స్పానిష్ ఫ్లూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Spanish flu
వ్యాధిInfluenza
వైరస్ స్ట్రెయిన్Strains of A/H1N1
ప్రదేశంWorldwide
అనుమానిత కేసులు500 million (estimate)[1]
మరణాలు
17–100 million (estimates)
Suspected cases have not been confirmed as being due to this strain by laboratory tests, although some other strains may have been ruled out.

స్పానిష్ ఫ్లూ దీనిని 1918 ఇన్ఫ్లుఎంజా పాండమిక్ అని కూడా పిలుస్తారు. ఇది హెచ్ 1 ఎన్ 1 ఇన్ఫ్లుఎంజా ఎ వైరస్ వల్ల కలిగే అసాధారణమైన ప్రాణాంతక ఇన్ఫ్లుఎంజా మహమ్మారి. 1918 ఫిబ్రవరి నుండి 1920 ఏప్రిల్ వరకు ఇది 500 మిలియన్ల మందికి (ఆ సమయంలో ప్రపంచ జనాభాలో మూడవ వంతు) సోకింది. ఇది నాలుగు తరంగాల వరుసలుగా సోకింది. ఈ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య 20 మిలియన్ల నుండి 50 మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా వేయబడింది. అయినప్పటికీ అంచనాలను దాటి మరణాలు 17 మిలియన్ల నుండి 100 మిలియన్ల వరకు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇది మానవ చరిత్రలో అత్యంత ప్రాణాంతక మహమ్మారిలో ఒకటిగా నిలిచింది.[2][3][4]

అనారోగ్యం & మరణాల మొదటి పరిశీలనలో అమెరికా సంయుక్త రాష్ట్రం (కాన్సాస్‌లో) 1918 మార్చిలో ఈ మహమ్మారిని నిర్ధారించబడింది. తరువాత ఏప్రిల్‌లో ఫ్రాన్స్, జర్మనీ యునైటెడ్ కింగ్‌డంలలో ఈ మహమ్మారి నమోదు చేయబడింది. ప్రజల ధైర్యాన్ని కాపాడుకోవడానికి మొదటి ప్రపంచ యుద్ధం గణాంకాల నివేదికలు ఈ ప్రారంభ నివేదికల సంఖ్యను తగ్గించాయి. తటస్థంగా ఉన్న స్పెయిన్లోని వార్తాపత్రికలు ఈ అంటువ్యాధి ప్రభావాలను స్వేచ్ఛగా నివేదించాయి. కింగ్ 8 వ అల్ఫోన్సో తీవ్రమైన అనారోగ్యం వంటి కథనాలు స్పెయిన్ గురించి తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించాయి. చివరకు ఇది "స్పానిష్" ఫ్లూ అనే పేరుకు మారడానికి దారితీసింది. పాండమిక్ భౌగోళిక మూలాన్ని దాని స్థానానికి భిన్నమైన అభిప్రాయాలతో గుర్తించడానికి చారిత్రక, ఎపిడెమియోలాజికల్ డేటా సరిపోదని భావిస్తున్నారు.

సాధారణంగా ఇన్ఫ్లుఎంజా వ్యాప్తి అతి పిన్నవయస్కులలో, ముసలివారిని చంపినప్పటికీ మధ్య వయస్కులలో మరణాలశాతం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ స్పానిష్ ఫ్లూ మహమ్మారి కారణంగా యువకులలో మరణాలశాతం అధికంగా నమోదైంది.[5] 1918 ఇన్ఫ్లుఎంజా మహమ్మారి అధిక మరణాల రేటుకు శాస్త్రవేత్తలు అనేక వివరణలు ఇస్తున్నారు. వీటిలో ఆరు సంవత్సరాల తీవ్రమైన వాతావరణ మార్పుల వ్యాధి వాహకాల వలసలను ప్రభావితం చేసింది. జలాశయాలు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలను అధికరించాయి.[6] [6] కొన్ని విశ్లేషణలు వైరస్ ముఖ్యంగా ప్రాణాంతకమని చూపించాయి. ఎందుకంటే ఇది సైటోకిన్ తుఫానును ప్రేరేపిస్తుంది. ఇది యువకుల బలమైన రోగనిరోధక శక్తిని నాశనం చేస్తుందని పరిశోధనలు తెలియజేసాయి.[7][8] దీనికి విరుద్ధంగా మహమ్మారి కాలం నుండి మెడికల్ జర్నల్సుల పునః పరిశీలనల 2007 విశ్లేషణలో వైరల్ ఇన్ఫెక్షన్ మునుపటి ఇన్ఫ్లుఎంజా జాతుల కంటే దూకుడుగా లేదని కనుగొన్నారు. దీనికి బదులుగా, పోషకాహార లోపం, రద్దీతో కూడిన వైద్య శిబిరాలు, ఆస్పత్రులు, పేలవమైన పరిశుభ్రత ఆనాటి యుద్ధంతో ఇది తీవ్రతరరూపం దాల్చిందని భావించారు. ఈ కారణాలు బ్యాక్టీరియా సూపర్‌ఇన్‌ఫెక్షన్‌ను ప్రోత్సహించాయి. ఈ సూపర్ఇన్ఫెక్షన్ చాలా మంది బాధితులను చంపింది. కొంతకాలం మరణశయ్యలో బాధపడిన తరువాత మరణం సంభవించడం జరిగింది.[9][10]

హెచ్ 1 ఎన్ 1 ఇన్ఫ్లుఎంజా ఎ వైరస్ వల్ల కలిగే మూడు ఫ్లూ మహమ్మారిలో 1918 సంభవించిన స్పానిష్ ఫ్లూ మొదటిది; ఇటీవలిది 2009 స్వైన్ ఫ్లూ మహమ్మారి.[11] 1977 రష్యన్ ఫ్లూ కూడా హెచ్ 1 ఎన్ 1 వైరస్ వల్ల సంభవించింది. ఇది కూడా అధికంగా యువ జనాభాను ప్రభావితం చేసింది.[12][13]

పేరువెనుక చరిత్ర[మార్చు]

ఈ మహమ్మారి భౌగోళిక మూలం తెలియకపోయినా ఈ మహమ్మారి మొదటి తరంగం నుండి దీనిని స్పానిష్ ఫ్లూ అని పిలవలేదు.[14][15][16] మొదటిప్రపంచ యుద్ధంలో స్పెయిన్ పాల్గొనకుండా తటస్థంగా ఉంటూ యుద్ధకాల సెన్సార్‌షిప్ విధించకుండా ఉండిపోయింది.[17][18] ఫలితంగా కింగ్ 8 వ అల్ఫోన్సో తీవ్రమైన అనారోగ్యం వంటి అంటువ్యాధి ప్రభావాలను నివేదించడానికి వార్తాపత్రికలు స్వేచ్ఛగా ఉన్నాయి. విస్తృతంగా వ్యాపించిన ఈ కథానాలు స్పెయిన్ గురించిన తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించాయి.

మహమ్మారి వ్యాపించిన సమయంలో దీనికి ప్రత్యామ్నాయ పేర్లు కూడా ఉపయోగించబడ్డాయి. స్పానిష్ ఫ్లూ పేరు మాదిరిగానే వీటిలో చాలా వరకు వ్యాధి మూలాధారాలను కూడా సూచిస్తాయి. సెనెగల్‌లో దీనికి 'బ్రెజిలియన్ ఫ్లూ' అని, బ్రెజిల్‌లో 'జర్మన్ ఫ్లూ' అని పేరు పెట్టగా, పోలాండ్‌లో దీనిని 'బోల్షివిక్ వ్యాధి' అని పిలిచారు.[19]

ఈ వైరస్ ఇతర నామాలలో " 1918 ఇంఫ్లుయెంజా పాండమిక్ ", " ది 1918 ఫ్లూ పాండమిక్ ", ఇతర వైవిధ్యాలు ఉన్నాయి. [20][21][22]

చరిత్ర[మార్చు]

కాలవ్యవధి[మార్చు]

1918 లో మొదటి అల[మార్చు]

ఈ మహమ్మారి మొదటిగా 1918 మార్చి 4 న ప్రారంభమైనట్లు గుర్తించబడింది. యునైటెడ్ స్టేట్స్ లోని కాన్సాస్ లోని క్యాంప్ ఫన్స్టన్ వద్ద ఆర్మీ కుక్ అయిన ఆల్బర్ట్ గిట్చెల్ కేసును రికార్డింగ్ చేయడంతో అతని ముందు కేసులు ఉన్నప్పటికీ.[23] 1918 జనవరిలో హాస్కెల్ కౌంటీలో ఈ వ్యాధి మొదటిసారిగా గుర్తించబడింది. స్థానిక వైద్యుడు లోరింగ్ మైనర్ యు.ఎస్. పబ్లిక్ హెల్త్ సర్వీస్ అకాడెమిక్ జర్నల్‌ను హెచ్చరించమని కోరాడు.[24] కొద్ది రోజుల వ్యవధిలోనే శిబిరంలో 522 మంది పురుషులు అనారోగ్యంతో ఉన్నట్లు నివేదించారు.[25] 1918 మార్చి 11 నాటికి వైరస్ న్యూయార్కులోని Queens చేరుకుంది.[26] తరువాత మార్చి / ఏప్రిల్‌లో నివారణ చర్యలు తీసుకోవడంలో వైఫల్యం జరిగినట్లు విమర్శించబడింది.

