సౌగతా రాయ్
Appearance
సౌగతా రాయ్ | |||
| |||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2009 | |||
నియోజకవర్గం | డమ్ డమ్ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | శిల్లోంగ్, అస్సాం, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు మేఘాలయ) | 1946 ఆగస్టు 6||
జాతీయత | భారతీయుడి | ||
రాజకీయ పార్టీ | అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ ( 1998 వరకు) | ||
జీవిత భాగస్వామి | డాలీ రాయ్ | ||
నివాసం | 162/D 593, లేక్ గార్డెన్స్, కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం-700 045 |
సౌగతా రాయ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బరాక్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలిచి చరణ్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పెట్రోలియం మరియు రసాయనాల శాఖా మంత్రిగా పనిచేశాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1968 నుండి 1969 వరకు పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్ ప్రధాన కార్యదర్శి
- 1973 నుండి 1977 వరకు పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శి
- 1977లో బారక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- 1979లో చరణ్ సింగ్ మంత్రిత్వ శాఖలో పెట్రోలియం శాఖ సహాయ మంత్రి
- 1987 నుండి 2009 వరకు 5 సార్లు వరుసగా బెంగాల్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
- 2009లో డమ్ డమ్ నియోజకవర్గం నుండి 2వ సారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- 2009 నుండి 2012 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.
- 2014లో డమ్ డమ్ నియోజకవర్గం నుండి 3వ సారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- పార్లమెంట్ లో పబ్లిక్ అండర్‌టేకింగ్‌ల కమిటీ సభ్యుడు ( 2014 ఆగస్టు 14 - 2016 ఏప్రిల్ 30)
- పార్లమెంట్ లో రూల్స్ కమిటీ సభ్యుడు ( 2014 సెప్టెంబరు 1 – 2019 మే 25)
- పార్లమెంట్ లో ఫైనాన్స్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడు ( 2014 సెప్టెంబరు 1 – 2019 మే 25)
- పార్లమెంట్ లో కన్సల్టేటివ్ కమిటీ, రక్షణ మంత్రిత్వ శాఖ సభ్యుడు ( 2014 సెప్టెంబరు 1 – 2019 మే 25)
- పార్లమెంట్ లో జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ సభ్యుడు ( 2014 డిసెంబరు 11 – 2019 మే 25)
- పార్లమెంట్ లో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో భద్రతపై జాయింట్ కమిటీ సభ్యుడు ( 2015 ఏప్రిల్ 29 – 2019 మే 25)
- 2019లో డమ్ డమ్ నియోజకవర్గం నుండి 4వ సారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- పార్లమెంట్ లో పబ్లిక్ అండర్‌టేకింగ్‌ల కమిటీ సభ్యుడు (24 జూలై 2019 - ప్రస్తుతం)
- పార్లమెంట్ లో ఫైనాన్స్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడు ( 2019 సెప్టెంబరు 13 – ప్రస్తుతం)
- పార్లమెంట్ లో కన్సల్టేటివ్ కమిటీ, రక్షణ మంత్రిత్వ శాఖ సభ్యుడు ( 2019 సెప్టెంబరు 13 – ప్రస్తుతం)
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2021). "Saugata Roy". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.