హిమ్మత్ పురా ఆనంద్ బస్తీ
స్వరూపం
రకం | నివాస ప్రాంతం |
---|---|
స్థాపించిన తేదీ | 1670 |
ప్రధాన కార్యాలయం | |
ముఖ్యమైన వ్యక్తులు | సోను, కాళిల్ |
హిమ్మత్ పురా ఆనంద్ బస్తీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో చార్మినార్ చేరువలో ఉన్న పురాతన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 500 సంవత్సరాల క్రితం నిర్మించారు.[1] ఇది హైదరాబాదు మహానగర పాలకసంస్థ పరిధిలో ఒక భాగం.
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ప్రాంతం 1670లో నిజాం కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది. హైదరాబాదు నగరంలో ఉన్న అతి పురాతన ప్రాంతాల్లో ఇది ఒకటి. ఈ ప్రాంతంలో హైదయత్ మంజిల్, రషీద్ మంజిల్ అనే రెండు పెద్ద కట్టడాలు ఉన్నాయి. ఈ ప్రాంతం హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం, చార్మినార్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది హుస్సేనిఆలం పోలీసు స్టేషను పరిధికి చెందిన ప్రాంతం.[2]హిమ్మత్ పురా ఆనంద్ బస్తీ ప్రాంతంలో అమ్మాయిలకు మెట్రిక్ దాటి విద్యనందించడానికి 60 గదులతో కూడిన సరస్వతి మోడల్ స్కూల్ 21 ఎకరాలలో 1980, నవంబరు 14న స్థాపించబడింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "siasat". Retrieved 31 July 2019.
- ↑ https://www.hyderabadpolice.gov.in/ps/hussainialamps.html
- ↑ "Saraswati Senior Secondary School, Jaitu 151202". saraswatiseniorsecondaryschooljaito.com. Archived from the original on 2020-08-05. Retrieved 2020-08-10.