మొదటి ప్రపంచ యుద్ధంలో యుఎస్ ప్రవేశించినందున ఈ వ్యాధి అమెరికన్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్సెస్ దళాలకు ప్రధాన శిక్షణా కేంద్రమైన క్యాంప్ ఫన్‌స్టన్ నుండి ఇతర యుఎస్ ఆర్మీ క్యాంప్‌లు, ఐరోపాకు త్వరగా వ్యాపించింది. తరువాత ఇది మిడ్‌వెస్ట్, ఈస్ట్ కోస్ట్, ఫ్రెంచ్ ఓడరేవులలో అంటువ్యాధిగా మారింది. 1918 ఏప్రిల్ నాటికి వెస్ట్రన్ ఫ్రంట్‌కు చేరుకుంటుంది. [23] తరువాత ఇది త్వరగా మిగిలిన ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, ఇటలీ, స్పెయిన్‌లకు వ్యాపించింది. మేలో బ్రెస్లావ్, ఒడెస్సాకు చేరుకుంది.[23] బ్రెస్ట్-లిటోవ్స్క్ ఒప్పందం (1918 మార్చి) మీద సంతకం చేసిన తరువాత జర్మనీ రష్యన్ యుద్ధ ఖైదీలను విడుదల చేయడం ప్రారంభించింది. తరువాత వారు ఈ వ్యాధిని తమ దేశానికి తీసుకువచ్చారు.[27] ఏప్రిల్‌లో ఆగ్నేయాసియాలో నమోదైన కేసులు ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే అవకాశం ఉంది. మేలో ఇది ఉత్తర ఆఫ్రికా, భారతదేశం, జపాన్లకు చేరుకుంది. [28] జూన్లో ఇది చైనాలో వ్యాప్తిచింది.[29] జూలైలో ఆస్ట్రేలియా చేరుకున్న తరువాత ఈ తరంగం తగ్గడం ప్రారంభమైంది.[28]ఫ్లూ మొదటి తరంగం 1918 మొదటి త్రైమాసికం నుండి కొనసాగింది ఇది తేలికపాటిదిగా భావించబడింది.[30] మరణాల శాతం అధికంగా లేదు. [1] యునైటెడ్ స్టేట్స్లో 1918 మొదటి ఆరు నెలల్లో 75,000 ఫ్లూ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. 1915 లో అదే సమయంలో 000 63,000 మరణాలతో పోలిస్తే ఇది అధికం.[31] 1918 మే - జూన్ మాసాలలో స్పెయిన్లోని మాడ్రిడ్లో 1,000 కంటే తక్కువ మంది ఇన్ఫ్లుఎంజాతో మరణించారు.[32] 1918 మొదటి త్రైమాసికంలో ఎటువంటి నిర్బంధాలు విధించబడలేదు. అయినప్పటికీ మొదటి తరంగం మొదటి ప్రపంచ యుద్ధం సైనిక కార్యకలాపాలలో గణనీయమైన అంతరాయం కలిగించింది. ఇందులో మూడొంతుల ఫ్రెంచ్ దళాలు, సగం బ్రిటిష్ దళాలు, 9,00,000 మంది జర్మన్ సైనికులు అనారోగ్యం పాలైయ్యారు.[33]

Seattle police wearing masks in December 1918

1918 మూడవ త్రైమాసికంలో మొదలైన మరణాంతకమైన రెండవ అల 1918[మార్చు]

రెండవ తరంగం ఆగస్టు రెండవ భాగంలో ప్రారంభమైంది. బహుశా ఇది బోస్టన్, ఫ్రీటౌన్, సియెర్రా లియోన్, బ్రెస్ట్ నుండి ఓడల ద్వారా వ్యాపించిందని అంచనా వేయబడింది. అక్కడ అది అమెరికన్ దళాలు లేదా నావికాదళ శిక్షణ కోసం ఫ్రెంచ్ నియామకాలతో వచ్చింది. [33] బోస్టన్‌కు పశ్చిమాన 30 మైళ్ల దూరంలో ఉన్న బోస్టన్ నానికాదళ మకాం క్యాంప్ డెవెన్స్ (తరువాత ఫోర్ట్ డెవెన్స్ అని పేరు మార్చబడింది) నుండి మొదలై తరువాత ఇతర యు.ఎస్. సైనిక మకాముల వరకు వ్యాపించింది. తరువాత ఐరోపా దళాలకు ఇది వ్యాపించింది.[34] దళాల కదలికల కారణంగా ఇది తరువాతి రెండు మాసాలలో ఇది ఉత్తర అమెరికా మొత్తానికి, తరువాత మధ్య - దక్షిణ అమెరికాకు వ్యాపించింది. తరువాత ఇది ఓడలద్వారా ఇది బ్రెజిల్, కరేబియన్‌కు కూడా చేరుకుంది.[35] 1918 జూలైలో ఒట్టోమన్ సామ్రాజ్యంలోని కొంతమంది సైనికులలో మొదటి కేసులు మొదలైయ్యాయి.[36] తరువాత ఇది ఫ్రీటౌన్ నుండి పశ్చిమ ఆఫ్రికా గుండా సముద్రతీరాలు, నదులు, వలసరాజ్యాల రైల్వేలలో రైల్ కేంద్రాల నుండి మరింత మారుమూల వర్గాలకు వ్యాపించింది. సెప్టెంబరులో ఫ్రాంసు నుండి దక్షిణాఫ్రికా స్థానిక లేబర్ కార్ప్స్ సభ్యులను తిరిగి స్వప్రాంతాలకు తీసుకువచ్చే నౌకలద్వారా ఆఫ్రికాలో ప్రవేశించింది.[35] అక్కడ నుండి ఇది దక్షిణ ఆఫ్రికా ప్రాంతాలలో జాంబేజీ దాటి నవంబరులో ఇథియోపియాకు చేరుకుంది.[37] సెప్టెంబరు 15 న ఇంఫ్లుయెంజా కారణంగా న్యూయార్క్ నగరంలో మొట్టమొదటి మరణం సంభవించింది.[38] మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రభుత్వ బాండ్లను ప్రోత్సహించడానికి 1918 సెప్టెంబరు 28 న పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఫిలడెల్ఫియా లిబర్టీ లోన్స్ పరేడ్, కవాతుకు హాజరైన ప్రజలలో అనారోగ్యం వ్యాప్తి చెందడంతో 12,000 మంది మరణించారు.[39]

ఐరోపా నుండి మొదలైన రెండవ తరంగం నైరుతి-ఈశాన్య భాగంలో రష్యా మీదుగా దూసుకెళ్లింది. అలాగే ఉత్తర రష్యా ద్వారా అర్ఖంగెల్స్‌కి వ్యాపించింది. ఆ తరువాత రష్యన్ అంతర్యుద్ధం ట్రాన్స్-సైబీరియన్ రైల్వే ద్వారా ఆసియా అంతటా వ్యాపించి ఇరాన్‌కు చేరుకుంది ( అక్కడ ఇది పవిత్ర నగరం మషద్ గుండా వ్యాపించింది). తరువాత సెప్టెంబరులో భారతదేశం, అలాగే అక్టోబరులో చైనా, జపాన్ వరకు వ్యాపించింది. [40] 1918 నవంబరు 11 నాటి సైనికశిబిరాలకు, లిమా, నైరోబిలలో కూడా వ్యాప్తి చెందాయి. కాని డిసెంబరు నాటికి తరంగం ముగిసింది.[41]

యు.ఎస్. ఆర్మీ క్యాంప్ హాస్పిటల్ వద్ద స్పానిష్ ఫ్లూ బాధితుల అమెరికన్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్. 45, 1918 లో ఫ్రాన్స్‌లోని ఐక్స్-లెస్-బెయిన్స్‌లో

1918 మహమ్మారి రెండవ తరంగం మొదటిదానికంటే చాలా ఘోరమైనదిగా మారింది. మొదటి అల సాధారణ ఫ్లూ మహమ్మారిని పోలి ఉంటుంది. అనారోగ్యంతో బాధపడే వ్యాధిగ్రస్థులు, వృద్ధులు, చిన్నవారు చాలా అధికంగా ఈ మహమ్మారి కారణంగా బాధించబడ్డారు. ఆరోగ్యవంతులు సులభంగా కోలుకున్నారు. 1918 అక్టోబరు మాసం మహమ్మారికారణంగా అత్యధిక మరణాలశాతం కలిగిన మాసంగా గణించబడింది.[42] 1918 సెప్టెంబరు-డిసెంబరు మధ్యకాలంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 2,92,000 మరణాలు సంభవించాయి. 1915 లో అదే సమయంలో 26,000 మరణాలు మాత్రమే సంభవించాయి.[31] నెదర్లాండ్సు ఇన్ఫ్లుఎంజా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో 40,000+ మరణాలను నివేదించింది. 1.1 మిలియన్ల జనాభా ఉన్న బొంబాయి ~ 15,000 మరణాలను నివేదించింది. [43] భారతదేశంలో 1918 ఫ్లూ మహమ్మారి ముఖ్యంగా ప్రాణాంతకమైనదిగా ఉంది. 1918 చివరి త్రైమాసికంలో మాత్రమే 12.5-20 మిలియన్ల మరణాలు సంభవించాయి.[30][page needed]

మూడవ అల 1919[మార్చు]

1919 జనవరిలో స్పానిష్ ఫ్లూ మూడవ తరంగం ఆస్ట్రేలియాకు చేరింది. సముద్ర నిర్బంధాన్ని ఎత్తివేసిన తరువాత అక్కడ 12,000 మంది మరణించారు. తరువాత ఇది ఐరోపా, యునైటెడ్ స్టేట్స్ గుండా వేగంగా వ్యాపించింది. అక్కడ అది వసంతకాలం 1919 జూను వరకు అది కొనసాగింది.[44][45][46][41] ఇది ప్రధానంగా స్పెయిన్, సెర్బియా, మెక్సికో, గ్రేట్ బ్రిటన్లను ప్రభావితం చేసింది. దీని ఫలితంగా వందల వేల మంది మరణించారు.[47] దీని తీవ్రత రెండవ వేవ్ కంటే తక్కువగా ఉంది. కాని మొదటి వేవ్ ప్రారంభదశ కంటే చాలా ఘోరమైనదిగా ఉంది. యునైటెడ్ స్టేట్స్, లాస్ ఏంజిల్స్,[48] న్యూయార్క్ నగరం,[49] మెంఫిస్, నాష్విల్లె, శాన్ ఫ్రాన్సిస్కో, సెయింట్ లూయిస్ వంటి కొన్ని నగరాల్లో వ్యాప్తి సంభవించింది.[50] 1919లో ఆరుమాసాల కాలంలో అమెరికన్ మరణాల రేట్లు వేలసంఖ్యలో ఉన్నాయి.[51]

