సైఫన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైఫన్ సూత్రం
A siphon used for homebrewing beer

సైఫన్ అనగా తిరగబడిన "U" ఆకారపు గొట్టం లేదా పైపు, ఈ సైఫన్ అనే పదాన్ని సాధారణంగా ఎత్తునున్న నీటిని లేదా ఇతర ద్రవాల్ని చిట్కా పంపు పద్ధతిలో తిరగేసిన "U" ఆకారపు గొట్టం ద్వారా పల్లమునకు ప్రవహింపజేసే పరికరాలను సూచించడానికి ఉపయోగిస్తారు. – see siphon terminology – but in the narrower sense it refers specifically to a tube in an inverted U shape which causes a liquid to flow uphill, above the surface of the reservoir, without pumps, powered by the fall of the liquid as it flows down the tube under the pull of gravity, and is discharged at a level lower than the surface of the reservoir whence it came. Note that while the siphon must touch the liquid in the (upper) reservoir (the surface of the liquid must be above the intake opening,) it need not touch the liquid in the lower reservoir and indeed there need not be a lower reservoir – can discharge into mid-air so long as the exit is below surface of the upper reservoir.

చిట్కా పంపు[మార్చు]

చిట్కా పంపు అనగా ఒక చిట్కాను ఉపయోగించి పనిచేయించే పంపు. మిట్టనుంచి పల్లంనకు ప్రవహించుట ద్రవముల సహజ లక్షణం. ద్రవానికి ఉన్న ఈ ప్రత్యేక లక్షణం ఆధారంగా ప్రవాహమునకు అడ్డుపడిన గట్టులను దాటించి ద్రవంను పల్లమునకు పంపించవచ్చు. భూమికున్న గురుత్వాకర్షణ శక్తి వలన, ద్రవం తనకున్న పల్లమునకు ప్రవహించే శక్తితో భూభాగాన్ని ఆవిరిస్తూ ఉంటుంది. తన ప్రవాహమునకు అడ్డువచ్చిన కట్టలను తెంచుకుని మరీ పల్లమును చేరుటకు ప్రయత్నిస్తూ ఉంటుంది. కట్ట అడ్డు ఉన్న ద్రవం ఎంత ఎక్కువున్నను ఎంత మిట్టనున్నను సాధారణ స్థితిలో గట్టును దూకి ప్రవహించలేదు. అయితే కొన్ని పరిస్థితులు అనుకూలించినట్లయితే గట్టును దూకి కూడా ద్రవం ప్రవహించగలదు. ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా అటువంటి పరిస్థితులు ఏర్పడటం చాలా అరుదు, అసలు చెప్పాలంటే సహజ సిద్ధంగా అటువంటి పరిస్థితులు ఏర్పడవు. మానవుడు అత్యంత సులభంగా అటువంటి పరిస్థితులను కల్పించి ద్రవము గట్టు దూకేలా చేసి అనేక అవసరాల కొరకు వాడుకుంటునాడు, పూర్వం నుంచి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ద్రవం గట్టు దూకించే విధానాన్ని మానవుడు ఉపయోగించుకున్నాడు, ఇక ముందు ఉపయోగించుకుంటాడు కూడా. ఎందుకంటే ఈ విధానం చాలా సులువైనది, అత్యంత చౌకైనది, సాధారణంగా యంత్ర విద్యుత్ అవసరం లేనిది.

ఎలా ఉపయోగించాలి[మార్చు]

సాధారణంగా ఎక్కువగా చాలా కొద్ది మొత్తంలో ద్రవంను దూకించుటకు నలగని, రంధ్రములు లేని వంగె గుణముగల సన్నని పైపు ఉపయోగిస్తుంటారు. పైపుని ద్రవంతో నింపి రెండు చివరలు మూసి ఉంచి ఒక చివరను మిట్టనున్న లేదా ఎగువనున్న ద్రవంలో ఉంచి మరొక చివరను పల్లమున ఉంచి ముందుగా ద్రవంలో నున్న పైపు చివర అడ్డును తొలగించి వెనువెంటనే పల్లములో నున్న మరొక పైపు చివరి అడ్డు తొలగించినట్లయితే మిట్టనున్న ద్రవం ఆ పైపు ద్వారా పల్లమునకు దూకుతూ ప్రవహిస్తుంది. ఈ విధానం సాఫీగా కొనసాగాలంటే రెండు చివరలు ద్రవంలో మునిగి ఉండాలి, అలా చేయనట్లయితే గాలి చొరబడి జరుగుతున్న ప్రక్రియ ఆగిపోతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=సైఫన్&oldid=3031414" నుండి వెలికితీశారు