హాజీ హుస్సేన్ అన్సారీ
హాజీ హుస్సేన్ అన్సారీ | |||
మైనారిటీ సంక్షేమ మంత్రి
| |||
పదవీ కాలం 28 జనవరి 2020 – 3 అక్టోబర్ 2020 | |||
తరువాత | హఫీజుల్ హసన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | మధుపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1947 or 1950 పిప్రా, మధుపూర్, డియోఘర్ జార్ఖండ్, భారతదేశం | ||
మరణం | 3 అక్టోబర్ 2020 రాంచీ, జార్ఖండ్, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
హాజీ హుస్సేన్ అన్సారీ (జననం 1947 – 3 అక్టోబర్ 2020) జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పని చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు మంత్రిగా పని చేశాడు.
జననం
[మార్చు]హాజీ హుస్సేన్ అన్సారీ 1948 మార్చి 2న డియోఘర్ జిల్లాలోని మధుపూర్‌లోని పిప్రా గ్రామంలో జన్మించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]హాజీ హుస్సేన్ అన్సారీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయలలోకి వచ్చి 1990లలో జేఎంఎంలో చేరాడు. ఆయన 1995లో సమైక్య బీహార్‌లోని మధుపూర్ శాసనసభ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పని చేసి ఆ తరువాత ఏర్పడిన జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి 2000, 2009, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. హాజీ హుస్సేన్ అన్సారీ 2004లో ప్రతిపక్ష నాయకుడిగా ఆ తరువాత 2010లో అన్సారీ జార్ఖండ్ హజ్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు.
మంత్రిగా
[మార్చు]హాజీ హుస్సేన్ అన్సారీ 2009లో శిబు సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో తొలిసారిగా ఆరు నెలల పాటు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జేఎంఎం మద్దతుతో బీజేపీ నాయకత్వంలో అర్జున్ ముండా ప్రభుత్వం ఏర్పడ్డాక మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1] దాదాపు 38 నెలల పాటు ప్రభుత్వాన్ని నడిపిన అర్జున్ ముండా ప్రభుత్వం పడిపోయింది. దీని తర్వాత కాంగ్రెస్ మద్దతుతో హేమంత్ సోరెన్ నాయకత్వంలో ఏర్పడిన 13 నెలల సుదీర్ఘ ప్రభుత్వంలో ఆయన మైనారిటీ సంక్షేమ మంత్రిగా చేశాడు.[2]
మరణం
[మార్చు]హాజీ హుస్సేన్ అన్సారీ కరోనా సోకినట్లు గుర్తించిన తరువాత 2020 సెప్టెంబర్ 23న రాంచీలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 3 అక్టోబర్ 2020న మరణించాడు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Haji Hussain Ansari is minority welfare minister of Jharkhand". TwoCircles.net. 11 October 2010. Archived from the original on 14 July 2018.
- ↑ "Jharkhand Chief Minister Hemant Soren expands cabinet, inducts six ministers". NDTV. 4 August 2013. Archived from the original on 26 August 2019.
- ↑ The Hindu (3 October 2020). "Jharkhand Minister Haji Hussain Ansari passes away" (in Indian English). Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.
- ↑ Gautam Mazumdar (3 October 2020). "Jharkhand minority welfare minister Haji Hussein Ansari dies battling Covid-19". The Hindustan Times. Archived from the original on 4 October 2020.
- ↑ Manob Chowdhury (3 October 2010). "Minister Haji Ansari dies of cardiac arrest, 2-day state mourning". The Telegraph. Archived from the original on 4 October 2020.