హర్షిత్ సౌమిత్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత్‌కు చెందిన హర్షిత్ సౌమిత్రా ఐదేళ్ల 11 నెలల వయస్సులో 5,554 మీటర్ల ఎత్తుగల కాలాపత్తర్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. హర్షిత్ పర్వతారోహకుడైన తన తండ్రి రాజీవ్ సౌమిత్రాతో కలిసి మరో ఇద్దరు షెర్పాల సహాయంతో పదిరోజుల్లో ఈ శిఖరాన్ని అధిరోహించాడు. దీంతో ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ కంటే 200 మీటర్ల ఎత్తును హర్షిత్ అధిరోహించినట్లైంది. 2014 అక్టోబరు 7కి లుక్లా విమానాశ్రయానికి హెలికాప్టర్‌లో చేరుకున్న హర్షిత్ అక్కడి నుంచి ఎవరెస్టు బేస్ క్యాంప్ నకు బయలుదేరి 2014, అక్టోబర్ 17కి శిఖరాన్ని చేరుకున్నాడు. మామూలుగా సాధారణ వ్యక్తులు బేస్ క్యాంప్ నకు చేరుకునేందుకు ఏడు రోజులు పడుతుంది, అయితే హర్షిత్ ఈ శిఖరాన్ని చేరుకోవడానికి పది రోజులు పట్టింది.

2012, మేలో ఆర్యన్ బాలాజీ అనే ఏడేళ్ల బాలుడు ఎవరెస్టు బేస్ క్యాంప్ తో పాటు కాలాపత్తర్ శిఖరాన్ని చేరుకున్నాడు. హర్షిత్ సౌమిత్రా కాలాపత్తర్ శిఖరాన్ని చేరుకునేంతవరకు ఈ రికార్డ్ ఆర్యన్ బాలాజీ పేరు మీద ఉండేది. హర్షిత్ సౌమిత్రా కాలాపత్తర్ శిఖరాన్ని చేరుకోవడంతో ఆర్యన్ బాలాజీ పేరిట ఉన్న రికార్డును అధిగమించినట్లైంది.

మూలాలు[మార్చు]

  • ఈనాడు దినపత్రిక - 20-10-2014 - (కాలాపత్తర్ శిఖరాన్ని అధిరోహించిన బుడతడు - ఐదేళ్ల 11 నెలలకే రికార్డు)