స్వామిబాబు పొట్నూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వామిబాబు పొట్నూరు
స్వామిబాబు పొట్నూరు
జననంస్వామిబాబు పొట్నూరు
1884
మరణం1982
ఇతర పేర్లుస్వామిబాబు పొట్నూరు

పొట్నూరు స్వామిబాబు, నరసన్నపేట వాస్తవ్యులు. దేశభక్తుడు, దాత, సంఘసేవకుడు, కవి, పండితపోషకుడు.

చేసిన సేవలు :[మార్చు]

1906 వందేమాతరం ఉద్యమంలో సకుటుంబంగా పాల్గొన్నాడు. స్వరాజ్యోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో క్రియాశీల పాత్రలు పోషించారు, 1941-42 ఉమ్మడి విశాఖ జిల్లాబోర్డు అధ్యక్షుడుగా, ఖాదీ ఉద్యమవ్యాప్తికి ఎనలేని కృషిచేసారు.

సంఘసంస్కర్తగా[మార్చు]

స్త్రీ విద్య, ఆదర్శ వితంతు వివాహాలు, అస్పృశ్యత నిర్మూలన కోసం కృషిచేసాడు.

సంఘ సేవకుడుగా

దళితులకు గ్రామసముదాయ నిర్మాణం, సహకారరంగ విస్తరణకు తోడ్పడ్డాడు,

దాతగా

కవులకు ఇల్లు, శిశు సదనాలు, ఆశ్రమాలు, ఆసుపత్రుల నిర్మాణాలు గావించాడు.అతని విగ్రహాన్ని ఇంటాక్ సహకారంతో డే & నైట్ కొత్త బ్రిడ్జి రోడ్ న ఆవిష్కరించారు.