Jump to content

తెలంగాణ పోలీస్ అకాడమీ

వికీపీడియా నుండి
రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ
ఇతర పేర్లు
టి.ఎస్.పి.ఏ
పూర్వపు నామము
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ
ఆంగ్లంలో నినాదం
అవసరమైన జ్ఞానం, అవసరమైన నైపుణ్యాలు, సరైన వైఖరి
రకంప్రభుత్వ సంస్థ
స్థాపితం19 మే 1986
డైరెక్టర్అభిలాషా బిష్త్
స్థానంమంచిరేవుల, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
కాంపస్175 ఎకరాలు (0.71 కి.మీ2)
రంగులుముదురు ఎరుపు రంగు[1]
 
అనుబంధాలుయునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్

రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టి.ఎస్.పి.ఏ), తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ సంస్థ. పోలీసులు, ఇతర చట్ట అమలు సంస్థలు, ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు, నేర న్యాయవ్యవస్థలో సేవలు ఈ సంస్థలో భాగంగా ఉంటారు.

హైదరాబాద్‌లోని మంచిరేవుల పరిసరాల ప్రాంతంలో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ సహకారంతో ఇది పనిచేస్తోంది. తెలంగాణ పోలీస్ అకాడమీ "బెంచ్‌మార్క్" శిక్షణా సంస్థగా కూడా గుర్తింపు పొందింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విభజించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని షెడ్యూల్ 10లో ఈ అకాడమీ జాబితా చేయబడి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీగా పేరు మార్చబడింది.

భౌగోళికం

[మార్చు]

హిమాయత్ సాగర్‌లోని కొండప్రాంతంలోని 175 ఎకరాలలో ఈ పోలీస్ అకాడమీ విస్తరించి ఉంది. హైదరాబాదు నగరం నుండి హైదరాబాద్ - చేవెళ్ల రహదారిలో సుమారు 25 కి.మీ.ల దూరంలో ఈ అకాడమీ ఉంది.

చరిత్ర

[మార్చు]

1986లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీకి శంకుస్థాపన చేశాడు. పోలీసు అధికారి శ్రీ సి. ఆంజనేయ రెడ్డి (ఐపిఎస్) ఈ అకాడమీ ఏర్పాటుకు కృషిచేశాడు. ఏవి సుబ్బారావు, (ఐపిఎస్), హెచ్.జె. దొర (ఐపిఎస్), ఎంవి కృష్ణారావు (ఐపిఎస్), జస్పాల్ సింగ్ (ఐపిఎస్), ఏకె మొహంతి (ఐపిఎస్), ఎం. రతన్ (ఐపిఎస్), సిఎన్ గోపిన్ నాథ రెడ్డి (ఐపిఎస్), నండూరి సాంబశివరావు (ఐపిఎస్), డాక్టర్ ఎం.మాలకొండయ్య (ఐపిఎస్) ఈ అకాడమీకి సేవలు అందించారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, త్రిపుర, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు భారతదేశం అంతటా శిక్షణ పొందిన వారికి ఈ అకాడమీలో వృత్తిపరమైన శిక్షణ అందించబడింది. ఈ అకాడమీ 4,396 మంది పోలీసు సిబ్బంది, ప్రాసిక్యూటింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చింది.

కోర్సులు

[మార్చు]

ఇండక్షన్ కోర్సులు

[మార్చు]
  • ప్రాథమిక కోర్సులు
  • ప్రీ-ప్రమోషన్ కోర్సులు
  • ఓరియంటేషన్ కోర్సులు[2]

ఇన్-సర్వీస్ కోర్సులు

[మార్చు]
  • ఇన్వెస్టిగేషన్‌లో మొదటి కోర్సు.
  • స్టేషన్ హౌస్ నిర్వహణ.
  • పోలీసు అధికారులకు అవసరమైన చట్టం.
  • ఫోరెన్సిక్ సైన్స్ & ఫోరెన్సిక్ మెడిసిన్‌లో మొదటి కోర్సు.[3]

