స్లోవేకియాలో హిందూమతం
స్లోవేకియాలో హిందూ మతాన్ని అవలంబించేవారు పెద్దగా లేరు. దేశంలో హరే కృష్ణ, యోగా ఇన్ డైలీ లైఫ్, ఓషో, సహజ యోగా, చిన్మయ మిషన్ వంటి హిందూ సమూహాలు ఉన్నాయి [1]
మతంగా అధికారిక గుర్తింపు
[మార్చు]పైన పేర్కొన్న హిందూ గ్రూపులు ఏవీ స్లోవాక్ రిపబ్లిక్‌లో నమోదు కాలేదు. కొత్త మతాన్ని నమోదు చేయాలంటే, తప్పనిసరిగా ఆ మతానికి కట్టుబడి ఉండే 20,000 మంది శాశ్వత నివాసితుల జాబితాను సమర్పించాలి. స్లోవేకియాలో మత సమూహాల నమోదు అవసరం లేదు; అయితే, ప్రస్తుత చట్టం ప్రకారం, ఆరాధన సేవలు, ఇతర కార్యకలాపాలను నిర్వహించడానికి నమోదైన మత సమూహాలకు మాత్రమే స్పష్టమైన హక్కు ఉంటుంది. అయితే నిర్దుష్ట మతాలు లేదా అభ్యాసాలను అధికారులు ఆచరణలో నిషేధించడం గానీ నిరుత్సాహపరచడం గానీ చెయ్యడం లేదు. [2]
ప్రభుత్వ గుర్తింపు కోరే మత సమూహాలు తమకు కనీసం 50,000 మంది వయోజన సభ్యులున్నట్లు చూపించాలని 2017 లో స్లోవేకియా ప్రభుత్వం చట్టం చేసింది. 2007 నుండి అమల్లో ఉన్న 20,000 మంది సభ్యుల నియమం నుండి ఈ స్థాయికి పెంచారు. [3] హిందువులు కూడా ఈ కొత్త మతం చట్టంపై నిరాశను వ్యక్తం చేశారు. యూనివర్సల్ సొసైటీ ఆఫ్ హిందూయిజం ప్రెసిడెంట్ అయిన హిందూ రాజనీతిజ్ఞుడు రాజన్ జెడ్, స్లోవాక్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ ఆండ్రెజ్ కిస్కాను తిరస్కరించాలని కోరాడు. స్లోవేకియాలో మతపరమైన సమానత్వాన్ని, స్వేచ్ఛనూ పునరుద్ధరించడానికి యూరోపియన్ కమిషన్, కౌన్సిల్ ఆఫ్ యూరప్ కమీషనర్ నిల్స్ ముయిజ్నిక్స్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరాడు. [4]
మూలాలు
[మార్చు]- ↑ United States Department of State International Religious Freedom Report 2006, Slovak Republic
- ↑ "Religion in Slovakia - Ťaháky-referáty.sk".
- ↑ "Slovakia's New Religious Registration Law is a Step in the Wrong Direction". March 2017.
- ↑ "Hindus express dismay at Slovakia's new religion law". Prague Post. 4 December 2016. Retrieved 1 September 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)