స్ప్రింగ్ త్రాసు
Jump to navigation
Jump to search
ఒక వస్తువు భారమును కనుగొనుటకు వాడే పరికరము స్ప్రింగ్ త్రాసు. ఇది హుక్ సూత్రము పై ఆధారపడి పనిచేస్తుంది.
బరువు
[మార్చు]బరువు లేదా భారము (ఆంగ్లం Weight) ఒక రకమైన కొలమానము. భౌతిక శాస్త్రం ప్రకారం, ఒక వస్తువు పై గల గురుత్వాకర్షణ బలమును "భారము" లేదా "బరువు"అందురు. వస్తువు బరువు దాని ద్రవ్యరాశి, గురుత్వ త్వరణం ల లబ్ధానికి సమానము. 'm' ద్రవ్యరాశి గాను, 'g' గురుత్వ త్వరణం గల వస్తువుకు కలిగే భారం W=mg అవుతుంది. ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఒక కిలోగ్రాం ద్రవ్యరాశి గల వస్తువు భారం భూమిపై సాధారణంగా 9.8 న్యూటన్లు ఉంటుంది. భారం అనగా వస్తువుపై గల గురుత్వాకర్షణ బలం కావున దీని ప్రమాణాలు బలం ప్రమాణాలతో సమానంగా ఉంటుంది. భారమునకు దిశ ఉంటుంది కావున భారం సదిశ రాశి. దీనిని స్ప్రింగ్ త్రాసుతో కనుగొనవచ్చును.