నాలుగవ అల 1920[మార్చు]

1920 వసంతఋతువులో న్యూయార్క్ నగరం,[49] స్విట్జర్లాండ్, స్కాండినేవియా,[52] కొన్ని దక్షిణ అమెరికా ద్వీపాలతో సహా వివిక్త ప్రాంతాలలో నాల్గవ అల సంభవించింది.[53] న్యూయార్కు నగరంలో మాత్ర1919 మే 1920 డిసెంబరు ఏప్రిల్ మధ్య కాలంలో 6,374 మరణాలు నమోదయ్యాయి. ఇది 1918 వసంత ఋతువులో సంభవించిన మొదటి తరంగం కంటే రెండింతలు ఉందని అంచనా వేయబడింది.[49] నాలుగవ అల కారణంగా డెట్రాయిట్, మిల్వాకీ, కాన్సాస్ సిటీ, మిన్నియాపాలిస్, సెయింట్ లూయిస్‌తో సహా ఇతర యుఎస్ నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరణాల శాతం 1918 కంటే అధికంగా ఉంది.[54] 1920 ప్రారంభంలో పెరూ ఆలస్యంగా అలలను ఎదుర్కొంది. జపాన్‌లో 1919 చివరి నుండి 1920 మార్చిలో వరకు చివరి కేసులు ఉన్నాయి. [55] ఐరోపాలో ఐదు దేశాలు (స్పెయిన్, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్) జానువార్ ప్రాంతాలలో అల ప్రభావం శిఖరాగ్రాన్ని చేరుకుంది.[52]

American Red Cross nurses tend to flu patients in temporary wards set up inside Oakland Municipal Auditorium, 1918.

విశ్వసనీయమైన మూలాలు[మార్చు]

దాని పేరు ఉన్నప్పటికీ చారిత్రక, ఎపిడెమియోలాజికల్ డేటా స్పానిష్ ఫ్లూ భౌగోళిక మూలాన్ని గుర్తించలేదు.[1] అయినప్పటికీ పేరు సంబంధించిన అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి.

అమెరికా సంయుక్తరాష్ట్రాలు[మార్చు]

అమెరికా సంయుక్తరాష్ట్రాలలో ధ్రువీకరించబడిన కేసులు ఉద్భవించాయి. 2003 లో ఈ ఫ్లూ చరిత్రకారుడు ఆల్ఫ్రెడ్ డబ్ల్యూ. క్రాస్బీ కాన్సాస్లో ఉద్భవించిందని పేర్కొన్నాడు.[56]అలాగే రచయిత జాన్ ఎం. బారీ తాను 2004 వ్యాసంలో ప్రచురించిన వ్యాసంలో 1918 జనవరిలో కాన్సాస్‌లోని హాస్కెల్ కౌంటీలో ఈ ఫ్లూ వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు.[24]

పరిణామాత్మక జీవశాస్త్ర ప్రొఫెసర్ మైఖేల్ వొరోబే నేతృత్వంలోని కణజాల స్లైడ్లు, వైద్య నివేదికల మీద 2018 అధ్యయనం కాన్సాస్ నుండి ఉద్భవించిన వ్యాధికి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను కనుగొంది. ఎందుకంటే అదే కాలంలో న్యూయార్క్ నగరంలో సంక్రమణలతో పోలిస్తే ఆ కాంసాసులో ఈ కేసులు స్వల్పంగా ఉండడమే కాక తక్కువ మరణాలు సంభవించాయి. ఈ అధ్యయనం ఫైలోజెనెటిక్ విశ్లేషణల ద్వారా సాక్ష్యాలను కనుగొంది. అయినప్పటికీ ఈ వైరస్ ఉత్తర అమెరికా మూలాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇది నిశ్చయాత్మకమఒనది కాదు. అదనంగా వైరస్ హేమాగ్గ్లుటినిన్ గ్లైకోప్రొటీన్లు 1918 కంటే చాలా ముందుగానే ఉద్భవించాయని సూచిస్తున్నాయి. ఇతర అధ్యయనాలు హెచ్.ఐ.ఎన్.ఇ వైరస్ పునఃసృష్టి ఇది ఇంచుమించుగా 1915 లో సంభవించిందని సూచిస్తున్నాయి.[57]

ఐరోపా[మార్చు]

వైరాలజిస్ట్ జాన్ ఆక్స్ఫర్డ్ స్పానిష్ ఫ్లూ ఫ్రాన్స్‌లోని ఎటపుల్స్‌లోని యు.కె ట్రూప్ స్టేజింగ్, హాస్పిటల్ క్యాంపు మధ్యలో ఉన్నట్లు సిద్ధాంతీకరించారు.[58] ఆయన అధ్యయనం ప్రకారం 1916 చివరలో టాపుల్స్ క్యాంప్ అధిక మరణాలతో కొత్త వ్యాధి ప్రారంభంతో దెబ్బతిన్నదని ఇది ఫ్లూ లాంటి లక్షణాలను కలిగిస్తుందని భావిస్తున్నారు.[58][59] ఆక్స్ఫర్డు నివేదిక ఆధారంగా 1917 మార్చిలో ఆల్డర్‌షాట్‌లోని ఆర్మీ బ్యారక్‌ల వద్ద ఇదే విధమైన వ్యాప్తి సంభవించిందని పేర్కొన్నది.[58][60] ఎటాపుల్స్ వద్ద రద్దీగా ఉండే శిబిరం ఆసుపత్రి వాతావరణం పరిస్థితులు, విష వాయువు దాడులు, ఇతర యుద్ధ ప్రమాదాలకు గురైన శ్వాసకోశ వైరస్ వ్యాప్తిసంభంధిత వేలాది మంది బాధితులకు ఈ ఆసుపత్రి చికిత్స అందించింది. దినసరి 1,00,000 మంది సైనికులు శిబిరంలో చికిత్స అందుకున్నారు. ఇది ఒక పిగ్గేరీకి నిలయంగా ఉన్నకారణంగా శిబిరాన్ని పోషించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి క్రమం తప్పకుండా పౌల్ట్రీని తీసుకువచ్చారు. ఆక్స్ఫర్డు అతని బృందం పక్షులను ఆశ్రయించిన ఒక పూర్వ వైరస్ పరివర్తన చెంది ఆ తరువాత ముందు భాగంలో ఉంచిన పందులలో ఇది వ్యాప్తిచెందిందని అభిప్రాయపడ్డారు.[60][61] 2016 లో ప్రచురించబడిన చైనీస్ మెడికల్ అసోసియేషన్ జర్నలు నివేదికలో 1918 మహమ్మారికి కొన్ని సంవత్సరాల ముందు ఈ వైరస్ వైరస్ యూరోపియన్ సైన్యంలో వ్యాపించిందని ఆధారాలు కనుగొన్నాయి.[62] 1917 ప్రారంభంలో రాజకీయ శాస్త్రవేత్త ఆండ్రూ ప్రైస్-స్మిత్ ఆస్ట్రియాలో ఇన్ఫ్లుఎంజా ప్రారంభమైనట్లు సూచించే ఆస్ట్రియన్ ఆర్కైవ్స్ డేటాను ప్రచురించారు.[63]ఇన్ఫ్లుఎంజా, ఇతర శ్వాసకోశ వైరస్ల గురించి చేసిన 2009 లో జరిపిన ఒక అధ్యయనం మొత్తం పద్నాలుగు యూరోపియన్ దేశాలలో 1918 అక్టోబరు - నవంబరు రెండు నెలల వ్యవధిలో స్పానిష్ ఫ్లూ మరణాలు ఒకేసారి పెరిగాయని కనుగొన్నారు. వైరస్ ఎక్కడో ఉద్భవించి ఉంటే పరిశోధకులు ఆశించే విధానానికి ఇది భిన్నంగా ఉంటుంది. అందువలన ఐరోపాలో ముందుగా ఆరంభమై తరువాత ఇది బయటికి వ్యాపించింది.[64]

చైనా[మార్చు]

1993 లో పాశ్చర్ ఇన్స్టిట్యూట్‌లో స్పానిష్ ఫ్లూపై ప్రముఖ నిపుణుడు క్లాడ్ హన్నౌన్ తన అభిప్రాయం వెలిబుచ్చుతూ వైరస్ ముందుగా చైనా నుండి వచ్చి, తరువాత అమెరికా సమ్యుక్తరాష్ట్రాల లోని బోస్టన్ సమీపంలో పరివర్తన చెందిందని తరువాత అక్కడ నుండి యూరోప్ యుద్ధభూమి అయిన బ్రెస్ట్ ఫ్రాన్సుకు వ్యాపించిందని పేర్కొన్నారు. ఇది నావికుల ద్వారా మిగిలిన ఐరోపా, మిగతా ప్రపంచం, మిత్రరాజ్యాల సైనికులలో వ్యాప్తి చెందని ఆయన పేర్కొన్నాడు.[65] స్పెయిన్, కాన్సాస్, బ్రెస్ట్ వంటి అనేక ప్రత్యామ్నాయ ప్రతిపాదలను హన్నౌన్ సూచించినప్పటికీ కాని ఆప్రతిపాదనలకు అవకాశం లేదని భావించారు.[65] 2014 లో 96,000 మంది చైనా కార్మికులను బ్రిటిష్, ఫ్రెంచ్ సైనికులతో పనిచేయడానికి సమీకరించడం మహమ్మారికి మూలంగా ఉండవచ్చునని చరిత్రకారుడు మార్క్ హంఫ్రీస్ వాదించారు. సెయింట్ జాన్స్‌లోని మెమోరియల్ యూనివర్శిటీ ఆఫ్ న్యూఫౌండ్లాండ్‌కు చెందిన హంఫ్రీస్ కొత్తగా వెలికితీసిన రికార్డుల ఆధారంగా కొన్ని తీర్మానాలను ప్రతిపాదించాడు. 1917 నవంబరులో ఉత్తర చైనాను (కార్మికులు ఎక్కడ నుండి వచ్చారు) తాకిన శ్వాసకోశవ్యాధి స్పానిష్ ఫ్లూతో సమానమైనదని చైనా ఆరోగ్య అధికారులు ఒక సంవత్సరం తరువాత గుర్తించారని ఆయన చారిత్రక ఆధారాలను కనుగొన్నారు. [66][67] అయినప్పటికీ ఆధునికంగా పోల్చిచూడడానికి కణజాల నమూనాలు ఏవీ మనుగడలో లేవు. [68] ఐరోపాకు వెళ్ళడానికి కార్మికులు తీసుకున్న మార్గంలో కొన్ని భాగాలలో శ్వాసకోశ అనారోగ్యం ఉన్నట్లు కొన్ని నివేదికలు వచ్చాయి, ఇది ఉత్తర అమెరికా గుండా కూడా వెళ్ళింది.[68]

