స్వధర్మ సేవాసంస్థ, గుంటూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

‘‘మానవసేవే - మాధవసేవ’’ నమ్మి కార్యక్రమాలు రూపొందించే సదాశయంతో ఏర్పడింది స్వధర్మ సేవా సంస్థ. ధార్మిక కార్యక్రమాలు, సంఘసేవా కార్యక్రమాలను చేపట్టి సమాజానికి ఉపకారం చేస్తున్న వదాన్యులను ధర్మజ్యోతి బిరుదుతో, ఒక లక్ష నగదుతో గౌరవించుట. గ్రంథాలయాలను సుసంపన్నముగా తీర్చిదిద్దుట. నిరక్ష్యరాస్యతను నిర్మూలించుటకు అవసరమైన కార్యక్రమాలను రూపొందించుట. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జాతి సాంస్కృతిక ఔనత్వాన్ని గుర్తించునట్లు చేయుట. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సామాజిక సేవ చేయువారిని ప్రోత్సహించుట. భారతీయ సంస్కృతికి, సమాజహిత కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలను ప్రచురించి చైతన్యము కలిగించుట. మూఢవిశ్వాసాలకు అతీతంగా స్మశానాల సుందరీకరణ, ఆధునీకరణ చేయువారికి సహాయ సహకారాలను అందించుట. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టుట. జయహో... అమరావతి: నవ్య రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి సహకరించుట, అమరావతి ప్రశస్తి వ్యాప్తికి తగు కృషి చేయుట. సహకరించేవారందరికి స్వధర్మ సేవా సంస్థ సాదర స్వాగతం పలుకుతున్నది. రూపొందించుకొన్నవన్నీ గొప్ప అశయాలు. వీటి సాధన సాధ్యమౌతుందా అనే సందేహించనక్కరలేదు. ‘‘క్రియా సిద్ధిః సత్త్వే భవతి మహతాం నోపకరణే’’ అనే ఆర్య వాక్కు మాకు ఆదర్శం. మంచి లక్ష్యాన్ని ముందు నిర్ధారించుకుంటే కావలసిన ఉపకరణాలు వాటంతటవే సమకూరుతాయి అనే విశ్వాసంతో స్వధర్మ సేవా సంస్థ ఈ బృహత్ ప్రయత్నానికి పూనుకొన్నది. ఈ ఆశయ సాధనలో సహకరించే వారందరికి స్వధర్మ సేవా సంస్థ సాదర స్వాగతం పలుకుతుంది.

పురస్కార గ్రహీతలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ధార్మిక కార్యక్రమాలు, సంఘసేవా కార్యక్రమాలను చేపట్టి సమాజానికి ఉపకారం చేసిన వారికి స్వధర్మ సేవాసంస్థ ‘‘ధర్మజ్యోతి’’ పురస్కారం ప్రదానం చేస్తుంది. గతంలో ఈ పురస్కారం అందుకున్న ప్రముఖులు.

 1. 2019 - మద్దినేని గోపాలకృష్ణ
 2. 2018 - బొల్లేపల్లి సత్యనారాయణ.
 3. 2017- చిటిపోతు మస్తానయ్య.
 4. 2016 - డాక్టర్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు.
 5. 2015 - పి.వి.ఆర్.కె. ప్రసాద్.
 6. 2014 - డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య
 7. 2013 - డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు.
 8. 2012 - విద్వాన్ గోగినేని కనకయ్య.
 9. 2011 - ‘కళాతపస్వి’ కాశీనాధుని విశ్వనాథ్.
 10. 2010 - డాక్టర్ కాసరనేని సదాశివరావు.
 11. 2009 - గ్రంథి సుబ్బారావు.
 12. 2008 - పోలిశెట్టి శ్రీహరిప్రసాదరావు.

మూలాలు[మార్చు]