కొండ
స్వరూపం
(హిల్ నుండి దారిమార్పు చెందింది)
కొండలు భూమి మీద చుట్టూ ఉన్న ప్రాంతం కన్నా ఎత్తుగా ఉండి, శిఖరం కలిగిన ప్రదేశాలు.
నామీకరణం
[మార్చు]- చిన్న కొండలను గుట్టలు అంటారు.
- కొండలను పర్వతాలనుండి వేరుచేయడం కష్టం. అయినా సామాన్యంగా బాగా ఎత్తున్న కొండల్ని పర్వతాలు అంటారు. ఇంగ్లండులో సర్వే నియమాల ప్రకారం పర్వతం అనడానికి సముద్రమట్టం కన్నా 1000 అడుగులు లేదా (305 మీటర్లు) ఎత్తుండాలి. అయితే ఆక్స్ ఫర్డ్ నిఘంటువు 2000 అడుగులు (610 మీటర్లు) తీసుకోవాలని ప్రతిపాదించింది.
- కొన్ని పర్వతాలు వరుసగా ఉంటే వాటిని కనుమలు లేదా పర్వతశ్రేణులు అంటారు.
- కృత్రిమంగా చీమలు మొదలైన జీవుల చేత తయారుచేయబడిన వాటిని పుట్టలు అంటారు.
ప్రాముఖ్యత
[మార్చు]కొండలు చరిత్రలో చాలా ప్రాముఖ్యతను పొందాయి. చాలా ప్రదేశాలలో మానవులు కొండలమీద నివసించేవారు. దీనికి ముఖ్యమైన కారణం వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుండి, శత్రువుల నుండి రక్షణ కోసం. ఉదాహరణ: ప్రాచీన రోము నగరం ఏడు కొండల మీద నిర్మించారు.
భారతదేశంలో చాలా కోటలు దుర్భేద్యమైన పెద్ద పెద్ద కొండల మీద నిర్మించారు. ఉదా: గోల్కొండ, గ్వాలియర్, ఝాన్సీ మొదలైనవి. ఈ కొండలే కోటకు యుద్ధం సమయంలో చాలా విధాలుగా సాయపడతాయి. శత్రువులు అంత సులభంగా దాడిచేయలేరు.
ఇవి కూడా చూడండి
[మార్చు]Look up కొండ in Wiktionary, the free dictionary.
చిత్రమాలిక
[మార్చు]-
తిరుమల కొండలు, ఆంధ్రప్రదేశ్
-
కోస్టారికా దేశంలో ఒక కొండ
-
తూర్పు కనుమలు, అరకులోయ, ఆంధ్రప్రదేశ్
-
చీమల పుట్ట
-
పద్మనాభం కొండ, విశాఖ జిల్లా