స్పానిష్ ఫ్లూ మహమ్మారి బారిన పడిన ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో చైనా ఒకటి. ఇక్కడ నిర్వహించిన పలు అధ్యయనాలు 1918 లో తేలికపాటి ఫ్లూ సీజన్‌ను నమోదు చేశాయి.[69][70][71] (వార్లార్డ్ కాలంలో డేటా లేకపోవడం వల్ల ఇది వివాదాస్పదమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూడండి) ఇది స్పానిష్ ఫ్లూ మహమ్మారి చైనాలో ఉద్భవించిందనే ఊహాగానాలకు దారితీసింది, [70][71][72][73] ఫ్లూ వైరసుకు చైనా జనాభా గతంలో పొందిన రోగనిరోధక శక్తి ద్వారా ఫ్లూ మరణాల శాతం వివరించబడింది. [70][71][74]

2016 లో చైనా మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక నివేదికలో ఐరోపాలో ఈ మహమ్మారి ప్రారంభానికి ముందుగా 1918 లో చైనీయులు, ఆగ్నేయాసియా సైనికులు, కార్మికుల ద్వారా ఈ వైరస్ ఐరోపాకు దిగుమతి చేయబడిందని ఆధారాలు లేవని తెలియజేయబడింది. [62] ఐరోపాలోని చైనీయులు, ఆగ్నేయాసియా కార్మికులలో తక్కువ ఫ్లూ మరణాల శాతం (వెయ్యిలో ఒకటి) కనుగొనబడిందని 2016 అధ్యయనం సూచించింది అంటే 1918 లో ప్రాణాంతకమైన ఇన్ఫ్లుఎంజా మహమ్మారి ఆ కార్మికుల నుండి ఉద్భవించి ఉండకపోవచ్చని భావించబడింది.[62] వ్యాప్తి చెందుతున్న వ్యాధికి వ్యతిరేకంగా లభించిన మరికొన్ని ఆధారాలు చైనా కార్మికులు ఇతర మార్గాల ద్వారా ఐరోపాలోకి ప్రవేశించారని ఇది గుర్తించదగిన వ్యాప్తికి దారితీయలేదని భావించారు. తద్వారా వారు అసలు అతిధేయులుగా ఉండే అవకాశం లేదని పేర్కొనబడింది.[57]

ఎపిడిమాలజి - పాథాలజి[మార్చు]

మార్పు - రూపుమార్పు[మార్చు]

As U.S. troops deployed en masse for the war effort in Europe, they carried the Spanish flu with them.

వైరస్ ప్రాథమిక పునరుత్పత్తి సంఖ్య 2 - 3 మధ్య ఉంది.[75] మొదటి ప్రపంచ యుద్ధం శిబిరాలు ఒకటికొకటి సామీప్యంగా ఉండడం, భారీ దళాల కదలికలు మహమ్మారిని ప్రసారం, వృద్ధి చెందిన మ్యుటేషన్ రెండింటినీ వేగవంతం చేసాయి. వైరసును ప్రజలు ప్రతిఘటించడాన్ని ఈ యుద్ధం తగ్గించి ఉండవచ్చని భావించబడింది. పోషకాహార లోపంతో కొంతమంది సైనికుల రోగనిరోధక వ్యవస్థలు బలహీనపడ్డాయని అలాగే పోరాటం, రసాయన దాడులు సైనికులను ఒత్తిడికి లోనుచేసాయని ఫలితంగా వారి వ్యాధినిరోధకశక్తి బలహీనపడిందని ఊహించారు. [76][77] ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ సంభవించడానికి ప్రజల ప్రయాణసౌకర్యాలు అభివృద్ధిచెంది వేగవంతం కావడం ఒక పెద్ద ప్రధానాంశం అని భావించబడింది. ఆధునిక రవాణా వ్యవస్థలు సైనికులు, నావికులు, పౌర ప్రయాణాలు ఈ వ్యాధిని వ్యాప్తిని సులభతరం చేశాయి.[78] ప్రభుత్వాలు వ్యాధి వ్యాప్తిని తక్కువచేసి చూపించడానికి ప్రయత్నించడం, వ్యాధినివారణకు ప్రయత్నించడంలో లోపం, తిరస్కరణ, వ్యాధివ్యాప్తి చెందడం అవగాహనచేసుకోవడంలో ప్రజలను తప్పుదారి పట్టించింది.[79]

రెండవ తరంగం తీవ్రతకు మొదటి ప్రపంచ యుద్ధం వాతావరణం కారణమని చెప్పబడింది.[80] పౌరులు దీనిని తక్కువగా అంచనా వేసినందున ప్రజలలో వ్యాధినిగురించిన అండోళనతో కూడిన ఒత్తిడి తేలికపాటిగా ఉండడానికి దారితీసింది. వ్యాధితీవ్రత తక్కువగా ఉన్నవారు ఇంట్లోనే ఉండి ఉన్నారు. స్వల్పంగా అనారోగ్యంతో ఉన్నవారు తమ జీవితాలను సాధారణంగా కొనసాగించారు. సైనిక శిబిరాలలో ఇది తారుమారుగా ఉంది. సైకులు తేలికపాటి వ్యాధ్తో ఉండడంతో వారు ఉన్న చోటనే ఉండగా తీవ్ర అనారోగ్యంతో బాధపడే సైనికులు రద్దీగా ఉన్న రైళ్లలో రద్దీగా ఉండే ప్రాంతీయ ఆసుపత్రులకు పంపించిన కారణంగా అది ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధానకారణంగా మారింది. తరువాత అఫి రెండవ అలగా ప్రారంభమైన ఫ్లూ త్వరగా తిరిగి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.[81] మొదటి అల ఇన్ఫెక్షన్ల నుండి కోలుకున్న వారిలో చాలా మంది రోగనిరోధక శక్తి పొందారని తేలింది. ఇది అదే ఫ్లూ జాతి అయి ఉండాలి. కోపెన్‌హాగన్‌లో ఇది చాలా నాటకీయంగా వివరించబడింది. ప్రాణాంతకత ప్రభావం తక్కువగా ఉన్న మొదటి తరంగానికి కంటే స్వల్పంగా అధిక మరణాలశాతంగా 0.29% (మొదటి తరంగంలో 0.02%, రెండవ తరంగంలో 0.27%) నమోదు చేసింది.[82] మిగిలిన ప్రజలలో రెండవ తరంగం చాలా ఘోరమైనదిగా మారింది. ఇది సైనికులకు చాలా హాని కలిగించింది. ఇది ఆరోగ్యవంతమైన యువకులను అధికంగా బాధించింది.[83]

1918 చివరలో ప్రాణాంతకమైన రెండవ తరంగం తాకిన తరువాత అకస్మాత్తుగా కొత్త కేసులు పడిపోయాయి. ఉదాహరణకు అక్టోబరు 16 చివరివారంలో ఫిలడెల్ఫియాలో 4,597 మంది మరణించినప్పటికీ నవంబరు 11 నాటికి ఇన్ఫ్లుఎంజా నగరం నుండి దాదాపుగా అదృశ్యమైంది. వ్యాధి ప్రాణాంతకత వేగంగా క్షీణించడానికి ఒక వివరణ ఏమిటంటే బాధితులు వైరస్ బారిన పడిన తరువాత అభివృద్ధి చెందిన న్యుమోనియా నివారణ, చికిత్సలలో వైద్యులు మరింత ప్రభావవంతంగా పనిచేసారు. అయినప్పటికీ జాన్ బారీ తన పుస్తకం ది గ్రేట్ ఇన్ఫ్లుఎంజా (2004): ది ఎపిక్ స్టోరీ ఆఫ్ ది డెడ్లీస్ట్ ప్లేగు ఇన్ హిస్టరీలో ఇంద్య్కు మద్దతుగా ఎటువంటి పరిశోధకుల ఆధారాలు కనుగొనలేదని పేర్కొన్నారు.[24] మరొక సిద్ధాంతం ఆధారంగా 1918 వైరస్ చాలా వేగంగా తక్కువ ప్రాణాంతక స్థితికి మారిందని పేర్కొన్నది. ఇన్ఫ్లుఎంజా ఇటువంటి పరిణామం చెందడం ఒక సాధారణ సంఘటన: వ్యాధికారక వైరస్లు కాలక్రమంలో తక్కువ ప్రాణాంతకంగా మారాయి. మరింత ప్రమాదకరమైన జాతుల హోస్ట్‌లు చనిపోవడం ఇందుకు ప్రధానకారణంగా భావించబడింది. [24] కొన్ని ప్రాణాంతక కేసులు 1919 మార్చి వరకు కొనసాగాయి. 1919 స్టాన్లీ కప్ ఫైనల్స్‌లో ఒక ఆటగాడు మరణించాడు.