ఫ్యాకల్టీ విభాగాలు

[మార్చు]
  • పోలీస్ సైన్స్
  • ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ
  • చట్టం
  • ఫోరెన్సిక్ సైన్స్
  • ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ
  • కంప్యూటర్లు
  • నిర్వహణ, సామాజిక శాస్త్రాలు
  • పరిపాలన (మినిస్టీరియల్ సిబ్బంది కోసం కోర్సులు)
  • క్షేత్ర శిక్షణ[3]

గుర్తింపు

[మార్చు]

అకాడమీకి ఇతర సంస్థల నుండి గుర్తింపు లభించింది:[4] వాటి వివరాలు

  • గ్యారీ లూయిస్, యుఎన్ఓడిసి, ఆర్ఓఎస్ఏ ప్రతినిధి
  • వాన్ జూ కిమ్, అసిస్టెంట్. పౌర హక్కుల విభాగానికి అటార్నీ జనరల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యుఎస్ఏ.
  • ఇవాన్ ఆండ్రూ యంగ్, న్యాయ విభాగం, యునైటెడ్ స్టేట్స్.
  • డ్యూక్ లోక్కా, ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్, యుఎస్. రాయబార కార్యాలయం, న్యూఢిల్లీ.
  • డా. పియం నాయర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, యుఎన్ఓడిసి.

మ్యూజియం

[మార్చు]

ఇక్కడ డాక్టర్ హాంకిన్స్ తెలంగాణ పోలీస్ మ్యూజియం ఉంది. నిజాం రాష్ట్రం సమయంలో నిజాం 1880లో V, VIలలో పోలీసు మొదటి ఇన్స్పెక్టర్ జనరల్ గా పనిచేసిన హాంకిన్స్ డాక్టర్ పేరుమీదుగా దీనికి పేరు పెట్టబడింది.[5]

గ్యాలరీలు

[మార్చు]
  • ఎడ్జ్డ్ ఆర్మ్స్ గ్యాలరీ
  • ఫైర్ ఆర్మ్స్ గ్యాలరీ
  • పోలీసు గ్యాలరీ
  • ఫోరెన్సిక్ గ్యాలరీ
  • కమ్యూనికేషన్ గ్యాలరీ

ఈ మ్యూజియంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు చెందిన జుల్ఫికర్ ఖడ్గం కూడా ఉంది.[6]

ఇతర సౌకర్యాలు

[మార్చు]
  • గ్రంథాలయం[7]
  • పరిశోధన కేంద్రం
  • ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ మెస్
  • ఆడిటోరియం
  • బ్యాంకు
  • ఆసుపత్రి
  • స్విమ్మింగ్ ఫూల్
  • అథ్లెటిక్ ట్రాక్
  • స్టేడియం
  • తపాలా కార్యాలయము
  • రవాణా
  • వెల్ఫేర్ స్టోరు

మూలాలు

[మార్చు]
  1. "Sacred Symbols". National Defence Academy. 2006. Archived from the original on 21 జూలై 2011. Retrieved 5 జనవరి 2022.
  2. "Gov.in". appoliceacademy.gov.in. Archived from the original on 18 February 2010. Retrieved 2022-01-05. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. 3.0 3.1 "Gov.in". appoliceacademy.gov.in. Archived from the original on 4 September 2009. Retrieved 2022-01-05. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "How Police Academies Work". HowStuffWorks. 14 March 2008.
  5. "Gov.in". appoliceacademy.gov.in. Archived from the original on 13 March 2018. Retrieved 2022-01-05. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "Dr. Hankins A.P.Police Museum & Discovery Center". Archived from the original on 10 October 2011. Retrieved 2022-01-05. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. "Gov.in". appoliceacademy.gov.in. Archived from the original on 14 June 2009. Retrieved 2022-01-05. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)