Jump to content

స్లమ్ డాగ్ హజ్బెండ్

వికీపీడియా నుండి
స్లమ్ డాగ్ హజ్బెండ్
దర్శకత్వంఏ.ఆర్.శ్రీధర్
రచనఏ.ఆర్.శ్రీధర్
నిర్మాతఅప్పి రెడ్డి
వెంకట్ అన్నపరెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంశ్రీనివాస్ జె రెడ్డి
కూర్పుఎ. వైష్ణవ్ వాసు
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
మైక్ మూవీస్
విడుదల తేదీ
21 జూలై 2023 (2023-07-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

స్లమ్ డాగ్ హజ్బెండ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సమర్పణలో మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఏ.ఆర్.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జూన్ 29న ట్రైలర్‌ను విడుదల చేసి[1][2], సినిమాను 21న విడుదల చేయగా, ఆగస్ట్  24 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

లక్ష్మణ్ అలియాస్ లచ్చి (సంజయ్ రావు) హైదరాబాద్ పార్శీ గుట్టలోని ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. అతడు మౌనిక అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ ఇద్దరూ ఎంతో కష్టపడి తమ ఇంట్లో వాళ్లను పెళ్లికి ఒప్పిస్తారు. కానీ ఆ యువకుడి జాతకం బాగా లేక మొదట ఏ చెట్టుకో లేక కుక్కకో పెళ్లి చేయాలని పంతులు చెప్పడంతో అతడి స్నేహితుడి సలహా మేరకు బేబి అనే కుక్కను పెళ్లి చేసుకుంటాడు. బేబీ (కుక్క)ని పెళ్లి చేసుకున్న తరువాత మౌనికతో పెళ్లికి చేసుకుందాం అనేసరికి బేబీ యజమాని లేచిపై కేసు కోర్టు వేస్తాడు. ఆ తరువాత కోర్టులో ఏం జరిగింది? లచ్చి తన ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేదే మిగతా సినిమా కథ.[5]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మైక్ మూవీస్
  • నిర్మాత: అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి[6]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ.ఆర్.శ్రీధర్
  • సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో
  • సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ జె రెడ్డి
  • ఎడిటర్: ఎ. వైష్ణవ్ వాసు
  • ఆర్ట్ డైరెక్టర్: సురేష్ రెడ్రౌతు
  • కాస్ట్యూమ్స్: తేజ & నరేష్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ కైగురి
  • సహ నిర్మాతలు: నిహార్ దేవెళ్ల, ఎం.కె చైతన్య పెన్మెత్స, చింతా మెర్వాన్, ప్రకాష్ జిర్రా, రవళి గణేష్, సోహం రెడ్డి మన్నెం
  • పాటలు: కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణ చారి

మూలాలు

[మార్చు]
  1. Prajasakti. "స్లమ్ డాగ్ హస్బెండ్ ట్రైలర్ విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
  2. A. B. P. Desam, A. B. P. (29 June 2023). "'స్లమ్ డాగ్ హస్బెండ్' ట్రైలర్: కుక్కతో బ్రహ్మాజీ కొడుకు పెళ్లి - కక్కుర్తి ఎక్కువైతే ఇంతే!". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
  3. Disha Daily (23 August 2023). "'Slum Dog Husband' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్." Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. Prajasakti (23 September 2022). "'స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌'గా సంజయ్ రావ్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
  5. Eenadu (29 July 2023). "రివ్యూ: స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  6. Andhra Jyothy (25 July 2023). "హాలీవుడ్ సినిమా చేసిన ఈ నిర్మాతలు, ఇప్పుడు తెలుగు టాలెంట్ పరిచయం చేస్తున్నారు". Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.