Jump to content

స్వామినారాయణ దేవాలయం (విల్లెస్డెన్)

అక్షాంశ రేఖాంశాలు: 51°32′45.4″N 0°12′55″W / 51.545944°N 0.21528°W / 51.545944; -0.21528
వికీపీడియా నుండి
స్వామినారాయణ దేవాలయం (విల్లెస్డెన్)
విల్లెస్డెన్ లోని స్వామినారాయణ దేవాలయం
స్థానం
దేశం:ఇంగ్లాండు
ప్రదేశం:లండన్
భౌగోళికాంశాలు:51°32′45.4″N 0°12′55″W / 51.545944°N 0.21528°W / 51.545944; -0.21528

స్వామినారాయణ దేవాలయం, లండన్ శివారులోని విల్లెస్‌డెన్‌లో ఉన్న స్వామినారాయణ దేవాలయం. నగరంలో ప్రారంభించిన తొలి స్వామినారాయణ మందిరమిది.[1] ప్రస్తుతం స్వామినారాయణ సంప్రదాయంలో లండన్‌లోనే ఆరు స్వామినారాయణ దేవాలయాలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

1975లో, విల్లెస్‌డెన్ లేన్‌లో నిరుపయోగంగా ఉన్న ఒక చర్చిని కొనుగోలు చేసి దేవాలయంగా పునరుద్ధరించారు.[2] 1975 అక్టోబరు 11న శరత్ పూర్ణిమ నాడు ఆచార్య మహారాజశ్రీ తేజేంద్రప్రసాద్ పాండే విచ్చేసి స్వామినారాయణ్, నారాయణ్ దేవ్, రాధా కృష్ణ దేవ్, హనుమంతుడు, గణపతి మూర్తులను ప్రతిష్ఠించాడు.[3]

పునర్నిర్మాణం

[మార్చు]
ఘనశ్యామ్ విగ్రహం

చర్చి భవనం కాలక్రమేణా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు సరిపోవడం లేదు. గుజరాతీ భాషా తరగతులు, గ్రంథాలయం, పిక్చర్ ఫ్రేమింగ్ సర్వీస్‌తోపాటు ఇతర యువత కార్యకలాపాలు వంటి కొత్త కార్యకలాపాలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి.[3] సమస్య పరిష్కారం కోసం పక్కనే ఉన్న భవనాన్ని కొనుగోలు చేసినా ఆయా అవసరాలు తీర్చలేకపోయారు.[4] 1986లో రెండు భవనాలను కూల్చివేసి, దాని స్థానంలో మూడు దేవాలయాల సముదాయాన్ని నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. సాంప్రదాయ హిందూ దేవాలయ వాస్తుశిల్పం, బ్రిటిష్ డిజైన్లతో నిర్మించబడింది. 1986 అక్టోబరు 12న ఉత్సవ శంకుస్థాపన జరిగింది. 1988 జూలై 29న ఆచార్య మహారాజశ్రీ తేజేంద్రప్రసాద్ పాండే ఈ నూతన భవనాన్ని ప్రారంభించాడు.[4]

కార్యకలాపాలు

[మార్చు]

దేవాలయంలో ఈ కింది కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.[5]

  • గుజరాతీ పాఠశాల: గుజరాతీ భాషా పాఠశాల దేవాలయ ప్రాంగణంలో నడుస్తుంది. పాఠశాలలో 500 మంది విద్యార్థులు, 60 మంది స్వచ్ఛంద ఉపాధ్యాయులు ఉన్నారు.[2]
  • ఎస్ఎస్టిడబ్ల్యూ అకాడమీ: 1997[6] ఏర్పాటైన ఈ అకాడమీ ద్వారా వివిధ క్రీడా కార్యకలాపాలు, శిబిరాలు, మతపరమైన కార్యకలాపాలు, చర్చలు జరుగుతాయి.
  • యోగా తరగతులు
  • తబలా తరగతులు
  • హిందూమతం తరగతులు
  • చిన్న పిల్లలకు బాలకేంద్ర తరగతులు
  • స్వామినారాయణ సంప్రదాయంలో ముఖ్యమైన గ్రంథమైన వచనామృతాన్ని బోధించే వచనామృత తరగతులు

పైన పేర్కొన్నవే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా సహాయం అందించడంలో ఈ దేవాలయం నిర్వాహకులు ముదుంటారు. 2004లో దక్షిణాసియాను తాకిన సునామీకి సహాయం అందించడానికి దేవాలయం స్వచ్ఛంద నడకను నిర్వహించింది.[7] 2001లో గుజరాత్ భూకంపం సహాయ చర్యలను సమన్వయం చేసే బాధ్యతను తీసుకుంది. దేవాలయ ఆధ్వర్యంలో 60 టన్నుల దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేయబడ్డాయి.[8][9]

మూలాలు

[మార్చు]
  1. "Details of Mandir: Shree Swaminarayan Temple Willesden". Archived from the original on 2009-05-08. Retrieved 2022-05-11.
  2. 2.0 2.1 Williams, Raymond Brady (2001). An introduction to Swaminarayan Hinduism. Internet Archive. Cambridge, UK ; New York : Cambridge University Press. ISBN 978-0-521-65279-7. Retrieved 2022-05-11.
  3. 3.0 3.1 "About Swaminarayan Mandir Willesden". Archived from the original on 2008-09-07. Retrieved 2022-05-11.
  4. 4.0 4.1 "About Swaminarayan Mandir Willesden". Archived from the original on 2008-11-21. Retrieved 2022-05-11.
  5. "Mandir activities". Archived from the original on 2008-09-07. Retrieved 2022-05-11.
  6. "Swaminarayan Temple Willesden: SSTW Academy Introduction". Archived from the original on 2006-10-13. Retrieved 2022-05-11.
  7. "TEATHER CELEBRATES 30 YEARS OF WILLESDEN TEMPLE". Archived from the original on 2008-11-21. Retrieved 2022-05-11.
  8. "Bhuj's Tremors in London". The Times Of India. 15 February 2001. Retrieved 2022-05-11.
  9. Milmo, Cahal (2001-01-31). "A community where everyone knows a victim of the disaster". London: The Independent. Archived from the original on November 3, 2012. Retrieved 2022-05-11.