సోఫీ డివైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోఫీ డివైన్
సోఫీ డివైన్ అడిలైడ్ స్ట్రైకర్స్ (WBBL) 2018
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సోఫీ ఫ్రాన్సిస్ మోనిక్ డివైన్
పుట్టిన తేదీ (1989-09-01) 1989 సెప్టెంబరు 1 (వయసు 34)
పోరిరువా, న్యూజిలాండ్
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి ఫాస్ట్/మీడియం బౌలింగ్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 102)2006 22 అక్టోబర్ - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2023 2 జులై - శ్రీ లంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.77
తొలి T20I (క్యాప్ 12)2006 18 అక్టోబర్ - ఆస్ట్రేలియా తో
చివరి T20I2023 12 జులై - శ్రీ లంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003/04–2006/07వెల్లింగ్టన్ బ్లేజ్, వెల్లింగ్టన్
2007/08కాంటర్బరీ మెజిసియన్స్, కాంటర్బరీ
2008/09–presentకాంటర్బరీ మెజిసియన్స్, కాంటర్బరీ
2014/15–2015/16సౌత్ ఆస్ట్రేలియన్ స్కార్పియన్స్, సౌత్ ఆస్ట్రేలియా
2015/16–2019/20అడిలైడ్ స్ట్రైకర్స్ (WBBL), అడిలైడ్
2016లౌబరో లైట్నింగ్ (మహిళల క్రికెట్)|లౌబరో లైట్నింగ్
2017–2018వార్విక్‌షైర్ మహిళా క్రికెట్ జట్టు|వార్విక్‌షైర్
2017యార్క్‌షైర్ డైమండ్స్
2017/18సౌత్ ఆస్ట్రేలియన్ స్కార్పియన్స్|సౌత్ ఆస్ట్రేలియా
2018–2019IPL సూపర్నోవాస్|సూపర్నోవాస్
2018లౌబరో లైట్నింగ్ (మహిళల క్రికెట్)|లౌబరో లైట్నింగ్
2018/19–2019/20పశ్చిమ ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు|పశ్చిమ ఆస్ట్రేలియా
2020/21–presentపెర్త్ స్కార్చర్స్ (WBBL)|పెర్త్ స్కార్చర్స్
2022–presentబర్మింగ్‌హామ్ ఫీనిక్స్
2023రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (WPL)
2023–presentగయానా అమెజాన్ వారియర్స్ (WCPL)
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WT20I
మ్యాచ్‌లు 131 112
చేసిన పరుగులు 3,266 2,839
బ్యాటింగు సగటు 30.52 29.57
100లు/50లు 6/14 1/17
అత్యధిక స్కోరు 145 105
వేసిన బంతులు 4,407 1,785
వికెట్లు 89 109
బౌలింగు సగటు 36.98 17.28
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/24 4/22
క్యాచ్‌లు/స్టంపింగులు 38/– 37/–
మూలం: ESPNcricinfo, 11 ఫిబ్రవరి 2023

సోఫీ ఫ్రాన్సిస్ మోనిక్ డివైన్ న్యూజిలాండ్ క్రీడాకారిణి. ఆమె న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు ( వైట్ ఫెర్న్స్ ) కు ప్రాతినిధ్యం వహించింది. ఇంకా న్యూజిలాండ్ మహిళల ఫీల్డ్ హాకీ జట్టు జాతీయ సభ్యురాలుగా ఫీల్డ్ హాకీ జట్టులో సభ్యురాలు (బ్లాక్ స్టిక్స్ ఉమెన్ ).[1][2] 21వ శతాబ్దపు క్రికెట్‌లో బ్యాటింగ్‌లో హెల్మెట్ ధరించకపోవడం అరుదు. ఆమె బ్యాటింగ్‌లో హెల్మెట్ ధరించదు అని పేరుంది. 2017 డిసెంబరులో, ఆమె ICC మహిళల T20Iకు ఆ సంవత్సరం 'టీమ్ ఆఫ్ ది ఇయర్‌ ప్లేయర్‌'లలో ఒకరిగా ఎంపికైంది.[3]

