సోనీ మోలోనీ
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | డెనిస్ ఆండ్రూ రాబర్ట్ "సోనీ" మోలోనీ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డునెడిన్, న్యూజీలాండ్ | 1910 ఆగస్టు 11|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1942 జూలై 15 ఎల్ అలమీన్, బ్రిటీష్-ఆక్రమిత ఈజిప్ట్ | (వయసు 31)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 30) | 1937 26 June - England తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1937 14 August - England తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1929–30 to 1934–35, 1938–39 to 1939–40 | Otago | |||||||||||||||||||||||||||||||||||||||
1935–36 to 1937–38 | Wellington | |||||||||||||||||||||||||||||||||||||||
1940–41 | Canterbury | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 1 April |
డెనిస్ ఆండ్రూ రాబర్ట్ " సోనీ " మోలోనీ (1910, ఆగస్టు 11 - 1942, జూలై 15) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున 1937లో ఇంగ్లాండ్ పర్యటనలో మూడు టెస్టులు ఆడాడు.
జననం, విద్య
[మార్చు]మోలోనీ 1910, ఆగస్టు 11న డునెడిన్‌లో జన్మించాడు. ఒటాగో బాయ్స్ హైస్కూల్‌లో చదువుకున్నాడు. అక్కడ క్రికెట్, రగ్బీ, అథ్లెటిక్స్‌లో పాఠశాలకు ప్రాతినిధ్యం వహించాడు.[1]
క్రికెట్ రంగం
[మార్చు]మిడిల్ ఆర్డర్ లేదా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా, లెగ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. సోనీ మోలోనీ 1929 నుండి 1941 వరకు న్యూజీలాండ్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరు 190. 1937 ఫిబ్రవరిలో ఆక్లాండ్‌పై వెల్లింగ్‌టన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.[2] మూడు నెలల తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీపై 23 పరుగులకు 5 వికెట్లు తీసి, తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించాడు.[3]
మొలోనీ 1937లో న్యూజీలాండ్ జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు, మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేశాడు. ఆల్బీ రాబర్ట్స్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు జోడించాడు.[4] పర్యటనలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ళలో ఒకడు, 26 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 34.83 సగటుతో 1463 పరుగులు చేసి, 26.68 సగటుతో 57 వికెట్లు తీసుకున్నాడు.[5] 1938-39లో సర్ జూలియన్ కాన్స్ XI తో జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[6]
ఉద్యోగం
[మార్చు]మోలోనీ డునెడిన్‌లో భీమా గుమస్తాగా పని చేస్తున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో సేవ చేయడానికి చేరాడు.[7]
మరణం
[మార్చు]1942, జూలై 15న రెండవ ప్రపంచ యుద్ధంలో మొదటి ఎల్ అలమీన్ యుద్ధంలో మరణించాడు.[8] మరణించే సమయంలో 20 పదాతిదళ బెటాలియన్‌లో లెఫ్టినెంట్‌గా ఉన్నాడు. ఎల్ అలమెయిన్ వార్ స్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు.[8][7]
మూలాలు
[మార్చు]- ↑ . "Personalities in Sport: No. XXVI: D. A. R. Moloney".
- ↑ "Auckland v Wellington 1936-37". Cricinfo. Retrieved 12 October 2021.
- ↑ "Cambridge University v New Zealanders 1937". Cricinfo. Retrieved 12 October 2021.
- ↑ "1st Test, Lord's, Jun 26 - 29 1937, New Zealand tour of England". Cricinfo. Retrieved 12 October 2021.
- ↑ Don Neely & Richard Payne, Men in White: The History of New Zealand International Cricket, 1894–1985, Moa, Auckland, 1986, p. 166.
- ↑ "New Zealand v Sir J Cahn's XI 1938–39". CricketArchive. Retrieved 6 September 2017.
- ↑ 7.0 7.1 "Denis Andrew Robert Moloney". Online Cenotaph. Retrieved 11 October 2021.
- ↑ 8.0 8.1 "Lieutenant MOLONEY, DENIS ANDREW ROBERT". Commonwealth War Graves Commission. Retrieved 21 May 2019.
బాహ్య లింకులు
[మార్చు]- Media related to Sonny Moloney at Wikimedia Commons
- సోనీ మోలోనీ at ESPNcricinfo
- Sonny Moloney at CricketArchive
- Cenotaph Record: Denis Andrew Robert Moloney