హష్మతుల్లా షాహిదీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హష్మతుల్లా షాహిదీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1994-11-04) 1994 నవంబరు 4 (వయసు 29)
లోగార్, ఆఫ్ఘనిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుRight arm ఆఫ్ బ్రేక్
పాత్రTop-order బ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 3)2018 జూన్ 14 - ఇండియా తో
చివరి టెస్టు2023 జూన్ 14 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 37)2013 అక్టోబరు 2 - Kenya తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 5 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 32)2013 సెప్టెంబరు 30 - Kenya తో
చివరి T20I2022 ఆగస్టు 11 - ఐర్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
Amo Region
Band-e-Amir Region
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 6 62 6 20
చేసిన పరుగులు 375 1,665 48 1,489
బ్యాటింగు సగటు 53.57 31.41 24.00 52.48
100లు/50లు 1/1 0/15 0/0 6/4
అత్యుత్తమ స్కోరు 200* 97* 36 200*
వేసిన బంతులు 18 696
వికెట్లు 0 14
బౌలింగు సగటు 29.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/33
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 15/– 1/– 15/–
మూలం: Cricinfo, 7 June 2023

హష్మతుల్లా షాహిదీ (జననం 1994 నవంబరు 4) ఆఫ్ఘన్ క్రికెటరు, ప్రస్తుతం వన్డే ఇంటర్నేషనల్, టెస్టు క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్. అతను 2013 అక్టోబరులో కెన్యాపై ఆఫ్ఘనిస్తాన్ తరపున తన వన్డే అంతర్జాతీయ (వన్‌డే) రంగప్రవేశం చేసాడు. [1] 2018 జూన్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ ఆడిన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌లోని పదకొండు మంది క్రికెటర్లలో అతను ఒకడు. 2021 మార్చి 11న జింబాబ్వేపై 200 నాటౌట్‌తో టెస్టు డబుల్ సెంచరీ సాధించిన మొదటి ఆఫ్ఘన్ ఆటగాడిగా నిలిచాడు.[2]

కెరీర్

[మార్చు]

2017–18 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్ ఫైనల్‌లో, స్పీన్ ఘర్ రీజియన్‌పై బ్యాండ్-ఎ-అమీర్ రీజియన్ తరపున బ్యాటింగ్ చేస్తూ, అతను మొదటి ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేశాడు. [3] 21/మే/2019న ఐర్లాండ్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్‌డే సిరీస్‌లో అతని మొదటి అంతర్జాతీయ సిక్స్ సాధించాడు. అప్పటివరకు వన్‌డేల్లో ఒక్క సిక్స్ కూడా కొట్టకుండా 865* పరుగులు చేశాడు.

2018 మేలో, అతను భారతదేశంతో ఆడిన వారి ప్రారంభ టెస్టు మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [4] [5] 2018 జూన్ 14న భారతదేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ తరపున టెస్టు రంగప్రవేశం చేసాడు [6] అతను మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 36 పరుగులతో అత్యధిక స్కోర్ చేశాడు. 2019 ఫిబ్రవరిలో, అతను భారతదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. [7] [8]


2021 మార్చి 11న జింబాబ్వేతో జరిగిన టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 545 పరుగులతో డిక్లేర్డ్‌లో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, టెస్టు డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆఫ్ఘన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. [9]

2019 ఏప్రిల్లో అతను, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [10] [11] 2019 జూన్ 18న, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, హష్మతుల్లా వన్‌డేలలో తన 1,000వ పరుగును సాధించాడు. [12]

2021 సెప్టెంబరులో, అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [13]

మూలాలు

[మార్చు]
  1. "Hashmatullah Shahidi–Cricket Players and Officials–ESPN Cricinfo". ESPN Cricinfo. ESPN. Retrieved 29 December 2014.
  2. "Asghar Afghan sacked as Afghanistan opt for split captaincy". ESPN Cricinfo. Retrieved 31 May 2021.
  3. "Final, Alokozay Ahmad Shah Abdali 4-day Tournament at Amanullah, Dec 19-23 2017". ESPN Cricinfo. Retrieved 21 December 2017.
  4. "Afghanistan Squads for T20I Bangladesh Series and on-eoff India Test Announced". Afghanistan Cricket Board. Archived from the original on 29 May 2018. Retrieved 29 May 2018.
  5. "Afghanistan pick four spinners for inaugural Test". ESPN Cricinfo. Retrieved 29 May 2018.
  6. "Only Test, Afghanistan tour of India at Bengaluru, Jun 14-18 2018". ESPN Cricinfo. Retrieved 14 June 2018.
  7. "Mujeeb left out for Ireland Test, Shahzad out of T20Is". ESPN Cricinfo. Retrieved 7 February 2019.
  8. "No Mujeeb in Tests as Afghanistan announce squads for Ireland series". International Cricket Council. Retrieved 7 February 2019.
  9. "Hashmatullah Shahidi gets to landmark 200 before Afghanistan declare". ESPNcricinfo. 11 March 2021. Retrieved 11 March 2021.
  10. "Hamid Hassan picked in Afghanistan's World Cup squad; Naib to captain". ESPN Cricinfo. Retrieved 22 April 2019.
  11. "Asghar Afghan included in Gulbadin Naib-led World Cup squad". International Cricket Council. Retrieved 22 April 2019.
  12. "Demoralised Afghanistan face daunting task against upbeat India". International Cricket Council. Retrieved 22 June 2019.
  13. "Rashid Khan steps down as Afghanistan captain over team selection". Cricbuzz. Retrieved 9 September 2021.