2018 ఆగస్టులో, గత నెలల్లో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల తర్వాత, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు నుంచి ఆమెకు సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది.[4][5] 2018 అక్టోబరులో, వెస్టిండీస్‌లో జరిగిన 2018 ICC మహిళా ప్రపంచ ట్వంటీ20 టోర్నమెంట్లో ఆడడం కోసం న్యూజిలాండ్ జట్టులో ఆమె ఎంపికైంది.[6][7] టోర్నీకి ముందే ఆమెను జట్టుకి స్టార్‌గా పేర్కొన్నారు.[8]

2020 జూలైలో, సోఫీ న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుకు పూర్తి-సమయ ప్రాతిపదికన నాయకత్వం వాయించింది.[9] అమీ సాటర్త్‌వైట్ నుండి బాధ్యతలు స్వీకరించింది.[10] 2021 సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ మ్యాచ్‌లో, సోఫీ తన 100వ WT20Iలో ఆడింది.[11]

క్రికెట్ జీవితం[మార్చు]

సోఫీ న్యూజిలాండ్‌లోని పోరిరువాలోని కెనెపురు హాస్పిటల్‌లో 1989 సెప్టెంబరు 1 న జన్మించింది. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్‌టన్ ఉత్తర శివారు ప్రాంతమైన తవాలో పెరిగింది, అక్కడ ఆమె గ్రీన్‌యాక్స్ పాఠశాల, తవా కళాశాలలో చదువుకుంది. ఆమె నాలుగేళ్ల వయసులో క్రికెట్, హాకీ ఆడటం ప్రారంభించింది. ఆల్ బ్లాక్ అవ్వాలని ఆశించింది. తవా కళాశాలలో ఆమె రిప్రజెంటేటివ్ వెల్లింగ్‌టన్ ఏజ్ గ్రూప్ జట్లు, తవా కాలేజ్ బాయ్స్ ఫస్ట్ 11 అనే బాలుర జట్లలో క్రికెట్ ఆడింది. ఇందులో ఆమె తవా క్లబ్ కోసం బాలుర ప్రీమియర్ హాకీ జట్టులో కూడా ఆడింది. తవా కళాశాలలో ఆమె చివరి సంవత్సరంలో ఉంది. సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసినందుకు 'బౌలింగ్ వికెట్' అను గౌరవం ఆమెకు లభించింది. మునుపటి విజేత బ్లాక్ క్యాప్స్ మార్క్ గిల్లెస్పీ. ఆమె 14 సంవత్సరాల వయస్సులో సీనియర్ మహిళల హాకీ ఆడటం ప్రారంభించింది. 14 సంవత్సరాల వయస్సులో ఆమె మొదటి తరగతి క్రికెట్ మొదలు పెట్టింది. 2006 చివరిలో, సోఫీ తండ్రి తన పనిరీత్యా మకాం మారిస్తే సోఫీ కూడా తన కుటుంబంతో కలిసి క్రైస్ట్‌చర్చ్‌కి మారింది. ఉన్నత పాఠశాల చివరి సంవత్సరానికి ఆమె రంగి రురు బాలికల పాఠశాలలో చదివిన తర్వాత ఆమె సోషియాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ను పూర్తి చేస్తూ కాంటర్‌బరీ విశ్వవిద్యాలయంలో చేరింది.[12]

Devine batting for New Zealand during the 2020 ICC Women's T20 World Cup
2020 ICC మహిళల T20 ప్రపంచ కప్ సందర్భంగా న్యూజిలాండ్ తరపున సోఫీ బ్యాటింగ్ చేస్తోంది.