సంకేతాలు-లక్షణాలు[మార్చు]

US Army symptomology of the flu

ముఖ్యంగా మొదటి వేవ్ సమయంలో వ్యాధిసోకిన వారిలో ఎక్కువ మంది గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం మొదలైన సాధారణ ఫ్లూ లక్షణాలను మాత్రమే అనుభవించారు.[84] ఇందుకు విరుద్ధంగా రెండవ తరంగంలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది. ఇది తరచుగా న్యుమోనియా లక్షణాలతో ఉన్న కారణంగా గుర్తించడం సంక్లిష్టంగా ఉండేది. ఇది తరచుగా మరణానికి కారణంగా మారింది.[84] ఇది మరింత తీవ్రమైన రకం హెలియోట్రోప్ సైనోసిస్ అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. తద్వారా చర్మం మొదట చెంప ఎముకల రెండు మహోగని మచ్చలను అభివృద్ధి చేస్తుంది. తరువాత కొన్ని గంటలు మొత్తం ముఖం నీలం రంగులోకి వ్యాపిస్తుంది తరువాత నల్ల రంగు మరింత వ్యాప్తి చెంది మిగిలిన అవయవాకకు వ్యాపించేది. [84] దీని తరువాత ఊపిరితిత్తులు ప్రమాదకరమైన ద్రవాలతో నిండిన కారణంగా గంటలు లేదా రోజుల్లో మరణం సంభవిస్తుంది.[84] నివేదించబడిన ఇతర సంకేతాలుగా ఆకస్మిక నోరు, ముక్కుపుటాలు వ్యాధి లక్షణాలను బహిర్గతం చేసాయని తెలియజేసాయి. గర్భిణీ స్త్రీలకు గర్భస్రావాలు సంభవించాయి. ఒక విచిత్రమైన వాసన, దంతాలు, జుట్టు రాలడం, మతిమరుపు, మైకం, నిద్రలేమి, వినికిడి లేదా వాసన కోల్పోవడం, దృష్టి మసకబారడం, రంగు గుర్తించడంలో బలహీనమైన దృష్టి. [84] ఒక పరిశీలకుడు ఇలా వ్రాశాడు: "శ్లేష్మ పొరల నుండి ప్రధానంగా ముక్కు, కడుపు, పేగు నుండి వచ్చే రక్తస్రావం ఈ వ్యాధి లక్షణాలలో ఒకటిగా పేర్కొనబడింది. చెవుల నుండి రక్తస్రావం, చర్మంలోని రంద్రాలలో కూడా రక్తస్రావం సంభవించింది".[85] సైటోకిన్ తుఫానుల కారణంగా లక్షణాల తీవ్రత సంభవిస్తుందని విశ్వసించారు.[30]

మరణాలలో ఎక్కువ భాగం న్యుమోనియా బ్యాక్టీరియా [86][87][88] ఇన్ఫ్లుఎంజాతో సంబంధం ఉన్న ఒక సాధారణ ద్వితీయ సంక్రమణగా కారణంగా సంభవించాయి. ఈ న్యుమోనియా సాధారణంగా శ్వాసకోశ-బాక్టీరియా శ్వాసనాళాలలో ప్రవేశించి తరువాత ఇవి బాధితుల దెబ్బతిన్న శ్వాసనాళ నాళాల ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశించగలిగాయి.[89] వైరస్ రక్తస్రావం, ఊపిరితిత్తులలో ఎడెమాను కలిగించడం ద్వారా ప్రజలను నేరుగా చంపింది. [90] ఆధునిక విశ్లేషణ సైటోకిన్ తుఫాను ప్రేరణకారణంగా ఈ వైరస్ ముఖ్యంగా ప్రాణాంతకంగా మరిందని (శరీరం రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం) వివరించింది.[24] పరిశోధకుల బృందం బాధితుల మృతదేహాల నుండి వైరస్ను స్వాధీనం చేసుకుని జంతువులలో ప్రవేశపెట్టారు. సైటోకిన్ తుఫాను ద్వారా జంతువులు వేగంగా శ్వాసకోశ వైఫల్యం, మరణానికి గురయ్యాయి. బలమైన రోగనిరోధకత కలిగిన యువకుల శరీరాలలో ఈ వ్యాధిహివ్యాప్తి కారణంగా రోగనిరోధకత నాశనం అయిందని సూచించబడింది. అయితే బలహీనమైన రోగనిరోధకత కలిగిన పిల్లలు, మధ్య వయస్కులైన సమూహాలలో తక్కువ మరణాలు సంభవించాయి.[91][92]

వ్యాధినిర్ధారణలో సమస్యలు[మార్చు]

ఈ వ్యాధికి కారణమైన వైరస్ ఆ సమయంలో సూక్ష్మదర్శిని క్రింద కనిపించడం చాలా తక్కువగా ఉన్నందున దానిని సరిగ్గా నిర్ధారించడంలో సమస్యలు ఎదురయ్యాయి.[93]ఇది హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా అనే బాక్టీరియాగా భావించబడింది. ఇది కనిపించేంత పెద్దదిగా ఉండడమే ఇందుకు కారణం. ఇది అందరిలో లేనప్పటికీ అధికసంఖ్యాకులలో ఇది కనిపించింది.[93] ఈ కారణంగా ఆ బాసిల్లస్‌కు వ్యతిరేకంగా ఉపయోగించిన టీకా సరిగా పనిచేయలేదు. అయినప్పటికీ ఇది మరణాలశాతాన్ని తగ్గించింది.[94]

ఘోరమైన రెండవ వేవ్ సమయంలో ఇది ప్రజలలో ప్లేగు, డెంగ్యూ జ్వరం, కలరా అనే అపోహను కలిగించింది.[95] మరొక పొరపాటు నిర్ధారణ టైఫస్. అక్టోబరు విప్లవం తరువాత రష్యాను కూడా ఇది ప్రభావితం చేసింది. [95] చిలీలో దేశం ఉన్నత వర్గాల అభిప్రాయంలో దేశం తీవ్ర క్షీణతలో ఉందని భావించబడింది. వైద్యులు ఈ టైఫస్ వ్యాధికి పరిశుభ్రతలోపత కారణం అని అభిప్రాయం వెలిబుచ్చారు. వైద్యులు దీనిని అంటువ్యాధి కాదని భావించారు. ఫలితంగా సామూహిక సమావేశాలను నిషేధించనికారణంగా వ్యాధితీవ్రత అధికరించింది.[95]

వాతావరణప్రభావాల పాత్ర[మార్చు]

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల స్పానిష్ ఫ్లూ బాధితుల రోగనిరోధక శక్తి బలహీనపడిందని అధ్యయనాలు వివరించాయి. మహమ్మారి వ్యవధిలో ఎక్కువ కాలం వాతావరణం అధికంగా చల్లగా, తడిగా ఉండేది. నిరంతర వర్షాలు ప్రపంచయుద్ధ దళాలను సంఘర్షణ కాలసగటు కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు గురిచేసింది. ముఖ్యంగా మహమ్మారి రెండవ తరంగంలో ఇది అధికంగా సంభవించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మైనే విశ్వవిద్యాలయంలోని క్లైమేట్ చేంజ్ ఇన్స్టిట్యూట్ కలిసి చేసిన విశ్లేషించిన అత్యంత వివరణాత్మక మరణాల రికార్డులతో కలిపి అందించిన అల్ట్రా-హై-రిజల్యూషన్ క్లైమేట్ డేటాలో 1914 నుండి 1919 వరకు ఐరోపాను ప్రభావితం చేసిన తీవ్రమైన వాతావరణ క్రమరాహిత్యం గుర్తించబడింది. అనేక పర్యావరణ సూచికలు స్పానిష్ ఫ్లూ మహమ్మారి తీవ్రతను, వ్యాప్తిని ప్రభావితం చేశాయని వివరించాయి.[6] ప్రధానంగా 1918 సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు మహమ్మారి రెండవ తరంగంలో వర్షపాతంలో గణనీయమైన పెరుగుదల ఐరోపా మొత్తాన్ని ప్రభావితం చేసింది. మరణాల గణాంకాలు అవపాతం, ఉష్ణోగ్రతల తగ్గుదల యొక్క ఏకకాల పెరుగుదలను దగ్గరగా అనుసరిస్తాయి. ఇందుకు అనేక వివరణలు ప్రతిపాదించబడ్డాయి. తక్కువ ఉష్ణోగ్రతలు, పెరిగిన అవపాతం వైరస్ ప్రసారానికి అనువైన పరిస్థితులను అందించాయి. ఇది సైనికులు, ప్రతికూల పరిస్థితులకు గురైన ఇతర వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థలను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ఇది వ్యాధివ్యాప్తిని పెంచుతుందని నిరూపించబడింది. వైరసులు, న్యుమోకాకల్ కో-మోర్బిడ్ ఇన్ఫెక్షన్ల ద్వారా సంక్రమణ అధికశాతం మహమ్మారి బాధితులను ప్రభావితం చేసినట్లు నమోదు చేయబడింది (36% మరణ రేటుతో వ్యాధ్పీడిత ప్రజలలో ఐదవ వంతు).[96][97][98][99][100] ఆరు సంవత్సరాల వాతావరణ క్రమరాహిత్యం (1914-1919) ఐరోపాకు చల్లని, సముద్రపు గాలిని తీసుకువచ్చి దాని వాతావరణాన్ని తీవ్రంగా మార్చింది. ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలు, రికార్డుల ఆధారంగా ఈ వాతావరణ మార్పు టర్కీలో గల్లిపోలి వరకు చేరుకుందని వివరించాయి. సాధారణంగా మధ్యధరా వాతావరణం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు ANZAC దళాలు ఉన్న ప్రాంతం ఈ మార్పు కారణంగా చాలా చల్లగా మారాయి. వాతావరణ క్రమరాహిత్యం H1N1 ఏవియన్ వెక్టర్స్ వలసలను ప్రభావితం చేసింది. ఇది జలాశయాల జలాలను ప్రభావితం చేసింది. శరదృతువులో వ్యాధిసంక్రమణ 60%నికి చేరుకుంది.[101][102][103] మానవజన్యు పెరుగుదల వాతావరణ క్రమరాహిత్యం నిరంతర బాంబు దాడి కారణంగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ధూళితో మానవజన్యు పెరుగుదల సంభంధం కలిగి ఉంటుంది. ధూళి కణాల వల్ల పెరిగిన న్యూక్లియేషన్ (క్లౌడ్ కండెన్సేషన్ న్యూక్లియై)వర్షపాతం అధికరించడానికి దారితీసింది.[104][105][106]

