హరద్వార్ దూబే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరద్వార్ దూబే

పదవీ కాలం
26 నవంబర్ 2020 – 26 జూన్ 2023
ముందు చంద్రపాల్ సింగ్ యాదవ్
తరువాత దినేశ్ శర్మ
నియోజకవర్గం ఉత్తర్ ప్రదేశ్

ఆర్ధిక శాఖ మంత్రి
పదవీ కాలం
24 జూన్ 1991 – 6 డిసెంబర్ 1992

ఎమ్మెల్యే
పదవీ కాలం
1989 – 1993
ముందు కృష్ణ వీర్ సింగ్ కౌశల్
తరువాత రమేష్ కాంత్ ములవాని
నియోజకవర్గం ఆగ్రా కంటోన్మెంట్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-07-01)1949 జూలై 1
హుసైనాబాద్, బాలియా,
మరణం 2023 జూన్ 26(2023-06-26) (వయసు 73)
ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
డా. కమల పాండే
(m. 1978)
సంతానం ప్రన్షు దూబే & కృత్యా దూబే
పూర్వ విద్యార్థి ఆగ్రా యూనివర్సిటీ

హరద్వార్ దూబే (1 జులై 1949 – 26 జూన్ 2023) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండు సార్లు ఆగ్రా కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు. హరద్వార్ దూబే 26 నవంబర్ 2020న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

హరద్వార్ దూబే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేసి, 2020లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం[మార్చు]

హరద్వార్ దూబే 1969లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంస్థాగత మంత్రిగా చేసి ఆ తర్వాత స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఆయన 1983లో మెట్రోపాలిటన్ యూనిట్ మంత్రిగా తదనంతరం మెట్రోపాలిటన్ అధ్యక్షుడిగా భాద్యతలు నిర్వహించాడు. హరద్వార్ దూబే 1989 & 1991లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆగ్రా కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేసి, 2005లో  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖేరాఘర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

హరద్వార్ దూబే 2011లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేసి, 2013లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయన 26 నవంబర్ 2020న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మరణం[మార్చు]

హరద్వార్ దూబే అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో జూన్ 12న చేరి చికిత్స పొందుతూ 2023 జూన్ 26న మరణించాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (26 June 2023). "గుండెపోటుతో బీజేపీ ఎంపీ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Hindu (26 June 2023). "BJP Rajya Sabha MP Hardwar Dubey Passes Away" (in Indian English). Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.