సోఫీ 17 సంవత్సరాల పిన్న వయస్సులో న్యూజిలాండ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు వైట్ ఫెర్న్స్‌కు ఎంపికైంది. జట్టులో అందరికంటే ఈమెనే చిన్నది. వైట్ ఫెర్న్స్ కోచ్ స్టీవ్ జెంకిన్ ఆమెకు ఈ వార్తను అందించినప్పుడు ఆమె తవా కళాశాలలో హోమ్ ఎకనామిక్స్ తరగతిలో ఉంది.[13]

2018 నవంబరులో, 2018–19 మహిళల 'బిగ్ బాష్ లీగ్' సీజన్ కోసం 'అడిలైడ్ స్ట్రైకర్స్ స్క్వాడ్‌' లో ఆమె పేరు తెచ్చుకుంది.[14][15] 2019 మార్చిలో, న్యూజిలాండ్ క్రికెట్ వార్షిక అవార్డులలో ఆమె ANZ ఇంటర్నేషనల్ ఉమెన్స్ T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.[16] అమీ సటర్త్‌ వైట్ ప్రసూతి సెలవుపై వెళ్లడంతో ఆమె నాయకత్వ బాధ్యతలు చేపట్టింది.[17]

2020 జనవరిలో, ఆమె ఆస్ట్రేలియాలో జరిగే ICC మహిళల T20 ప్రపంచ కప్‌లో ఆడటానికి న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించింది.[18] 2020 ఫిబ్రవరి 10న, దక్షిణాఫ్రికాతో జరిగిన నాల్గవ WT20I మ్యాచ్‌లో సోఫీ తన మొదటి శతకాన్ని సాధించింది.[19] అదే మ్యాచ్‌లో, T20Iలలో పురుషులు, స్త్రీల మొత్తంలో వరుసగా ఐదు యాభైలు, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి క్రికెటర్ గా ఆమె గుర్తింపబడింది.[20] మహిళల T20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ మొదటగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, వరుసగా ఆరు యాభైలు అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన (పురుషులు, స్త్రీలలో కలిపి) మొదటి క్రికెటర్‌గా సోఫీ నిలిచింది.[21] టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ తరపున ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 132 పరుగులతో ఆమె అత్యధిక పరుగుల తీసిన క్రీడాకారిణిగా నిలిచింది.[22]

2020 నవంబరులో, ICC మహిళల T20I లో క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డుకు నామినేట్ చేయబడింది.[23][24] 2022 ఫిబ్రవరిలో, ఆమె న్యూజిలాండ్‌లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించింది.[25]

2022 ఏప్రిల్లో, ఇంగ్లాండ్‌లోని ది హండ్రెడ్ సీజన్ కి ఆడటానికి ఆమెను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఎంపిక చేసింది.[26] 2022 జూన్లో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగే 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలకు న్యూజిలాండ్ జట్టుకు ఆమె నాయకత్వం వహించింది.[27]

2023లో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడటానికి సోఫీను 50 లక్షల ధరకు ఒప్పందం చేసింది.[28]

రికార్డులు[మార్చు]

2015 జూలై 11న, సోఫీ ట్వంటీ20లో 18 బంతుల్లో అర్ధ శతకము, 22 బంతుల్లో 70 పరుగులు తీసి అంతర్జాతీయ రికార్డును (మహిళలు) అధిగమించింది. భారత్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో 32 పరుగులు చేసింది.[29] మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్ (WT20I) చరిత్రలో 18 బంతుల్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన రికార్డును ఆమె సొంతం చేసుకుంది.[30][31]

2017 మహిళా క్రికెట్ ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, మహిళల ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలలో తొమ్మిది ఆర్లు (సిక్సర్లు) కొట్టిన మొదటి మహిళ సోఫీ.[32][33]

2020లో, ఆమె T20Iలలో వరుసగా 6 అర్ధసెంచరీలు సాధించిన (పురుషులు, మహిళల మొత్తానికి) మొదటి క్రీడాకారిణి.[34]