ప్రతిస్పందన[మార్చు]

Coromandel Hospital Board (New Zealand) advice to influenza sufferers (1918)
సెప్టెంబర్ 1918 లో రెడ్ క్రాస్ "ప్లేగు" వ్యాప్తిని ఆపడానికి రెండు పొరల గాజుగుడ్డ మాస్కులను సిఫార్సు చేసింది.[107]
1918 చికాగో వార్తాపత్రిక ముఖ్యాంశాలలో పేర్కొన్న పెరిగిన వెంటిలేషన్, ఫేస్ మాస్క్‌లు ధరించనందుకు అరెస్టులు, క్రమమైన టీకాలు వేయడం, సమూహపరిమాణంలో పరిమితులు, వ్యాపారాలను ఎంపిక చేయడం, కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు వంటి ఉపశమన వ్యూహాలు.[108] అక్టోబరు తరువాత అమలైన కఠినమైన నియంత్రణ చర్యలు కొంత విజయాన్ని చూపించిన కారణంగా నవంబరులో నిర్వహించబడిన యుద్ధ విరమణ దినోత్సవాలు. థాంక్స్ గివింగ్ కొరకు నిషేధాలు సడలించడం వ్యాధి తిరిగి విజృంభించడానికి కారణమయ్యాయి.[108]

ప్రజారోగ్య రక్షణావిధానం[మార్చు]

1918 లో అంటు వ్యాప్తి గురించి ప్రజారోగ్య అధికారులను హెచ్చరించే వ్యవస్థలు ఉన్నప్పటికీ అవి సాధారణంగా వారిచ్చే హెచ్చరికలలో ఇన్ఫ్లుఎంజా చేర్చబడలేదు. ఇది ప్రతిస్పంద ఆలస్యం కావడానికి దారితీసింది.[109] అయినప్పటికీ అధికారులచేత చర్యలు తీసుకోబడ్డాయి. ఐస్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, అమెరికన్ సమోవా వంటి ద్వీపాలలో సముద్రయాన నిషేధాలు ప్రకటించబడ్డాయి. దానికారణంగా అనేక మంది ప్రాణాలను కాపాడబడ్డాయి.[109]సామాజిక దూరం పాటించడం వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. పాఠశాలలు, థియేటర్లు, ప్రార్థనా స్థలాలను మూసివేయడం, ప్రజా రవాణాను పరిమితం చేయడం, సామూహిక సమావేశాలను నిషేధించడం వంటి చర్యలు తీసుకోబడ్డాయి.[110] జపాన్ వంటి కొన్ని ప్రదేశాలలో ఫేస్ మాస్క్‌లు ధరించడం సాధారణచర్యగా మారింది. అయినప్పటికీ వాటి సమర్థత మీద చర్చలు కొనసాగాయి. [110] శాన్ ఫ్రాన్సిస్కో యాంటీ-మాస్క్ లీగ్ ఉదహరించబడినట్లుగా వాటి వినియోగానికి కొంత ప్రతిఘటన ఎదురైంది. టీకాలు కూడా అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి బ్యాక్టీరియా మీద ఆధారపడి ఉంటాయి. అసలు వైరస్ మీద మాత్రమే ప్రభావం చూపాయి. అవి సెకండరీ ఇన్ఫెక్షన్‌లకు మాత్రమే సహాయపడతాయి. [110] వివిధ రకాల ఆంక్షలు విభిన్నంగా అమలుచేయబడ్డాయి.[111] చాలా వరకు, న్యూయార్క్ సిటీ హెల్త్ కమిషనర్ సబ్వేలలో రద్దీని నివారించడానికి వ్యాపారాలను షిఫ్ట్‌ విధానంలో తెరవడం, మూసివేయడం చేయాలని ఆదేశించాడు.[ఆధారం చూపాలి] ఇన్ఫ్లుఎంజా బాధితులకు కోరమాండల్ హాస్పిటల్ బోర్డ్ (న్యూజిలాండ్) సలహా (1918) సామూహిక సమావేశాలను నిషేధించడం, ఫేస్ మాస్క్‌లు ధరించడం వంటి చర్యలు మరణాల రేటును 50% వరకు తగ్గించగలవని తరువాతి అధ్యయనం కనుగొన్నాయి. ఇది ప్రారంభంలో విధించబడటం మీద వ్యాధ్వ్యాప్తి ఆధారపడి ఉంటుంది.[112]

చికిత్స[మార్చు]

వైరస్‌కు చికిత్స చేయడానికి, సెకండరీ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి యాంటీబయాటిక్స్ లేనందున వైద్యులు యాస్పిరిన్, క్వినైన్, ఆర్సెనిక్స్, డిజిటాలిస్, స్ట్రైక్నిన్, ఎప్సమ్ లవణాలు, ఆముదం,, అయోడిన్ వంటి వివిధ స్థాయిలలో ప్రభావంచూపే మిశ్రిత ఔషధాల మీద ఆధారపడ్డారు.[113] రక్తస్రావం, ఆయుర్వేదం, కంపో వంటి సాంప్రదాయ ఔషధాలతో చికిత్సలు జరిగాయి.[114]

సమాచార అణిచివేత[మార్చు]

