స్వతంత్ర టివి
స్వతంత్ర టివి (ఆంగ్లం: Swatantra TV NEWS Channel) హైదరాబాదు కేంద్రంగా ప్రారంభమైంది. ఇది తెలంగాణలో 2021 నవంబరు 12న రిజిష్టర్ అయిన అసెండాస్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా.
ప్రారంభం
[మార్చు]స్వతంత్ర టివి 24/7 న్యూస్ ఛానల్ లోగో, యూట్యూబ్ ఛానెల్, వెబ్‌సైట్‌ను తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు 2022 ఏప్రిల్ 4న ప్రగతి భవన్‌లో ప్రారంభించారు. స్వతంత్ర న్యూస్ ఛానెల్ కు చెందిన హైదరాబాదు స్టూడియోలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో 2022 మే 19న ప్రారంభించారు. ఈ ఛానెల్ ప్రసారాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని కేబుల్ నెట్ వర్క్ లతో పాటు టాటా ప్లేయ టాటా స్కై (ఛానల్ నెం. 1468) లో జరుగుతున్నాయి. సామాన్యుడి మనోగతాన్ని బయటపెడుతూ తెలుగు వార్తా స్రవంతిలోకి వచ్చిన మరో శాటిలైట్ న్యూస్ ఛానెల్ స్వతంత్ర. స్వతంత్ర ఛానల్ మేనెజింగ్ డైరెక్టర్ బి.కృష్ణప్రసాద్ కాగా ఎడిటర్ గా తోట భావనారాయణ వ్యవహరిస్తున్నారు.[1]
సామాన్యుడి స్వరం పేరుతో ప్రసారం అవుతున్న కథనాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ "Let 'Swatantra TV' go forward independently: KTR". web.archive.org. 2022-05-20. Archived from the original on 2022-05-20. Retrieved 2022-05-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)