2021 జనవరిలో, ఆమె 2020–21 'సూపర్ స్మాష్‌' లో 'ఒటాగో స్పార్క్స్‌' పై 'వెల్లింగ్టన్ బ్లేజ్' పోటీలో 36 బంతుల్లో 100 పరుగులు చేసి, వేగవంతమైన శతకం సాధించి మహిళల T20 రికార్డును అధిగమించింది.[35]

అంతర్జాతీయ శతకాలు[మార్చు]

2013 ఫిబ్రవరిలో, రెండున్నరేళ్ల తర్వాత న్యూజిలాండ్‌ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చిన తరువాత మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణ ఆఫ్రికాతో జరిగిన మొదటి (ఓపెనింగ్) మ్యాచ్‌లో తన తొలి అంతర్జాతీయ శతకాన్ని 131 బంతుల్లో 145 పరుగులు చేసింది. ఆఫ్రికా క్రీడాకారిణి సుజీ బేట్స్‌తో కలిసి 128 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. సారా మెక్‌గ్లాషన్‌తో 64 నికోలా బ్రౌన్‌తో 102 భాగస్వామ్యము చేసింది.[36] ఇన్నింగ్స్ సమయంలో, డివైన్ 13 నాలుగులు, ఆరు ఆరులు (సిక్సర్లు) కొట్టింది.[36] అయితే తర్వాత ఆమె ఇలా చెప్పింది, "నాకు బ్యాట్ మధ్యలో ఏమీ కనిపించలేదు. నేను నిజంగా గీతలుగానే భావించాను." [37]

దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత, 2017 2018 అక్టోబరు జూలై మధ్య కేవలం 10 మ్యాచ్‌ల సమయంలో, సోఫీ తన తదుపరి నాలుగు ఒకరోజు అంతర్జాతీయ మాచ్ లలో నాలుగు వేర్వేరు ప్రత్యర్థి జట్ల పై నాలుగు వేర్వేరు దేశాలలో శతకాలనుచేసింది.[38] ఆమె స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 2020లో తన తొలి T20I శతకం చేసే వరకు అంతర్జాతీయ శతకాలు చేయలేదు. ఆ సందర్భంగా, ఆమె బేట్స్‌తో కలిసి 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని పంచుకుని న్యూజిలాండ్‌ జట్టుకు మరో విజయాన్ని అందించింది. "దానికి నేను కొంచెం అదృష్టవంతురాలిని అని నాకు తెలుసు," అని ఆమె తర్వాత చెప్పింది.[37]

2022 మార్చిలో, న్యూజిలాండ్‌లో జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ మరో ఒకరోజు అంతర్జాతీయ పోటీ (WODI) లో వెస్టిండీస్‌పై ఆమె శతకము సాధించింది.[38]

