Jump to content

హిమాన్షి ఖురానా

వికీపీడియా నుండి
హిమాన్షి ఖురానా
జననం (1991-11-27) 1991 నవంబరు 27 (వయసు 33)
కిరాత్‌పూర్ సాహిబ్‌, పంజాబ్‌
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బిగ్ బాస్ 13
గుర్తించదగిన సేవలు
సద్దా హక్‌

హిమాన్షి ఖురానా, పంజాబీ మోడల్, సినిమా నటి, గాయని.[1] సద్దా హక్‌ అనే పంజాబీ సినిమాలో నటించింది. 2019లో రియాలిటీ షో బిగ్ బాస్ 13లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.[2]

జననం

[మార్చు]

హిమాన్షి ఖురానా 1991, నవంబరు 27న పంజాబ్‌లోని కిరాత్‌పూర్ సాహిబ్‌లో జన్మించింది.[3]

వృత్తిరంగం

[మార్చు]

హిమాన్షీ ఖురానా తన 16వ ఏట మిస్ లుధియానా పోటీలో గెలిచి, మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. 2010లో మిస్ పిటిసి పంజాబీ ఫైనలిస్ట్‌లలో ఒకరుగా నిలిచింది. 2010లోనే చండీగఢ్‌లో నిర్వహించిన మిస్ నార్త్ జోన్ పోటీలో విజేతగా నిలిచింది.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని 2019 నవంబరులో ప్రసారమైన బిగ్ బాస్ 13లో ధ్రువీకరించింది.[5] 2020 జనవరిలో, తన అతనితో ప్రేమ ముగిసిందని ఆమె ట్విట్టర్‌లో ధ్రువీకరించింది.[6] 2020 జనవరి నుండి తన బిగ్ బాస్ కో-కంటెస్టెంట్ అసిమ్ రియాజ్‌తో డేటింగ్ చేస్తోంది.[7]

మీడియా

[మార్చు]
  1. ది టైమ్స్ ఆఫ్ ఇండియా వారి చండీగఢ్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ పోటీలో 2016, 2017లలో 2వ స్థానంలో, 2018లో 14వ స్థానంలో, 2019, 2020లలో 9వ స్థానంలో[8] నిలిచింది.
  2. ది టైమ్స్ ఆఫ్ ఇండియా టీవీలో టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 2019లో 11వ స్థానంలో, 2020లో 17వ స్థానంలో[9] నిలిచింది.
  3. 2021లో, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కనిపించిన మొదటి మహిళా పంజాబీ నటి హిమాన్షి.[10]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు మూలాలు
2012 జీత్ జాంగీ జహాన్
2013 సద్దా హక్ సుఖప్రీత్
2015 లెదర్ లైఫ్ సిఫాట్
2 బోల్
2018 అఫ్సర్ పాట: "ఉధర్ చల్దా"
2021 శవ ని గిర్ధారి లాల్ సుర్జీత్ కౌర్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పాత్ర ఇతర వివరాలు మూలాలు
2019 బిగ్ బాస్ 13 పోటీదారు 14వ స్థానం [11]

మూలాలు

[మార్చు]
  1. TNN (12 January 2017). ""2 BOL" to feature Himanshi Khurana as the female lead". The Times of India. Retrieved 2022-04-19.
  2. "Bigg Boss 13 contestant Himanshi Khurana reveals how Shehnaaz Gill 'ruined' her love life, says channel showed her as 'villain'". Hindustan Times (in ఇంగ్లీష్). 15 January 2020. Retrieved 2022-04-19.
  3. "Himanshi Khurana celebrates birthday with Asim Riaz". The Indian Express (in ఇంగ్లీష్). 28 November 2020. Retrieved 2022-04-19.
  4. Majeed, Shariq (29 January 2012). "Bollywood dream keeps Himanshi busy". The Times of India. Retrieved 2022-04-19.
  5. "Bigg Boss 13: Mystery behind Himanshi Khurana's boyfriend 'Chow' ends; see his pic". The Times of India. 28 November 2019. Retrieved 2022-04-19.
  6. "Bigg Boss 13: Himanshi Khurana confirms break up with fiance". Mumbai Mirror (in ఇంగ్లీష్). 19 January 2020. Retrieved 2022-04-19.
  7. "Bigg Boss 13's Asim Riaz stands in support of girlfriend Himanshi Khurana; here's revisiting their complicated love story". The Times of India (in ఇంగ్లీష్). 8 April 2020. Retrieved 2022-04-19.
  8. "Hotties who rule Punjab as Chandigarh Times Most Desirable Women - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "Meet The Times 20 Most Desirable Women on Television 2020 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-19.
  10. "Himanshi Khurana's 'Surma Bole' makes her the first female Punjabi actor to feature at the New York Times Square Billboard - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-19.
  11. "Bigg Boss 13 wild card Himanshi Khurana: I don't need to take advantage of Shehnaaz Gill's popularity". The Indian Express (in ఇంగ్లీష్). 19 November 2019. Retrieved 2022-04-19.