సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ (హైదరాబాదు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్
(హైదరాబాదు)
సాధారణ సమాచారం
రకంసైక్లింగ్ ట్రాక్
ప్రదేశంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాదు, తెలంగాణ
పూర్తి చేయబడినది2023
ప్రారంభం2023 అక్టోబరు 1
యజమానిహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (HMDA)

సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ అనేది భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్డుపై నిర్మించిన సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌.[1]

నిర్మాణం

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)లో ప్రధాన క్యారేజ్‌వే, సర్వీస్ రోడ్డు మధ్య 23 కిలోమీటర్ల పొడవునా సైకిల్ ట్రాక్‌ను నిర్మించతలపెట్టింది.[2] సెప్టెంబర్ 2022లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేసాడు.[3] ఇది నానక్‌రామ్‌గూడ నుండి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ వరకు 8.5 కిలోమీటర్ల పొడవు, నార్సింగి నుండి కొల్లూరు వరకు 14.50 కిలోమీటర్ల పొడవున సైకిల్ ట్రాక్, 16 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ పైకప్పుతో నిర్మించడం ప్రణాళిక.[4] సైకిల్ ట్రాక్ వెడల్పు 4.5 మీటర్లు, రెండు వైపులా ఒక మీటర్ గ్రీన్ స్పేస్ ఉంటుంది. ఇది దక్షిణ కొరియా మోడల్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్ గా లైటింగ్, రెయిన్ ప్రొటెక్షన్, పార్కింగ్, ఫుడ్ స్టాల్స్ వంటి ఇతర సౌకర్యాలను కలిగిఉంటుంది. దీనికోసం హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (HMDA), హైదరాబాదు గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) అధికారుల బృందం దక్షిణ కొరియాను సందర్శించి సైకిల్ ట్రాక్ ప్రాజెక్ట్‌ను అధ్యయనం చేసింది.

ప్రారంభం

[మార్చు]

హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్డుపై అత్యాధునిక సౌకర్యాలతో 23 కిలోమీటర్ల మేర హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) నిర్మించిన సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ని తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 2023 అక్టోబరు 1న ప్రారంభించాడు.[5] ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ దక్షిణ కొరియాలో ఉండగా, దానిని పూర్తిగా అధ్యయనం చేశాక దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాదులో నిర్మించామన్నాడు. సైక్లింగ్ ద్వారా ఎంతో వ్యాయామం లభిస్తుందని ప్రజలకు గుర్తుచేసాడు.

సదుపాయాలు

[మార్చు]
  • అవుటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి, గండిపేట మార్గంలో 4.25 మీటర్ల వెడల్పుతో మూడు లేన్లలో సైక్లింగ్ ట్రాక్ నిర్మించారు. ఈ ట్రాక్ పై సోలార్ రూఫ్ ఉండడం వల్ల ఇది సూర్యరశ్మిని ఉపయోగించుకుని 16 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ విద్యుత్తును ట్రాక్‌ చుట్టూ లైటింగ్‌, అవుటర్‌పై ఇతర అవసరాల కోసం వాడుకున్నాక మిగతా విద్యుత్తు గ్రిడ్‌కు అందిస్తారు.
  • ఇక్కడ ఫుడ్ కోర్టులు, విశ్రాంతి గదులు, తాగునీరు, సైకిల్ రెంట్, రిపేర్ షాపులు వగైరా సదుపాయాలు ఏర్పాటు చేసారు. అలాగే ట్రాక్ పొడవునా పూల మొక్కలు పెంచడంతో పాటు సిసి కెమెరాలు కూడా అమర్చారు.
  • తమ సొంత వాహనాలను పార్క్ చేసుకోవడానికి వీలుగా పార్కింగ్‌లు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "KTR | దేశంలోనే తొలి సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ హైదరాబాద్‌లో .. ప్రారంభించిన కేటీఆర్‌-Namasthe Telangana". web.archive.org. 2023-10-01. Archived from the original on 2023-10-01. Retrieved 2023-10-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Hyderabad: Solar roof-topped cycling track to come up on Outer Ring Road".
  3. "Foundation laid for 21-km solar-roof cycling track on ORR".
  4. "Solar panels to dot ORR cycling track, cost Rs 88cr".
  5. "KTR: ఓఆర్‌ఆర్‌ చుట్టూ సైకిల్‌ ట్రాక్‌.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ | minister ktr inaugurated the cycle track". web.archive.org. 2023-10-01. Archived from the original on 2023-10-01. Retrieved 2023-10-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)