మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్
స్వరూపం
(స్ప్లిట్ పర్సనాలిటీ నుండి దారిమార్పు చెందింది)
మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ | |
---|---|
ప్రత్యేకత | మనోరోగచికిత్స, మానసిక శాస్త్రం |
తరుచుదనము | 1.5% (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) |
ఒకే వ్యక్తిలో భిన్న వ్యక్తిత్వాలు నిగూఢమై ఉండి, పరిసరాలని ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్క విధంగా గ్రహించి, వేర్వేరు విధాలుగా స్పందించే మానసిక అసహజ స్థితి. దీనినే స్ప్లిట్ పర్సనాలిటీ అనీ, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అనీ అంటారు. ఒకే వ్యక్తిలోని ఈ భిన్న వ్యక్తిత్వాలని ఆల్టర్ ఈగోలు అంటారు. ఏ మాదకద్రవ్యాలు/ఔషధాలు ఉపయోగించకుండానే ఒక్కరి ప్రవర్తనని కనీసం రెండు వ్యక్తిత్వాలు తరచుగా శాసించడంతో బాటు ఆ వ్యక్తిత్వాలు అతనిలో చురుకుగా ఉన్నప్పుడు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా మతిమరపు ఉండటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.
ఈ వ్యాధి పై చాలా వివాదం ఉంది. కొందరు అసలు ఈ వ్యాధి లేదనీ, మరికొందరు ఈ వ్యాధి ఉండటం కొంత వరకు నిజమైననూ అది కేవలం కొన్ని ఔషధాల దుష్ఫలితాల వల్లనే అని వాదిస్తారు.
విశేషాలు
[మార్చు]- సిడ్నీ షెల్డన్ తన నవల టెల్ మీ యువర్ డ్రీమ్స్ని దీని ఆధారంగానే రచించాడు.
- విక్రం నటించిన తమిళ చిత్రం అన్నియన్ (తెలుగులో అపరిచితుడు) కూడా దీని ఆధారంగానే చిత్రించారు.