స్వర్ణగిరి ఆలయం (భువనగరి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వర్ణగిరి ఆలయం

స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్‌లో నిర్మింపబడింది.[1] ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం.[2] మానేపల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఈ దేవాలయం నిర్మించగా చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా మార్చి 2024లో ప్రాణప్రతిష్ఠ జరిగింది.[3]

విశేషాలు

[మార్చు]

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి సమీపంలో నూతనంగా నిర్మింపబడిన స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ 2024 మార్చి 6న జరిగింది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనములతో, స్థానిక వ్యాపార వేత్త మానేపల్లి రామారావు సారథ్యంలో నిర్మించారు. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణంతో కొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ, తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ, ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకున్నది.

పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో, ప్రాకారానికి నాలుగు వైపుల నాలుగు రాజగోపురాలతో, విశాలమైన మండపాలతో, 5 అంతస్థుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహం నెలకొని ఉంది.

శ్రీవారితో పాటుగా అలమేలు మంగ, గోదాదేవి, మదన గోపాల కృష్ణ స్వామి, గరుడాల్వార్, శ్రీరామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి. సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి, శ్రీలక్ష్మీ నరసింహస్వామి, భూ వరాహస్వామి, వకుళమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణగా నిలుస్తాయి. 40 అడుగుల ఎత్తయిన రథం కూడా ఉంది.[4]

ఎలా చేరుకోవాలి

[మార్చు]

భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‍ఆర్టీసీ ప్రత్యేక బస్సులను హైదరాబాదు నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఉప్పల్ ఎక్స్ రోడ్, జేబీఎస్ ల నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉన్నాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. "స్వర్ణగిరి - శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయము | Vaartha". web.archive.org. 2024-07-17. Archived from the original on 2024-07-17. Retrieved 2024-07-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "స్వర్ణగిరి : తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం (ఫొటోలు) Swarnagiri Temple At Bhuvanagiri Photos | Sakshi". web.archive.org. 2024-06-26. Archived from the original on 2024-06-26. Retrieved 2024-06-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "'స్వర్ణగిరి' వేంకటేశుడికి ప్రాణప్రతిష్ఠ | 'Swarnagiri' is the life prestige of Venkatesh". web.archive.org. 2024-07-06. Archived from the original on 2024-07-06. Retrieved 2024-07-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "22 ఎకరాల్లో 'స్వర్ణగిరి' శ్రీవేంకటేశ్వర ఆలయం | general". web.archive.org. 2024-07-06. Archived from the original on 2024-07-06. Retrieved 2024-07-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Swarnagiri Temple Special Bus,భువనగిరి 'స్వర్ణగిరి' ఆలయానికి వెళ్లాలనుకుంటున్నారా.. గుడ్‌న్యూస్ చెప్పిన TGSRTC, వివరాలివే.. - tgsrtc run special buses from hyderabad to swarnagiri temple - Samayam Telugu". web.archive.org. 2024-07-06. Archived from the original on 2024-07-06. Retrieved 2024-07-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)