మొదటి ప్రపంచయుద్ధకాలంలో యుద్ధకాల సెన్సార్‌షిప్‌లో, మహమ్మారి గురించిన సమాచారం అణచివేయబడింది.[ఆధారం చూపాలి] ఆనాటి వార్తాపత్రికలు సాధారణంగా " కొర్రియరీ డెల్లా సెరా" మరణాల గురించిన సమాచారం ప్రచురించడాన్ని నిషేధించింది.[115] సాధారణంగా వార్తాపత్రికలు దేశభక్తి కారణంగా ప్రజలు భయాందోళన చెందకుండా ఉండాలన్న యోచనతో మరణాల గణాంకాలను ప్రచురించలేదు.[115]వ్యాధితో పాటు తప్పుడు సమాచారం కూడా వ్యాపించింది. ఐర్లాండ్‌లో, ఫ్లాండర్స్ ఫీల్డ్‌ల సామూహిక సమాధుల నుండి హానికరమైన వాయువులు పెరుగుతూ "గాలుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి" అని ప్రజలలో ఒక విశ్వాసం ఉండేదని కొన్ని కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి.[116]దీని వెనుక జర్మన్లు ఉన్నారనే పుకార్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు బేయర్ తయారు చేసిన ఆస్పిరిన్ వాతావరణాన్ని విషపూరితం చేయడం, U- బోట్ల నుండి విషవాయువును విడుదల చేయడం వంటి జర్మనుల చర్యలు దీనికి కారణమని ప్రజలలో ఒక భావన నెలకొన్నది.[117]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 Taubenberger & Morens 2006.
 2. "Pandemic Influenza Risk Management WHO Interim Guidance" (PDF). World Health Organization. 2013. p. 19. Archived (PDF) from the original on 21 జనవరి 2021. Retrieved 7 డిసెంబరు 2020.
 3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; pmid30202996 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 4. Rosenwald MS (7 ఏప్రిల్ 2020). "History's deadliest pandemics, from ancient Rome to modern America". The Washington Post. Archived from the original on 7 ఏప్రిల్ 2020. Retrieved 11 ఏప్రిల్ 2020.
 5. Gagnon A, Miller MS, Hallman SA, Bourbeau R, Herring DA, Earn DJ, Madrenas J (2013). "Age-specific mortality during the 1918 influenza pandemic: unravelling the mystery of high young adult mortality". PLOS ONE. 8 (8): e69586. Bibcode:2013PLoSO...869586G. doi:10.1371/journal.pone.0069586. PMC 3734171. PMID 23940526.
 6. 6.0 6.1 More AF, Loveluck CP, Clifford H, Handley MJ, Korotkikh EV, Kurbatov AV, et al. (సెప్టెంబరు 2020). "The Impact of a Six-Year Climate Anomaly on the "Spanish Flu" Pandemic and WWI". GeoHealth. 4 (9): e2020GH000277. doi:10.1029/2020GH000277. PMC 7513628. PMID 33005839.
 7. MacCallum WG (1919). "Pathology of the pneumonia following influenza". JAMA: The Journal of the American Medical Association. 72 (10): 720–723. doi:10.1001/jama.1919.02610100028012. Archived from the original on 25 జనవరి 2020. Retrieved 16 ఆగస్టు 2019.
 8. Hirsch EF, McKinney M (1919). "An epidemic of pneumococcus broncho-pneumonia". Journal of Infectious Diseases. 24 (6): 594–617. doi:10.1093/infdis/24.6.594. JSTOR 30080493.
 9. Brundage JF, Shanks GD (డిసెంబరు 2007). "What really happened during the 1918 influenza pandemic? The importance of bacterial secondary infections". The Journal of Infectious Diseases. 196 (11): 1717–1718, author reply 1718–1719. doi:10.1086/522355. PMID 18008258.
 10. Morens DM, Fauci AS (ఏప్రిల్ 2007). "The 1918 influenza pandemic: insights for the 21st century". The Journal of Infectious Diseases. 195 (7): 1018–1028. doi:10.1086/511989. PMID 17330793.
 11. "La Grippe Espagnole de 1918" (in ఫ్రెంచ్). Institut Pasteur. Archived from the original (Powerpoint) on 17 నవంబరు 2015. (also here, requires Flash player)
 12. "Influenza Pandemic Plan. The Role of WHO and Guidelines for National and Regional Planning" (PDF). World Health Organization. ఏప్రిల్ 1999. pp. 38, 41. Archived (PDF) from the original on 3 డిసెంబరు 2020.
 13. Mermel LA (జూన్ 2009). "Swine-origin influenza virus in young age groups". Lancet. 373 (9681): 2108–9. doi:10.1016/S0140-6736(09)61145-4. PMID 19541030. S2CID 27656702.
 14. Trilla A, Trilla G, Daer C (సెప్టెంబరు 2008). "The 1918 "Spanish flu" in Spain". Clinical Infectious Diseases. 47 (5): 668–73. doi:10.1086/590567. PMID 18652556.
 15. Porras-Gallo & Davis 2014, p. 51.
 16. Galvin 2007.
 17. "Spanish flu facts". Channel 4 News. Archived from the original on 27 జనవరి 2010.
 18. Anderson S (29 ఆగస్టు 2006). "Analysis of Spanish flu cases in 1918–1920 suggests transfusions might help in bird flu pandemic". American College of Physicians. Archived from the original on 25 నవంబరు 2011. Retrieved 2 అక్టోబరు 2011.
 19. Landgrebe P (29 డిసెంబరు 2018). "100 Years After: The Name of Death". History Campus. Archived from the original on 16 ఆగస్టు 2020. Retrieved 16 ఆగస్టు 2020.
 20. "Pandemic influenza: an evolving challenge". World Health Organization. 22 మే 2018. Archived from the original on 20 మార్చి 2020. Retrieved 20 మార్చి 2020.
 21. "Influenza pandemic of 1918–19". Encyclopaedia Britannica. 4 మార్చి 2020. Archived from the original on 20 మార్చి 2020. Retrieved 20 మార్చి 2020.
 22. Chodosh S (18 మార్చి 2020). "What the 1918 flu pandemic can teach us about COVID-19, in four charts". PopSci. Retrieved 20 మార్చి 2020.
 23. 23.0 23.1 23.2 Spinney 2018, p. 36.
 24. 24.0 24.1 24.2 24.3 24.4 Barry 2004b.
 25. "1918 Flu (Spanish flu epidemic)". Avian Bird Flu. Archived from the original on 21 మే 2008.
 26. Sheidlower N (17 మార్చి 2020). "How NYC Survived the 1918 Spanish Flu Pandemic". Untapped New York. Retrieved 8 అక్టోబరు 2020.
 27. "The Memoirs of Herbert Hoover: Years of Adventure, 1874–1920. (New York: Macmillan Company. 1951. pp. xi, 496.) and Herbert Hoover and the Russian Prisoners of World War I: A Study in Diplomacy and Relief, 1918–1919. By Edward F. Willis. (Stanford: Stanford University Press. 1951. pp. viii, 67.)". The American Historical Review: 12. 2011. doi:10.1086/ahr/57.3.709. ISSN 1937-5239.
 28. 28.0 28.1 Spinney 2018, p. 37.
 29. "Queer Epidemic Sweeps North China; Banks and Silk Stores in Peking Closed – Another Loan Sought from Japan". The New York Times. జూన్ 1, 1918. ISSN 0362-4331. Retrieved జూన్ 22, 2020.
 30. 30.0 30.1 30.2 Patterson & Pyle 1991.
 31. 31.0 31.1 "Mortality Statistics 1918: Nineteenth Annual Report" (PDF). United States Census Bureau. 1920. p. 28. Retrieved 29 మే 2020.
 32. Erkoreka A (మార్చి 2010). "The Spanish influenza pandemic in occidental Europe (1918–1920) and victim age". Influenza and Other Respiratory Viruses. 4 (2): 81–9. doi:10.1111/j.1750-2659.2009.00125.x. PMC 5779284. PMID 20167048.
 33. 33.0 33.1 Spinney 2018, p. 38.
 34. Byerly CR (ఏప్రిల్ 2010). "The U.S. military and the influenza pandemic of 1918–1919". Public Health Reports. 125 Suppl 3: 82–91. PMC 2862337. PMID 20568570.
 35. 35.0 35.1 Spinney 2018, p. 39.
 36. "Atatürk işgalcilerden önce İspanyol Gribini yenmişti". www.sozcu.com.tr (in టర్కిష్). Retrieved 2 నవంబరు 2020.
 37. Spinney 2018, p. 40.
 38. Barry JM (2005). The Great Influenza. United States: Penguin Books. p. 270. ISBN 0-670-89473-7. On September 15, New York City's first influenza death occurred.
 39. Flynn M (12 మార్చి 2020). "What happens if parades aren't canceled during pandemics? Philadelphia found out in 1918, with disastrous results". The Washington Post. Retrieved 9 జూలై 2020.
 40. Spinney 2018, p. 41.
 41. 41.0 41.1 Spinney 2018, p. 42.
 42. "Influenza 1918". American Experience. episode 5. season 10. [{{{transcripturl}}} Transcript]. 18 January 2010. PBS. WGBH. https://www.pbs.org/wgbh/americanexperience/films/influenza/. 
 43. "Epidemic Influenza". p. 93. Retrieved 4 జూలై 2020.
 44. Roos D (3 మార్చి 2020). "Why the Second Wave of the 1918 Spanish Flu Was So Deadly". History.com. Retrieved 23 జూలై 2020.
 45. Radusin M (అక్టోబరు 2012). "The Spanish flu—part II: the second and third wave". Vojnosanitetski Pregled. 69 (10): 917–27. PMID 23155616. Retrieved 23 ఏప్రిల్ 2020.
 46. "1918 Pandemic Influenza: Three Waves". Centers for Disease Control and Prevention. 11 మే 2018. Retrieved 23 ఏప్రిల్ 2020.
 47. Najera RF (2 జనవరి 2019). "Influenza in 1919 and 100 Years Later". College of Physicians of Philadelphia. Archived from the original on 24 జూలై 2020. Retrieved 23 ఏప్రిల్ 2020.
 48. "Here are Exact Facts About the Influenza and Its Toll in City, State, Nation, world". Los Angeles Times. 9 ఫిబ్రవరి 1919. Retrieved 10 మే 2020.
 49. 49.0 49.1 49.2 Yang W, Petkova E, Shaman J (మార్చి 2014). "The 1918 influenza pandemic in New York City: age-specific timing, mortality, and transmission dynamics". Influenza and Other Respiratory Viruses. National Institutes of Health. 8 (2): 177–88. doi:10.1111/irv.12217. PMC 4082668. PMID 24299150.
 50. Vaughan WT (జూలై 1921). "Influenza: An Epidemiologic Study". American Journal of Hygiene. ISBN 978-0-598-84038-7. Retrieved 11 మే 2020.
 51. "Mortality Statistics 1919: Twentieth Annual Report" (PDF). United States Census Bureau. 1921. p. 30. Retrieved 11 మే 2020.
 52. 52.0 52.1 Ansart S, Pelat C, Boelle PY, Carrat F, Flahault A, Valleron AJ (మే 2009). "Mortality burden of the 1918–1919 influenza pandemic in Europe". Influenza and Other Respiratory Viruses. 3 (3): 99–106. doi:10.1111/j.1750-2659.2009.00080.x. PMC 4634693. PMID 19453486.
 53. "How the 1918 flu pandemic rolled on for years: a snapshot from 1920". The Guardian. Retrieved 30 ఏప్రిల్ 2020.
 54. Vaughan WT (జూలై 1921). "Influenza: An Epidemologic Study". The American Journal of Hygiene. p. 91. Retrieved 13 ఆగస్టు 2020.
 55. Spinney 2018, p. 43.
 56. Crosby 2003.
 57. 57.0 57.1 Worobey M, Cox J, Gill D (2019). "The origins of the great pandemic". Evolution, Medicine, and Public Health. 2019 (1): 18–25. doi:10.1093/emph/eoz001. PMC 6381288. PMID 30805187. S2CID 67863937.