2023 జూన్ 30న, ఆమె శ్రీలంకలో శ్రీలంకతో మూడు ODI ద్వైపాక్షిక సిరీస్‌లో జరిగిన రెండవ మ్యాచ్‌లో అమేలియా కెర్‌తో కలిసి 229 పరుగుల భాగస్వామ్యంతో న్యూజిలాండ్‌ను 116 పరుగులతో విజయానికి నడిపించింది.[39] ఒక రోజు పోటీలలో న్యూజిలాండ్ మహిళలు సాధించిన మూడో అత్యధిక భాగస్వామ్యం ఇది. ప్రతి క్రీడాకారిణి శతకాలు సాధించారు. సోఫీ కేవలం 121 బంతుల్లో 17 నాలుగులు, రెండు ఆర్లతో 137 పరుగులు చేసింది.[40][41]
అంతర్జాతీయ ఒక రోజు శతకాలు [38]
నం. పరుగులు ప్రత్యర్థులు నగరం, దేశం వేదిక సంవత్సరం
1 145 దక్షిణ ఆఫ్రికా కటక్, భారతదేశం DRIEMS గ్రౌండ్ 2013 [42]
2 103  పాకిస్తాన్ షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షార్జా క్రికెట్ స్టేడియం 2017 [43]
3 108  వెస్ట్ ఇండీస్ లింకన్, న్యూజిలాండ్ బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్ 2018 [44]
4 108  ఐర్లాండ్ డబ్లిన్, ఐర్లాండ్ ది వైన్యార్డ్ 2018 [45]
5 117 *  ఇంగ్లాండు లీసెస్టర్, ఇంగ్లాండ్ గ్రేస్ రోడ్ 2018 [46]
6 108  వెస్ట్ ఇండీస్ మౌంట్ మౌంగనూయి, న్యూజిలాండ్ బే ఓవల్ 2022 [47]
7 137 శ్రీ లంక గాలే, శ్రీలంక గాలే అంతర్జాతీయ స్టేడియం 2023 [48]
T20 అంతర్జాతీయ శతకాలు [39]
నం. పరుగులు ప్రత్యర్థులు నగరం, దేశం వేదిక సంవత్సరం
1 105 దక్షిణ ఆఫ్రికా వెల్లింగ్టన్, న్యూజిలాండ్ బేసిన్ రిజర్వ్ 2020 [49]

ప్రస్తావనలు[మార్చు]

