సోను శ్రీనివాస్ గౌడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోను శ్రీనివాస్ గౌడ
జననం
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుశాంభవి
వృత్తినటి

సోను శ్రీనివాస్ గౌడ కన్నడ వినోద పరిశ్రమకు చెందిన ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా సోషల్ మీడియా ప్రభావశీలి. 2022లో, ఆమె ఓటీటీ ప్లాట్ఫామ్ వూట్ (Voot)లో ప్రసారమైన బిగ్ బాస్ కన్నడ సీజన్‌ 1 లో పోటీదారు.[1] ఆమెని శాంభవి అని కూడా పిలుస్తారు.

ప్రారంభ జీవితం[మార్చు]

ఆమె కర్ణాటకలోని మాండ్యలో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే తన తండ్రి చనిపోవడంతో తనతోపాటు, సోదరుడు, తల్లి అందరూ మేనమామ సంరక్షణలో ఉన్నారు. సోనూ కర్ణాటకలోని హలగూర్‌లో పాఠశాల విద్యను, రామనగరలోని ఒక కళాశాల నుండి డిప్లొమా పూర్తిచేసింది.

కెరీర్[మార్చు]

ఆమె గతంలో టిక్‌టాక్ ద్వారా, భారతదేశంలో దాని నిషేధం తర్వాత, ఇన్‌స్టాగ్రామ్‌లో తన లిప్ సింకింగ్ వీడియోలను అప్‌లోడ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.

2021లో, సోనూ స్టార్ సువర్ణ కన్నడ గేమ్ షో సువర్ణ సూపర్‌స్టార్‌తో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. 2022లో, ఆమె వయాకామ్ 18 రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ ఓటీటీతో తన డిజిటల్ రంగ ప్రవేశం చేసింది. అందులో ఆమె టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది.

అదే సంవత్సరం, ఆమె కన్నడ చిత్రం క్యాడ్‌బరీస్‌లో అతిధి పాత్ర పోషించింది.

వివాదం[మార్చు]

ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక అమ్మాయిని దత్తత తీసుకున్న విషయం తెలియచేసింది. అయితే, ఈ దత్తత ప్రక్రియ చట్ట ప్రకారం జరగలేదని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు ఆమెపై బెంగళూరులోని బైదరహళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందూ దత్తత చట్టం, 1956 ప్రకారం ఈ దత్తత ప్రక్రియ జరగలేదని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పోలీసులు సోనూ శ్రీనివాస్ గౌడను 2024 మార్చి 22న అరెస్ట్ చేసారు.[2]

మూలాలు[మార్చు]

  1. "8 ఏళ్ల బాలికతో వీడియోలు.. బిగ్‌ బాస్‌ బ్యూటీ అరెస్ట్‌ | Bigg Boss Sonu Srinivas Gowda Arrest, Know Reasons Inside - Sakshi". web.archive.org. 2024-03-23. Archived from the original on 2024-03-23. Retrieved 2024-03-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Content creator Sonu Gowda arrested over illegal 'adoption' of girl child - The Hindu". web.archive.org. 2024-03-23. Archived from the original on 2024-03-23. Retrieved 2024-03-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)