హిమాంశ్ కోహ్లీ
హిమాంశ్ కోహ్లీ (జననం 1989 నవంబరు 3 [1] ఢిల్లీకి చెందిన ప్రముఖ భారతీయ నటుడు. హిందీ సీరియల్ హమ్సే హై లైఫ్ లోని రాఘవ్ ఒబెరాయ్ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు కోహ్లీ. జనవరి 2014న విడుదలైన యారియాన్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశాడు.
తొలినాళ్ల జీవితం
[మార్చు]పంజాబీ హిందూ కుటుంబం లో పుట్టిన కోహ్లీ ఢిల్లీ పెరిగాడు.[1] తండ్రి విపిన్ కోహ్లీ, తల్లి నీరూ కోహ్లీ. ఢిల్లీలోని కె.ఆర్.మంగళం వరల్డ్ స్కూల్ లో చదువుకున్నాడు. ఎమిటీ విశ్వవిద్యాలయం నుండి మాస్ మీడియాలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు.[2]
జీవిత గమనం
[మార్చు]మే 2011 నుండు జూలై 2011 వరకు ఢిల్లీ లోని రేడియో మిర్చి లో రేడియో జాకీగా పచిచేశారు. చానల్ వి లోని డైలీ సీరియల్ హమ్సే హై లైఫ్ సినిమాలో రాఘవ్ ఒబెరాయ్ పాత్రలో నటించారు.[3] 2011 సెప్టెంబరు 5 నుండి 2012 జూన్ 12 వరకు ఆ సీరియల్ లో పనిచేసి, సినిమా అవకాశం వచ్చిన కారణంగా సీరియల్ ను వదిలేశారు.[4] కానీ చివరి ఎపిసోడ్ల కోసం నవంబరు 2012లో తిరిగి ఆ సీరియల్ లో నటించాడు.2012 మే లో దర్శకుడు దివ్య కుమార్ యారియాన్ సినిమా కోసం హీరోగా హిమాంశ్ ను ఎంపిక చేశారు.[5] 2014 జనవరి 10న సినిమా విడుదలైంది.2015 జనవరి లో అభి నహీతో కభీ నహీ సినిమాలో హీరోగా ఎంపికయ్యారు హిమాంశ్. ఆ తరువాత జీనా ఇసీ కా నాం హై, స్వీటీ దేసీ వెడ్స్ ఎన్.ఆర్.ఐ సినిమాలకు కూడా సైన్ చేశారు ఆయన. 2016 లో అభీ నహీతో కభీ నహీ సినిమా విడుదల అవుతుంది.[6]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | భాష | |
---|---|---|---|
2014 | యారియాన్ | హిందీ | |
2016 | అభీ నహీతో కభీ నహీ | హిందీ | |
2016 | జీనా ఇసీ కా నామ్ హై | హిందీ | |
2016 | స్వీటీ దేశీ వెడ్స్ ఎన్.ఆర్.ఐ | హిందీ |
టెలివిజన్
[మార్చు]- హమ్సే హై లైఫ్ సీరియల్ లో రాఘవ్ పాత్ర
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Himansh Kohli". web.archive.org. 2013-11-11. Archived from the original on 2013-11-11. Retrieved 2020-12-26.
- ↑ Fab Five Archived 2016-03-04 at the Wayback Machine, boxofficeindia.com, retrieved 11 May 2014
- ↑ "Abigail Jain in new show Humse Hai Life on Channel [V]". Metro Masti.
- ↑ Varun Kapoor enters Humse Hai Life on Channel V Archived 2013-11-02 at the Wayback Machine, The Times of India 1 June 2012, retrieved 11 May 2014
- ↑ "Divya Kumar finds the leading man for her directorial debut". Mid Day. 24 September 2012.
- ↑ "Virender K. Arora (an agriculturist magnate), who is producing the film with Arjun N. Kapoor, CEO of Virender K. Arora & Arjun N." TOI. 26 January 2015.