Jump to content

సోనాలి రౌత్

వికీపీడియా నుండి
సోనాలి రౌత్
2016లో సోనాలి రౌత్
జననం (1990-12-23) 1990 డిసెంబరు 23 (వయసు 33)[1]
జాతీయతఇండియన్
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బిగ్ బాస్ 8
ఎత్తు1.71 మీ. (5 అ. 7 అం.)
బంధువులుఉజ్వల రౌత్ (సోదరి)

సోనాలి రౌత్ (జననం 1990 డిసెంబరు 23) హిందీ చిత్రసీమకు చెందిన భారతీయ నటి, మోడల్.[2] ఆమె 2010లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్‌గా ఎంపికయింది. అప్పటికి ఆమె 19 సంవత్సరాల కళాశాల విద్యార్థిని.[3] ఆమె రొమాంటిక్-థ్రిల్లర్ చిత్రం ది ఎక్స్‌పోజ్‌(The Xposé)తో 2014లో హిమేష్ రేషమియా, యో యో హనీ సింగ్‌ల సరసన ప్రధాన పాత్రలో నటించింది.[4] ఆమె రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ 8లో పోటీదారుగా ఉంది.[5]

కెరీర్

[మార్చు]

2010లో, ఆమె వార్షిక కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌లో మోడలింగ్ కు ఎన్నికైంది.[6]

ఆమె మాక్ కాస్మోటిక్స్, పీసి చంద్ర జ్యువెలర్స్, లిమ్కా, వెస్ట్‌సైడ్, పాంటలూన్స్ మొదలైన అనేక ప్రసిద్ధ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆమె అభిషేక్ బచ్చన్‌తో ఐడియా, నీల్ నితిన్ ముఖేష్‌తో సియారామ్, సీమట్టి సారీస్, iBall.. వంటి మరెన్నో టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో ఆమె నటించింది.[7]

2011లో మాగ్జిమ్ మ్యాగజైన్ కోసం నటుడు రణవీర్ సింగ్‌తో కలిసి ఆమె సంచలన ఫోటోషూట్ చేసింది.[8][9]

2014లో, ఆమె బాలీవుడ్ చిత్రం ది ఎక్స్‌పోస్‌లో హిమేష్ రేష్మియా సరసన నటించింది.[10]

భారతీయ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లడానికి ఆమె 99% యూజ్‌లెస్ ఫెలోస్ అనే చిత్రంలో నటించే అవకాశం వదులుకుంది.[11]

హేట్ స్టోరీ 3 చిత్రంలో ఆమెకు ప్రధాన పాత్రను ఆఫర్ చేశారు. సిరీస్ విజయానికి గుర్తుగా ఒక మ్యూజిక్ వీడియోను కూడా ఆఫర్ చేశారు.

2016లో, ఆమె గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రంలో షైనీగా నటించింది. ఆమె లిప్ స్టిక్ లగా కే చిత్రంలోని ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. ఈ పాట చాలా ప్రజాదరణ పొంది, ఆ సంవత్సరం టాప్ 20 పాటల్లో ఒకటిగా నిలిచింది.

2017 సంవత్సరంలో ఆమె FFACE ఫ్యాషన్ క్యాలెండర్ కవర్‌గా సంతకం చేయబడింది.[12]

2020 నాటికి, ఆమె భూషణ్ పటేల్ దర్శకత్వం వహించిన కరణ్ సింగ్ గ్రోవర్ సరసన యాక్షన్-థ్రిల్లర్ వెబ్ సిరీస్ డేంజరస్‌పై సంతకం చేసింది, దీనిని మికా సింగ్ నిర్మించారు. కాగా విక్రమ్ భట్ రచించారు, ఈ సిరీస్ 2020 ఆగస్టు 14 నుండి OTT ప్లాట్‌ఫారమ్ MX ప్లేయర్‌లో ప్రసారం అయింది.[13]

ఆమె సింగర్ షాన్‌తో “స్నిపర్” అనే మ్యూజిక్ వీడియో అల్బం తయారీలో పాల్గొన్నది.[14]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె భారతదేశానికి చెందిన ప్రముఖ విదేశీ మోడల్ ఉజ్వల రౌత్ చెల్లెలు. ఆమె ముంబైలోని మిథిబాయి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[15]

మూలాలు

[మార్చు]
  1. "Bigg Boss 8: Contestants celebrate Sonali's birthday". The Times of India. 24 December 2014. Retrieved 17 August 2019.
  2. "Ujjwala Raut's sister Sonali to debut as young Zeenat Aman?". The Times of India. 14 December 2013. Retrieved 8 April 2020.
  3. "Sexy kingfisher calendar girl Sonali Raut". The Times of India. Retrieved 14 March 2020.
  4. "Sonali Raut does a Zeenat Aman in The Xpose". India Today. 7 April 2014. Retrieved 14 March 2020.
  5. "Bigg Boss 8: Sonali Raut to get evicted this Saturday!". India TV News. 26 September 2014. Retrieved 27 September 2014.
  6. "Kingfisher calendar hotties of 2010!". India Today. 2010. Retrieved 27 September 2014.
  7. "Supermodel Ujjwala Raut's sister Sonali raut in Bollywood". Hindustan Times. 5 May 2011. Retrieved 8 April 2020.
  8. "Ranveer Singh's close encounter". The Times of India. 24 October 2011. Retrieved 8 April 2020.
  9. "Sonali Raut and Ranveer Singh hot photoshoot for Maxim Magazine". India Tv. 28 November 2014. Retrieved 8 April 2020.
  10. "Sonali Raut unhappy about preceding Chitrangada". The Times of India. 12 August 2014. Retrieved 27 September 2014.
  11. Vickey Lalwani (24 September 2014). "Sonali Raut is 100 per cent useless, feels director Basheed". Mumbai Mirror. Retrieved 27 September 2014.
  12. "Fface roped in Bollywood diva Sonali Raut as the cover Girl". India Blooms. 8 December 2016. Retrieved 2 May 2020.
  13. "Bipasha Basu teams up with husband Karan Singh Grover for web project Dangerous, see pic". Hindustan Times. 6 August 2020.
  14. "Shaan and Sonali Raut snapped during 'Sniper' song shoot". Bollywood Hungama. 2 November 2020. Retrieved 6 November 2020.
  15. "Bigg Boss 8's Diandra Soares Hates Sonali Because Of Her Supermodel Sister Ujjwala Raut?". Filmi Beat. 5 November 2014. Retrieved 14 March 2020.