Jump to content

హాజెల్ కీచ్

వికీపీడియా నుండి
హాజెల్ కీచ్
హాజెల్ కీచ్ (2012)
జననం (1987-02-28) 1987 ఫిబ్రవరి 28 (వయసు 37)
ఇతర పేర్లురోజ్ డాన్, గుర్బసంత్ కౌర్
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2007 – 2016
జీవిత భాగస్వామియువరాజ్ సింగ్ (2016)
పిల్లలు1

హాజెల్ కీచ్, మోడల్, టీవి సినిమా నటి. టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాలలో నటించింది.[1][2] బిల్లా, బాడీగార్డ్‌ సినిమాలలో నటించిన హాజెల్, సుజుకీ ప్రకటనలో కూడా నటించింది.[3] ఫ్రాంక్‌ఫిన్ మ్యూజిక్ రీమిక్స్ ఐటెమ్ నంబర్ "కహిన్ పే నిగాహెన్"లో డ్యాన్స్ చేసింది.[4] 2013లో రియాలిటీ టెలివిజన్ ప్రోగ్రాం బిగ్ బాస్ 7 లో పాల్గొన్నది.

జననం, విద్య

[మార్చు]

హాజెల్ 1987, ఫిబ్రవరి 28న[5] ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్‌లో జన్మించింది. తండ్రి బ్రిటీష్ వ్యక్తి కాగా, తల్లి బీహారీ వంశానికి చెందిన ఇండో-మారిషియన్ హిందువు.[6] లండన్‌లోని రెడ్‌బ్రిడ్జ్‌లోని బీల్ హైస్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది.[7] పలు స్టేజ్ షోలలో ప్రదర్శన ఇచ్చింది. భారతీయ శాస్త్రీయ, బ్రిటీష్ నృత్యం, పాశ్చాత్య సమకాలీన నృత్యాలతో సహా పలురకాల నృత్యాలను కూడా నేర్చుకుంది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2007 బిల్లా రియా, రాజేష్‌కి కాబోయే భార్య తమిళం
2009 కిక్ పాటలో తెలుగు
2011 బాడీగార్డ్ మాయా కపూర్ హిందీ
2012 మాక్సిమం ఆ అంటే అమలాపురం పాటలో హిందీ
2012 కృష్ణం వందే జగద్గురుమ్ పాటలో తెలుగు
2013 హీర్ అండ్ హీరో పాటలో పంజాబీ
2015 ధరమ్ సంకట్ మే నీలానంద్ పాటలో హిందీ
2016 బాంకీ కి క్రేజీ బారాత్ పాటలో

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2015 నవంబరు 12న భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో హాజెల్ కు నిశ్చితార్థం జరిగింది.[8] 2016 నవంబరు 30న వారికి వివాహం జరిగింది.[9] వివాహం తర్వాత, హాజెల్ తన పేరును "గుర్బసంత్ కౌర్" (వివాహ వేడుకలో సంత్ బల్వీందర్ సింగ్ ఆమెకు ఇచ్చిన పేరు)గా మార్చుకుంది.[10] వారికి 2022 జనవరిలో మొదటి బిడ్డ జన్మించాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. PTI (16 September 2011). "Salman would never groan in pain: Hazel Keech". NDTV. Retrieved 2022-04-16.
  2. Sonal Chawla (3 March 2011). "Sallu's new girl Hazel Keech follows Kat". The Times of India. Archived from the original on 25 September 2012. Retrieved 2022-04-16.
  3. "Christine Zedek — Tamil Actress Gallery stills images clips". IndiaGlitz. Archived from the original on 2 మే 2007. Retrieved 20 July 2012.
  4. "Meet the new item number in town". Rediff.com. 31 December 2004. Retrieved 20 July 2012.
  5. "Yuvraj Singh braves a freezing day for Hazel Keech: Only because it is your birthday". India Today (in ఇంగ్లీష్). 28 February 2020. Retrieved 2022-04-16.
  6. Gulshankumar Wankar (1 September 2016). "Yuvraj Singh blasts Western Union for denying money to fiancée Hazel Keech". Hindustan Times. Retrieved 2022-04-16.
  7. Rob Parsons (9 September 2011). "West End chorus girl strikes Bollywood gold". Evening Standard. Archived from the original on 21 April 2013. Retrieved 2022-04-16.
  8. TNN (14 November 2015). "Yuvraj Singh Gets Engaged To Model-Actress Hazel Keech". The Times of India. Retrieved 2022-04-16.
  9. "Yuvraj Singh and Hazel Keech exchange wedding vows". The Hindu. Press Trust of India. 30 November 2016. Retrieved 2022-04-16.
  10. ABP News Web Desk (2 December 2016). "POST MARRIAGE Hazel Keech changes her NAME completely". ABP Live. Archived from the original on 2 January 2018. Retrieved 2022-04-16.
  11. "Yuvraj Singh, wife Hazel Keech blessed with baby boy". The Indian Express (in ఇంగ్లీష్). 2022-01-26. Retrieved 2022-04-16.

బయటి లింకులు

[మార్చు]