Jump to content

స్వకులసాలి

వికీపీడియా నుండి
(స్వకులశాలి నుండి దారిమార్పు చెందింది)

స్వకులసాలి లేదా "స్వకులసాలె" అనేది భారతదేశం లోని హిందూమతానికి చెందిన ఒక కులం. ఇది ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా "బి" గ్రూపులోని 19వ కులం. శ్రీ జిహ్వేశ్వర భగవానుడు ఈ కులం యొక్క వ్యవస్థాపకుడని ఈ కులస్తుల నమ్మకం. మరాఠీ భాష అనేది వీరి ప్రాథమిక మాతృభాష. వీరి ప్రధాన వృత్తి చేనేత, డిజైనింగ్, అద్దకం పని. వీరు. కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో స్వకులశాలి కులస్తులు నివసిస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా వీరి జనాభా 80 వేలు కాగా, అందులో 40 వేలమంది ఒక్క ఆదోని పట్టణం లోనే ఉన్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా వీరిలో కొందరు హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నారు.

చరిత్ర

[మార్చు]

ఋగ్వేదం, సామవేదం లలో వీరు బ్రాహ్మణ జాతి యొక్క మూలాలు కలిగియున్నదని తెలియుచున్నది. ఆ సమయంలో వీరు బ్రాహ్మణ ఆచారాలతో మాత్రమే జీవించెడివారు. ఆ తర్వాత వీరి కులం క్షత్రియులుగా మారినది. ఈ సమయంలో వీరు వైదిక జ్ఞానాన్ని ఒకప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి విస్తరించెడివారు.

ఆదిమయ అనే వాడు అందరికీ వస్త్రాలను అందిచే పుణ్య పురుషుడిని సృష్టించాల్సిందిగా శివుణ్ణి ప్రార్థించాడు. ఆదిమయ యొక్క సూచనల మేరకు శివుడు అతని నాలుక నుండి (జిహ్వ) ఒక శిశువును శ్రావణ మాసం, త్రయోదశి, సోమవారం ఉదయంలో సృష్టించాడు. ఆ శిశువు యొక్క నామకరనోత్సవం కైలాస పర్వతం పై జరిగింది. ఆ శిశువుకు "సాలి" అని నామకరణం చేసి అతణ్ణి అందరకూ బట్టలు నేయుట, డిసైనింగ్ చేయుట, వస్త్రాలకు రంగులు వేయుటకు నిర్దేశించాడు. పార్వతీ దేవి ఆ బాలుడి యొక్క కులాన్ని "స్వకుల" అని నామకరణం చేసింది. శివుని నాలుక (జిహ్వ) నుండి ఉద్భవించాడు కనుక ఆ బాలుణ్ణి 'జిహ్వేశ్వరుడు" అని నామకరణం చేసింది పార్వతీ దెవి. ఆ బాలుడు సూర్యోదయం నాడు జన్మించినాడు కావున ఆ బాలుడి వంశాన్ని "సూర్యవంశం"గా నిర్ణయించింది. ప్రఖ్యాత చీర "పైథాని" మొదట పైథానీలో నేయబడింది. ఇది ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. కొంతమంది ప్రజలు పైథాన్ (ప్రస్తుతం ఔరంగాబాద్ జిల్లలోని మహారాష్ట్ర) నుండి వివిధ ప్రాంతాలకు వలస పోయారు. ప్రస్తుతం కూడా పైథానీ చీర ప్రసిద్ధమైనది.

తమ పూర్వీకులు మహారాష్ర్ట నుంచి వలస వచ్చారనీ, స్వకులశాలి కులస్తులు అంటారు. స్వకుల శాలి కులస్తులు సైని కులకు వస్త్రాలు నేయటానికి మరాఠీ సైన్యంతోపాటు శ్రీశై లం చేరుకున్నారు. ఇలా వచ్చిన వారిలో వృద్ధులు పైన్యంతో వెళ్లలేక వారి కుటుంబాలతో అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆదోని, గద్వాల్‌, నారాయణ్‌పేట్‌, ధర్మవరంలలో స్థిరపడగా, కొందరు కర్నాటక ప్రాంతం లోని హుబ్లి, బెల్గాం, రాయచూర్‌లను ఎంచుకున్నారు.

వృత్తి, సామాజిక జీవితం

[మార్చు]

వీరి వృత్తి చేనేత. చేనేత రంగంలోకి యాంత్రీకరణ ప్రవేశం, తర్వాత పవర్‌లూమ్‌‌ చోటు చేసుకోవటంతో ఆ స్పీడుకు వీరు పోటీపడలేకపోయారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో పాతపద్ధతులనే అనుసరించారు.

సమస్యలు

[మార్చు]

ఉదయం మగ్గం గుంటలో దిగితే అక్కడి నుంచి లేచేసరికి చీకటిపడేది. ఈ విధంగా కుటుంబ సభ్యులు మొత్తం ఏదో ఒక పనిచేస్తూ ఉండేవారు. అయినప్పటికీ కుటుంబానికి కావలసిన కనీస అవసరాలు కూడా తీరేవి కావు. గాలి వెలుతురు లేక నిత్యం నేతపనిలో నిమగ్నం కావటంతో శ్వాసకోశ వ్యాధులకు గురయ్యేవారు. అప్పులు చేసి మెటీరియల్‌ తీసుకొచ్చినా పవర్‌లూమ్‌‌తో పోటీపడలేకపోయే వారు. రేటు సైతం గిట్టుబాటు అయ్యేదికాదు. కనుక చేసిన అప్పులకు వడ్డీలు పెరగటంతో వీరి జీవితం మరిం త దుర్బరమైంది. కొందరు ఇతర వృత్తులను చేపట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా నేటికీ కుల వృత్తిని నమ్ముకున్నవారు వీరిలోనే ఎక్కవమంది ఉండటం గమనార్హం. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం ప్రాంతా లలో ఉంటున్న వారికి అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయకపోవటంతో ఇబ్బందులకు గురవుతున్నారు. తమని బిసి-బి గ్రూప్‌ నుంచి బిసి-ఏ గ్రూప్‌కు మార్చాలని కోరుతున్నారు.

మూలాలు

[మార్చు]