స్థానిక స్వపరిపాలన

వికీపీడియా నుండి
(స్థానిక స్వపరిపాలనా సంస్థలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
స్థానిక స్వపరిపాలనా సంస్థ వర్గానికి చెందిన ముసిపట్ల గ్రామ పంచాయితీ కార్యాలయం

ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వామం ఉండాలి. పెద్దదేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన భారతదేశంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలంటే పరిపాలన / పరిపాలనా అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటైంది.[1]

సారాంశం

[మార్చు]

భారతదేశం మూడు ప్రభుత్వ రంగాలతో కూడిన యూనియన్ రిపబ్లిక్ : జాతీయ సమాఖ్య, రాష్ట్రం, స్థానికం. 73వ, 74వ రాజ్యాంగ సవరణలు స్థానిక ప్రభుత్వానికి గుర్తింపు, రక్షణను అందిస్తాయి. అదనంగా ప్రతి రాష్ట్రం దాని స్వంత స్థానిక ప్రభుత్వ చట్టాన్ని కలిగి ఉంది. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు జాతీయ స్థాయిలో, ప్రతి రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వానికి పర్యవేక్షణ బాధ్యతను కలిగి ఉంటాయి. 2019 మధ్య నాటికి, మొత్తం 267,283 స్థానిక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వీటిలో 262,834 గ్రామీణ, 4,449 పట్టణాలు ఉన్నాయి. పట్టణ స్థానిక సంస్థల్లో నగరాలకు మున్సిపల్ కార్పొరేషన్లు, పెద్ద పట్టణాలకు మునిసిపాలిటీలు, చిన్న పట్టణాల కోసం పట్టణ పంచాయతీలు (నగర పంచాయితీలు) ఉన్నాయి.పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు (గ్రామ పంచాయితీలు) రెండూ రాష్ట్ర-స్థాయి చట్టం ద్వారా నిర్వహించబడతాయి. ఇది స్థానిక పన్ను- పెంపు అధికారాలను నిర్ణయిస్తుంది. [2]

ప్రయోజనాలు

[మార్చు]
  1. స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తాయి.
  2. వీటిలో అనుభవం పొందిన నాయకులు, రాష్ట్ర, కేంద్ర నాయకులుగా ఎదుగుతారు.
  3. పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవాతత్పరత, బాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి.
  4. అధికార వికేంద్రీకరణకు, స్థానిక వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తగ్గించటానికి తోడ్పడతాయి.
  5. ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం.

స్థానిక స్వపరిపాలన సంస్థలు - రకాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. గాజుల సత్యనారాయణ, (2004-01-01). తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష. p. 717.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  2. http://www.clgf.org.uk/default/assets/File/Country_profiles/India.pdf
  3. "Types of Urban Bodies in India - GKToday". www.gktoday.in. Retrieved 2021-02-20.
  4. "స్థానిక స్వపరిపాలన సంస్థలు | దీపిక |". NavaTelangana. 2015-04-25. Retrieved 2021-02-02.

వెలుపలి లంకెలు

[మార్చు]