Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

హరీష్ మరోటియప్ప పింపుల్

వికీపీడియా నుండి
హరీష్ మరోటియప్ప పింపుల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
నియోజకవర్గం మూర్తిజాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-01-20) 1964 జనవరి 20 (వయసు 60)
కళ్యాణ్ , మహారాష్ట్ర , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు మరోటియప్ప పింపుల్
జీవిత భాగస్వామి నూతన్ పింపుల్
సంతానం రోహన్ పింపుల్, గౌరీ పింపుల్
వృత్తి రాజకీయ నాయకుడు

హరీష్ మరోటియప్ప పింపుల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు మూర్తిజాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

హరీష్ మరోటియప్ప పింపుల్ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో మూర్తిజాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భరిపా బహుజన్ మహాసంఘ్ అభ్యర్థి పలాస్పాగర్ బల్దేవ్ సుఖేవ్ పై 15,358 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భరిపా బహుజన్ మహాసంఘ్ అభ్యర్థి రాహుల్ శేషారావు దొంగరేపై 12,888 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

హరీష్ పింపుల్ 2019 ఎన్నికలలో మూర్తిజాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వంచిత్ బహుజన్ ఆఘడి అభ్యర్థి అవాచార్ ప్రతిభా ప్రభాకర్‌పై 1910 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ స్వాతి సందీప్ వాకేకర్‌పై 35864 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. TimelineDaily (9 November 2024). "Triangular Contest Likely In Murtizapur" (in ఇంగ్లీష్). Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
  5. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Maharastra Assembly Election Results 2024 - Murtizapur". Election Commision of India. 23 November 2024. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.