ఉంది. పోటు సమయంలో ఇది ప్రధాన ద్వీపం నుండి విడిపోతుంది. సెయింట్ మార్టిన్ మయన్మార్ వాయువ్య తీరానికి పశ్చిమాన 8 కిలోమీటర్లు (5 మైళ్లు) దూరంలో నాఫ్ నది ముఖద్వారం వద్ద ఉంది.

చరిత్ర, వివరణ

[మార్చు]

సహస్రాబ్ది క్రితం, ఈ ద్వీపం టెక్నాఫ్ ద్వీపకల్పానికి పొడిగింపుగా ఉండేది. కానీ ఆ తరువాత, ఈ ద్వీపకల్పంలోని కొంత భాగం నీటిలో మునిగిపోయి, ద్వీపకల్పపు దక్షిణ భాగంలో ఒక ద్వీపంగా మారి, బంగ్లాదేశ్ ప్రధాన భూభాగం నుండి విడిపోయింది. ఈ ద్వీపంలో మొదట 18వ శతాబ్దంలో అరేబియా వ్యాపారులు స్థిరపడ్డారు. వారు దీనికి "జజీరా" అని పేరు పెట్టారు. బ్రిటిష్ ఆక్రమణ సమయంలో ఈ ద్వీపానికి అప్పటి చిట్టగాంగ్ డిప్యూటీ కమిషనరైన మార్టిన్ పేరు మీద సెయింట్ మార్టిన్ ద్బ్వీపం అని పేరు పెట్టారు.[1] ఈ ద్వీపానికి యొక్క స్థానిక పేర్లు "నారికేళ్ జింజిరా"[2] అంటే "కొబ్బరి ద్వీపం" అని, "దారుచీనీ ద్వీప్" (అంటే "దాల్చిన చెక్క ద్వీపం") అనీ అంటారు. ఇది బంగ్లాదేశ్‌లోని ఏకైక పగడపు దిబ్బ.

రవాణా

[మార్చు]
MV బంగాలీ. (32191488734)

సెయింట్ మార్టిన్ ద్వీపానికి చేరుకోవడానికి ఏకైక మార్గం నీటి రవాణా: కాక్స్ బజార్, టెక్నాఫ్ నుండి పడవలు, నౌకలు (ఎక్కువగా పర్యాటకుల కోసం) నడుస్తాయి.[3] ద్వీపంలో ఉన్న ఏకైక అంతర్గత రవాణా నాన్ మోటరైజ్డ్ వ్యాన్ (మనిషి లాగేది.). రోడ్లు కాంక్రీటుతో వేసారు. చాలా హోటల్‌లు రాత్రి 11 గంటల వరకు జనరేటర్లు నడుపుతాయి. ఆ తర్వాత వాటికి అనుమతి లేదు. కాబట్టి అవి సౌరశక్తిపై ఆధారపడతాయి. 1991 లో తుపాను వచ్చిన తర్వాత జాతీయ గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా తెగిపోయింది.

పర్యాటకం

[మార్చు]
సెయింట్ మార్టిన్ ద్వీపంలో ఒక రిసార్ట్ హోటల్

సెయింట్ మార్టిన్ ద్వీపం పర్యాటక ప్రదేశం. ఎనిమిది షిప్పింగ్ లైనర్లు ఈ ద్వీపానికి రోజువారీ యాత్రలు నడుపుతున్నాయి. పర్యావరణానికి అనుకూలంగా ఉండే జోస్నాలోయ్ బీచ్ రిసార్టు పర్యాటకానికి ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు తమ యాత్రను చిట్టగాంగ్ నుండి గానీ, కాక్స్ బజార్ నుండి గానీ బుక్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్న పగడపు దిబ్బకు చేరా ద్విప్ అనే పేరుగల పొడిగింపు ఉంది.

సార్వభౌమాధికార వివాదం

[మార్చు]

సెయింట్ మార్టిన్ ద్వీపం లోని 5,500 మంది నివాసుల అతిపెద్ద వృత్తి చేపలు పట్టడం. అయితే, మయన్మార్, బంగ్లాదేశ్‌ల మధ్య ప్రాదేశిక వివాదాల ఫలితంగా హింసాత్మక ఉద్రిక్తత ఏర్పడింది. బంగ్లాదేశ్ మత్స్యకారులను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటనలు ఇవి:

  • 1998 అక్టోబరు 7 న సెయింట్ మార్టిన్ ద్వీపం తీరంలో బర్మీస్ నేవీ బలగాలు ముగ్గురు బంగ్లాదేశ్ మత్స్యకారులను చంపాయి.[4]
  • 1999 సెప్టెంబరు 8 న సెయింట్ మార్టిన్ ద్వీపం సమీపంలో ఒక బంగ్లాదేశ్ జాలరిని బర్మీస్ నేవీ దళాలు కాల్చి చంపాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం మయన్మార్‌కు అధికారిక నిరసన నోట్‌ను సమర్పించింది.[5]
  • 2000 ఆగష్టు 20 న బంగ్లాదేశ్ పోలీసులు సెయింట్ మార్టిన్ ద్వీపం తీరంలో నలుగురు బంగ్లాదేశ్ మత్స్యకారులను కాల్చి చంపారని బర్మా సరిహద్దు గార్డులు నివేదించారు.[6]
  • 2011 లో సెయింట్ మార్టిన్ ద్వీపం తీరం నుండి 5 కి.మీ. దూరంలో సముద్రపు దొంగలు మత్స్యకారులపై దాడి చేసి, నలుగురిని చంపారు. [7]
  • 2018 అక్టోబరు 6 న, మయన్మార్ ప్రభుత్వం సెయింట్ మార్టిన్‌ను తమ సార్వభౌమ భూభాగంలో భాగంగా చూపుతూ 2015-2018 మ్యాప్‌ను నవీకరించింది. మ్యాప్‌లను రెండు గ్లోబల్ వెబ్‌సైట్‌లలో ప్రచురించింది. ఈ సంఘటన తర్వాత, బంగ్లాదేశ్ ప్రభుత్వం 2018 అక్టోబరు 6 న ఢాకాలోని మయన్మార్ రాయబారికి బలమైన పదాలతో కూడిన నిరసన నోట్‌ను అందజేసింది. మయన్మార్ రాయబారి సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమ దేశ భూభాగంలో భాగంగా చూపించడం "పొరపాటు" అని అన్నాడు.[8]

గ్యాలరీ

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • బంగ్లాదేశ్ దీవుల జాబితా
  • బంగ్లాదేశ్‌లో పర్యాటకం
  • బంగ్లాదేశ్‌లోని లైట్‌హౌస్‌ల జాబితా

మూలాలు

[మార్చు]
  1. "St. Martin Island, History, Location, how to go ?". Travel & Explore BD.
  2. "Saint Martin Island Bangladesh". Abdul Aouwal. May 3, 2016. Archived from the original on 2023-12-16. Retrieved 2016-06-25.
  3. "Saint Martin Bangladesh: A Little Heaven". Incredible Asia. 6 December 2022. Retrieved December 6, 2022.
  4. Myanmar Guards Kill Two Bangladeshis, October 8, 1998, Reuters
  5. Myanmar border guards kill Bangladeshi fisherman, September 8, 1999, Reuters
  6. Reuters, August 20, 2000
  7. "Four fishermen shot dead by pirates in bay". New Age. August 29, 2011. Archived from the original on January 29, 2013.
  8. Md. Azhar Uddin Bhuiyan (16 October 2018). "Legal implication of Myanmar's claim over Saint Martin". The Daily Star. Bangladesh. Retrieved 25 September 2019.