హరి రామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హరి రామమూర్తి కూచిపూడి నాట్యాచార్యుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన కూచిపూడి గ్రామానికి చెందిన సాంప్రదాయక కుచిపూడి కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఆయన పూర్తీకులు ప్రసిద్ధ కూచిపూడి కళాకారులు. తండ్రి తరపున పూర్వీకులలో హరి పున్నయ్య, హరి చలపతి గార్లు, తల్లి తరపున పూర్వీకులు చింతా వెంకట్రామయ్య, చింతా రామమూర్తి లు ప్రసిద్ధ కూచిపూడి కళాకారులుగా తమ సేవలనందించారు. వారి స్ఫూర్తితో ఆయన కళారంగంలో అడుగుపెట్టాడు. ఆయన తన 15వ యేట నాట్యవిద్యను ప్రారంభించాడు.[2] అయన స్థానిక సిద్ధేంద్ర కళాక్షేత్రం లో పసుమర్తి కృష్ణశర్మ, చింతా రామనాథం, ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం గార్ల వద్ద నాట్య విద్యనభ్యసించాడు. ఆయన కూచిపూడి, యక్షగానం కళలలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా పొందాడు.

ఆయన 1984 నుండి డా.సత్యం బాలెట్స్ లో ప్రధాన నాట్యకారునిగా ఉన్నాడు. ఆయన యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో డా. సత్యం ట్రూపు ద్వారా ప్రదర్శనలిచ్చాడు.

ఆయన జాతీయ ఉత్సవాలలో అనేక ప్రదర్శనలిచ్చాదు. వాటిలో కోణార్క్ నాట్యోత్సవం, ఖజరహో నాట్యోత్సవం, సంగీత నాటక కమిటీ నాట్యోత్సవం, ఐ.సి.సి.ఆర్ ద్వారా స్పాన్సర్ చేయబడిన ప్రదర్శనలలో పాల్గొన్నాడు. యు.ఎస్.ఎ లోన్ కెన్నెడీ సెంటర్, యితర సాంస్కృతిక సంస్థల వద్ద కొన్ని ప్రదర్శనలిచ్చాడు. ఆయన ఆమ్స్‌స్టెర్‌డం లో జరిగిన మొదటి ప్రపంచ సంగీత, థియేటర్ ఫెస్టివల్ లో తన ప్రదర్శననిచ్చాడు. ఆ విధంగా దేశ విదేశాలలొ అనేక ప్రదర్శనలిచ్చాడు.

ఆయన కూచిపూడి కళాక్షేత్రంలో విద్యార్థులకు శిక్షణనిస్తున్నాడు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క నాట్య విభాగంలో కూచిపూడి శిక్షణనిచ్చె ఆచార్యునిగా కొనసాగుతున్నాడు. ఆయన అనేక సోలో ప్రదర్శనలనలకు దర్శకత్వం వహించాడు.[3]

పురస్కారాలు[మార్చు]

  1. వాల్తేరు జూనియర్ ఛాంబర్ "అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ ఆఫ్ ద యియర్ అవార్డు" 1996.
  2. 2008 లో శ్రీ కామేశ్వరి పీఠం ద్వారా "ఉగాది పురస్కారం".
  3. 2008లో నాట్య రవళి ట్రస్టు లో "అవుట్‌స్టాండింగ్ నాట్యాచార్య ఆఫ్ కూచిపూడి".
  4. 2010లో విశాఖ ఫైన్ ఆర్ట్స్, కల్చరల్ అకాడమీ పురస్కారం

మూలాలు[మార్చు]

  1. Kalyana Karthikeyam: Myriad moods of mythology
  2. In His Master’s Steps
  3. "కూచిపూడి.ఆర్గ్ లో ఆయన జీవిత విశేషాలు". Archived from the original on 2015-05-12. Retrieved 2016-11-13.

ఇతర లింకులు[మార్చు]