  1. "Sophie Devine – Profile". Hockey New Zealand. Archived from the original on 15 August 2012. Retrieved 25 August 2012.
  2. Ragav, S. Dipak (13 March 2016). "Devine, the double international". The Hindu.
  3. "Ellyse Perry declared ICC's Women's Cricketer of the Year". ESPNcricinfo. Retrieved 21 December 2017.
  4. "Rachel Priest left out of New Zealand women contracts". ESPNcricinfo. Retrieved 2 August 2018.
  5. "Four new players included in White Ferns contract list". International Cricket Council. Retrieved 2 August 2018.
  6. "New Zealand women pick spin-heavy squads for Australia T20Is, World T20". ESPNcricinfo. Retrieved 18 September 2018.
  7. "White Ferns turn to spin in big summer ahead". New Zealand Cricket. Archived from the original on 18 September 2018. Retrieved 18 September 2018.
  8. "Key Players: New Zealand". International Cricket Council. Retrieved 4 November 2018.
  9. "Devine offered New Zealand captaincy on full-time basis". International Cricket Council. Retrieved 9 July 2020.
  10. "Sophie Devine named permanent New Zealand captain". ESPNcricinfo. Retrieved 9 July 2020.
  11. "Devine to join elite club". Radio New Zealand. 4 September 2021. Retrieved 4 September 2021.
  12. Sophie Devine sportsground.co.nz . Retrieved 28 January 2017
  13. Sophie Devine profile, Cricket New Zealand, Retrieved 28 January 2017
  14. "WBBL04: All you need to know guide". Cricket Australia. Retrieved 30 November 2018.
  15. "The full squads for the WBBL". ESPNcricinfo. Retrieved 30 November 2018.
  16. "Williamson named NZ Player of the Year at ANZ Awards". ESPNcricinfo. Retrieved 21 March 2019.
  17. "Sophie Devine named new White Ferns captain, replacing Amy Satterthwaite". Stuff (in ఇంగ్లీష్). 16 January 2020. Retrieved 2020-01-17.
  18. "Lea Tahuhu returns to New Zealand squad for T20 World Cup". International Cricket Council. Retrieved 29 January 2020.
  19. "Sophie Devine's maiden T20I century seals series for New Zealand". ESPNcricinfo. Retrieved 10 February 2020.
  20. "New Zealand claim T20I series 3–1 as rain plays spoilsport". International Cricket Council. Retrieved 13 February 2020.
  21. "Devine's sixth T20I fifty in a row seals New Zealand win". International Cricket Council. Retrieved 22 February 2020.
  22. "ICC Women's T20 World Cup, 2019/20 – New Zealand Women: Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 3 March 2020.
  23. "Virat Kohli, Kane Williamson, Steven Smith, Joe Root nominated for ICC men's cricketer of the decade award". ESPN Cricinfo. Retrieved 25 November 2020.
  24. "ICC Awards of the Decade announced". International Cricket Council. Retrieved 25 November 2020.
  25. "Leigh Kasperek left out of New Zealand's ODI World Cup squad". ESPN Cricinfo. Retrieved 3 February 2022.
  26. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  27. "Eden Carson, Izzy Gaze earn maiden New Zealand call-ups for Commonwealth Games". ESPN Cricinfo. Retrieved 20 May 2022.
  28. Tripathi, Anuj (ed.). "WPL Auction: NZ captain Sophie Devine becomes first foreigner to be sold, fetches Rs 50 lakh from RCB". India Today. Retrieved 21 February 2023.
  29. "Sophie Devine World Record T20i Half Century". YouTube. Retrieved 27 November 2021.
  30. "Records | Women's Twenty20 Internationals | Batting records | Fastest fifties | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2017-06-09.
  31. Watch: Kiwi cricketer slams fastest ever 50 NZ Herald Retrieved 24 August 2017
  32. "Women's World Cup: Sophie Devine hits nine sixes to break world record". BBC Sport. Retrieved 8 July 2017.
  33. It's 'boom town' as world record six-hitter Sophie Devine smashes White Ferns to win stuff.co.nz Retrieved 24 August 2017
  34. "Records | Women's Twenty20 Internationals | Batting records | Fifties in consecutive innings". Cricinfo.com. Retrieved 27 November 2021.
  35. "Sophie Devine hits 36-ball hundred – fastest in women's T20 cricket". BBC Sport. 14 January 2021.
  36. 36.0 36.1 "Devine's ton helps New Zealand crush South Africa by 150 runs in Women's World Cup". The Times of India. PTI. 2013-02-01. Retrieved 2023-04-21.
  37. 37.0 37.1 Anderson, Merryn (1 March 2022). "Sophie Devine's terrible first century". LockerRoom (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-21.
  38. 38.0 38.1 38.2 "All-round records | Women's One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com – Sophie Devine". ESPNcricinfo. Retrieved 2023-04-21.
  39. 39.0 39.1 "All-round records | Women's Twenty20 Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com – Sophie Devine". ESPNcricinfo. Retrieved 1 November 2021.
  40. ESPNcricinfo staff (2023-06-30). "Kerr and Devine tons lead New Zealand fightback to draw level". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-07.
  41. Tailor, Yash (2023-07-01). "Amelia Kerr and Sophie Devine's 229 Run Partnership helps New Zealand level ODI series 1-1". Female Cricket. Retrieved 2023-07-07.
  42. "Full Scorecard of NZ Women vs SA Women 4th Match, Group B 2012/13 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 1 November 2021.
  43. "Full Scorecard of NZ Women vs PAK Women 1st ODI 2017/18 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 1 November 2021.
  44. "Full Scorecard of NZ Women vs WI Women 1st ODI 2017/18 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 1 November 2021.
  45. "Full Scorecard of NZ Women vs Ire Women 2nd ODI 2018 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 1 November 2021.
  46. "Full Scorecard of ENG Women vs NZ Women 3rd ODI 2017/18-2021 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 1 November 2021.
  47. "1st Match (D/N), Mount Maunganui, Mar 4 2022, ICC Women's World Cup". ESPNcricinfo. Retrieved 4 March 2022.
  48. "NZ WMN vs SL WMN Scorecard 2022/23-2025 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-07.
  49. "Full Scorecard of NZ Women vs SA Women 4th T20I 2019/20 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 1 November 2021.

బాహ్య లంకెలు[మార్చు]

  • మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీల జాబితా
  • మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీల జాబిత
  • సోఫీ డివైన్ at ESPNcricinfo
  • Sophie Devine at CricketArchive (subscription required