సౌమనశ్య రామ్మోహనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సౌమనశ్యమూర్తి రామ్మోహనరావు ఆకాశవాణి కళాకారుడు. ఆయన ఆకాశవాణి శ్రోతలకు పరిచితమైన కళాకారుడు, దర్శకుడు. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

గుంటూరు జిల్లా చినపులివర్రులో 1921లో రామ్మోహనరావు జన్మిం చాడు. తెనాలి రామవిలాస సభలో తన తండ్రితోపాటు రిహార్సల్స్ కు వెళ్ళే రామ్మోహనరావు నాటక రంగం వైపు ఆకర్షితులయ్యాడు. శ్రీకృష్ణ రాయభారం నాటకంలో విదుర పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేసిన రామ్మోహనరావు భక్తరామదాసు, కబీరు, ప్రతాపరుద్రీయం, బాలనాగమ్మ, పన్నా శాక్య సింహ వంటి నాటకాలలో ముఖ్య భూమికలను పోషించాడు. బాపట్లలో వడ్లమూడి సీతారామారావు స్థాపించిన జాతీయ నాటక కళా మందిర్లో సభ్యుడిగా తారాబలం, విశ్వంపెళ్లి, రాబందులు వంటి నాట కాలలో నటించారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో ఉత్తమ క్యారక్టరు నటునిగా బహుమతి పొందాడు. మహానటుడు బందాతో కలిసి చిత్రనళీయం, అల్లూరి సీతారామరాజు, పాదుకా పట్టాభిషేకం వంటి నాటకాలను తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలతోపాటు కలకత్తా, బిలాస పూర్, ఖరగ్ పూర్ వంటి ప్రాంతాలలో కూడా ప్రదర్శించారు. 1961లో ఏషియన్ థియేటర్, ఢిల్లీ భారతీయ నాట్యసంఘం ఢిల్లీలో నిర్వహిం చిన నాటక శిబిరంలో శిక్షణ పొందారు. ఢిల్లీలో కె వెంకటేశ్వరరావుతో కలిసి దక్షిణ భారత నటీనట సమాఖ్యను స్థాపించి ఆకాశరామన్న గుడ్డిలోకం, కప్పలు వంటి నాటకాలను ప్రదర్శించారు. సుంకర కనకా రావు విజయవాడలో నెలకొల్పిన అరుణోదయ నాట్యమండలిలో సభ్యుడిగా యోగి వేమన నాటకంలో వేమన పాత్రను పోషించారు. అయ్యప్ప, కన్యకాపరమేశ్వరి, భక్తసిరియాళ వంటి నాటకాలను స్వీయ దర్శకత్వంలో ప్రదర్శించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమైన వందలాది నాటకాలలో కీలక పాత్రలను పోషించారు. 1990 జూలై 21న రామ్మోహనరావు పరమపదించారు.

మూలాలు

[మార్చు]
  1. http://epaper.andhrajyothy.com/c/12021265[permanent dead link]