 58. 58.0 58.1 58.2 Valentine V (20 ఫిబ్రవరి 2006). "Origins of the 1918 Pandemic: The Case for France". National Public Radio. Archived from the original on 30 ఏప్రిల్ 2009. Retrieved 13 ఏప్రిల్ 2020.
 59. Oxford JS (డిసెంబరు 2001). "The so-called Great Spanish Influenza Pandemic of 1918 may have originated in France in 1916". Philosophical Transactions of the Royal Society of London. Series B, Biological Sciences. Royal Society. 356 (1416): 1857–9. doi:10.1098/rstb.2001.1012. PMC 1088561. PMID 11779384.
 60. 60.0 60.1 Oxford JS, Lambkin R, Sefton A, Daniels R, Elliot A, Brown R, Gill D (జనవరి 2005). "A hypothesis: the conjunction of soldiers, gas, pigs, ducks, geese and horses in northern France during the Great War provided the conditions for the emergence of the "Spanish" influenza pandemic of 1918–1919" (PDF). Vaccine. 23 (7): 940–5. doi:10.1016/j.vaccine.2004.06.035. PMID 15603896. Archived from the original (PDF) on 12 మార్చి 2020. Retrieved 12 మార్చి 2020.
 61. Connor S (8 జనవరి 2000). "Flu epidemic traced to Great War transit camp". The Guardian. UK. Archived from the original on 12 మే 2009. Retrieved 9 మే 2009.
 62. 62.0 62.1 62.2 Shanks GD (జనవరి 2016). "No evidence of 1918 influenza pandemic origin in Chinese laborers/soldiers in France". Journal of the Chinese Medical Association. 79 (1): 46–8. doi:10.1016/j.jcma.2015.08.009. PMID 26542935.
 63. Price-Smith 2008.
 64. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Ansart et al. 2009 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 65. 65.0 65.1 Hannoun C (1993). "La Grippe". Documents de la Conférence de l'Institut Pasteur. La Grippe Espagnole de 1918. Ed Techniques Encyclopédie Médico-Chirurgicale (EMC), Maladies infectieuses. Vol. 8-069-A-10.
 66. Humphries 2014.
 67. Vergano D (24 జనవరి 2014). "1918 Flu Pandemic That Killed 50 Million Originated in China, Historians Say". National Geographic. Archived from the original on 26 జనవరి 2014. Retrieved 4 నవంబరు 2016.
 68. 68.0 68.1 Spinney 2018, p. 143.
 69. Killingray D, Phillips H (2003). The Spanish Influenza Pandemic of 1918–1919: New Perspectives. Routledge. ISBN 978-1-134-56640-2.
 70. 70.0 70.1 70.2 Langford C (2005). "Did the 1918-19 Influenza Pandemic Originate in China?". Population and Development Review. 31 (3): 473–505. doi:10.1111/j.1728-4457.2005.00080.x. JSTOR 3401475.
 71. 71.0 71.1 71.2 Cheng KF, Leung PC (జూలై 2007). "What happened in China during the 1918 influenza pandemic?". International Journal of Infectious Diseases. 11 (4): 360–4. doi:10.1016/j.ijid.2006.07.009. PMID 17379558.
 72. Klein C. "China Epicenter of 1918 Flu Pandemic, Historian Says". History.com. Archived from the original on 5 మార్చి 2020. Retrieved 5 మార్చి 2020.
 73. Vergano D. "1918 Flu Pandemic That Killed 50 Million Originated in China, Historians Say". National Geographic. Archived from the original on 3 మార్చి 2020. Retrieved 5 మార్చి 2020.
 74. Saunders-Hastings PR, Krewski D (డిసెంబరు 2016). "Reviewing the History of Pandemic Influenza: Understanding Patterns of Emergence and Transmission". Pathogens. 5 (4): 66. doi:10.3390/pathogens5040066. PMC 5198166. PMID 27929449.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
 75. Mills CE, Robins JM, Lipsitch M (డిసెంబరు 2004). "Transmissibility of 1918 pandemic influenza". Nature. 432 (7019): 904–6. Bibcode:2004Natur.432..904M. doi:10.1038/nature03063. PMC 7095078. PMID 15602562.
 76. Qureshi 2016, p. 42.
 77. Ewald 1994.
 78. "The Spanish Flu pandemic of 1918". The History Press. Retrieved 20 ఫిబ్రవరి 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 79. Illing S (20 మార్చి 2020). "The most important lesson of the 1918 influenza pandemic: Tell the damn truth". Vox. Archived from the original on 25 మార్చి 2020. John M. Barry : The government lied. They lied about everything. We were at war and they lied because they didn't want to upend the war effort. You had public health leaders telling people this was just the ordinary flu by another name. They simply didn't tell the people the truth about what was happening.
 80. Gladwell 1997, p. 55.
 81. Gladwell 1997, p. 63.
 82. Fogarty International Center. "Summer Flu Outbreak of 1918 May Have Provided Partial Protection Against Lethal Fall Pandemic". Fic.nih.gov. Archived from the original on 27 జూలై 2011. Retrieved 19 మే 2012.
 83. Gladwell 1997, p. 56.
 84. 84.0 84.1 84.2 84.3 84.4 Spinney 2018, pp. 45–47.
 85. Knobler 2005.
 86. Morris DE, Cleary DW, Clarke SC (2017). "Secondary Bacterial Infections Associated with Influenza Pandemics". Frontiers in Microbiology. 8: 1041. doi:10.3389/fmicb.2017.01041. PMC 5481322. PMID 28690590.
 87. "Bacterial Pneumonia Caused Most Deaths in 1918 Influenza Pandemic". National Institutes of Health. 23 సెప్టెంబరు 2015. Archived from the original on 22 ఏప్రిల్ 2016. Retrieved 17 ఏప్రిల్ 2016.
 88. Taubenberger et al. 2001, pp. 1829–1839.
 89. Morens DM, Taubenberger JK, Fauci AS (అక్టోబరు 2008). "Predominant role of bacterial pneumonia as a cause of death in pandemic influenza: implications for pandemic influenza preparedness". The Journal of Infectious Diseases. 198 (7): 962–70. doi:10.1086/591708. PMC 2599911. PMID 18710327.
 90. Taubenberger et al. 2001, pp. 1829–39.
 91. Barry 2004.
 92. "FamilySearch: Sign In".
 93. 93.0 93.1 Spinney 2018, p. 61.
 94. "Washington State Board of Health pessimistic about influenza pandemic in a report to the governor on January 1, 1919". www.historylink.org. Retrieved 21 జూలై 2020.
 95. 95.0 95.1 95.2 Spinney 2018, p. 62.
 96. Foxman EF, Storer JA, Fitzgerald ME, Wasik BR, Hou L, Zhao H, et al. (జనవరి 2015). "Temperature-dependent innate defense against the common cold virus limits viral replication at warm temperature in mouse airway cells". Proceedings of the National Academy of Sciences of the United States of America. 112 (3): 827–32. Bibcode:2015PNAS..112..827F. doi:10.1073/pnas.1411030112. PMC 4311828. PMID 25561542.
 97. Lowen AC, Steel J (జూలై 2014). "Roles of humidity and temperature in shaping influenza seasonality". Journal of Virology. 88 (14): 7692–5. doi:10.1128/JVI.03544-13. PMC 4097773. PMID 24789791.
 98. Brown JD, Goekjian G, Poulson R, Valeika S, Stallknecht DE (ఏప్రిల్ 2009). "Avian influenza virus in water: infectivity is dependent on pH, salinity and temperature". Veterinary Microbiology. 136 (1–2): 20–6. doi:10.1016/j.vetmic.2008.10.027. PMID 19081209.
 99. Foxman EF, Storer JA, Vanaja K, Levchenko A, Iwasaki A (జూలై 2016). "Two interferon-independent double-stranded RNA-induced host defense strategies suppress the common cold virus at warm temperature". Proceedings of the National Academy of Sciences of the United States of America. 113 (30): 8496–501. doi:10.1073/pnas.1601942113. PMC 4968739. PMID 27402752.
 100. Klugman KP, Chien YW, Madhi SA (ఆగస్టు 2009). "Pneumococcal pneumonia and influenza: a deadly combination". Vaccine. 27 Suppl 3 (s3): C9–C14. doi:10.1016/j.vaccine.2009.06.007. PMID 19683658.
 101. Bengtsson D, Safi K, Avril A, Fiedler W, Wikelski M, Gunnarsson G, et al. (ఫిబ్రవరి 2016). "Does influenza A virus infection affect movement behaviour during stopover in its wild reservoir host?". Royal Society Open Science. 3 (2): 150633. Bibcode:2016RSOS....350633B. doi:10.1098/rsos.150633. PMC 4785985. PMID 26998334.
 102. Tolf C, Bengtsson D, Rodrigues D, Latorre-Margalef N, Wille M, Figueiredo ME, et al. (2012). "Birds and viruses at a crossroad—surveillance of influenza A virus in Portuguese waterfowl". PLOS ONE. 7 (11): e49002. Bibcode:2012PLoSO...749002T. doi:10.1371/journal.pone.0049002. PMC 3492218. PMID 23145046.
 103. Tucker MA, Böhning-Gaese K, Fagan WF, Fryxell JM, Van Moorter B, Alberts SC, et al. (జనవరి 2018). "Moving in the Anthropocene: Global reductions in terrestrial mammalian movements". Science. 359 (6374): 466–469. Bibcode:2018Sci...359..466T. doi:10.1126/science.aam9712. PMID 29371471.
 104. Blakemore E (3 అక్టోబరు 2020). "Catastrophic effect of 1918 flu may have been aided by peculiar influx of cold air into Europe during WWI". The Washington Post. Retrieved 29 నవంబరు 2020.
 105. Kent L (28 సెప్టెంబరు 2020). "How environmental conditions like cold and wet weather can affect pandemics, and what that means for COVID-19". CNN. Retrieved 29 నవంబరు 2020.
 106. Powell A (5 అక్టోబరు 2020). "Six-year deluge linked to Spanish flu, World War I deaths". Harvard Gazette. Retrieved 29 నవంబరు 2020.
 107. "Gauze Mask to Halt Spread of Plague". The Washington Times. 27 సెప్టెంబరు 1918. p. 3. Archived from the original on 8 అక్టోబరు 2020. Retrieved 5 అక్టోబరు 2020.
 108. 108.0 108.1 Hauck G, Gellis K (22 నవంబరు 2020). "We're celebrating Thanksgiving amid a pandemic. Here's how we did it in 1918 – and what happened next". USA Today. Archived from the original on 21 నవంబరు 2020.
 109. 109.0 109.1 Spinney 2018, pp. 83–84.
 110. 110.0 110.1 110.2 Spinney 2018, pp. 87–88.
 111. Spinney 2018, p. 91.
 112. Bootsma MC, Ferguson NM (మే 2007). "The effect of public health measures on the 1918 influenza pandemic in U.S. cities". Proceedings of the National Academy of Sciences of the United States of America. 104 (18): 7588–93. doi:10.1073/pnas.0611071104. PMC 1849868. PMID 17416677. S2CID 11280273.
 113. Spinney 2018, pp. 109–10.
 114. Spinney 2018, pp. 111–12.
 115. 115.0 115.1 Spinney 2018, p. 92.
 116. Spinney 2018, p. 69.
 117. Spinney 2018, p. 70.