హుస్సేన్‌సాగర్ లేక్‌ఫ్రంట్ పార్కు
హుస్సేన్‌సాగర్ లేక్‌ఫ్రంట్ పార్కు | |
---|---|
స్థానం | హుస్సేన్‌సాగర్, హైదరాబాదు, తెలంగాణ |
విస్తీర్ణం | 10 ఎకరాలు |
Established | 2023, సెప్టెంబరు 26 |
నిర్వహిస్తుంది | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
స్థితి | వాడులో ఉంది |
హుస్సేన్‌సాగర్ లేక్‌ఫ్రంట్ పార్కు అనేది తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న పార్కు. 22 కోట్ల రూపాయలతో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబడిన ఈ పార్కు 2023లో ప్రారంభించబడింది.[1]
ఏర్పాటు
[మార్చు]హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జలవిహార్ పక్కనే ఉన్న 10ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు ఏర్పాటుచేయబడింది. ఇందులో అండర్‌పాస్‌లతో కూడిన 690మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు గల ఎత్తైన నడక మార్గాలు, పంచతత్వ కాలినడక దారులు, సీటింగ్‌తో కూడిన వాటర్ ఛానల్ డెక్, హుస్సేన్ సాగర్‌పై 15మీటర్ల వరకు నీటిపై విస్తరించి ఉన్న గ్లాస్ డెక్, లేక్‌ఫ్రంట్ పార్క్ కోసం వేవ్ లాంటి కర్విలినియర్ డిజైన్‌లు, లైటింగ్, పిల్లల కోసం ఆట స్థలం, సీటింగ్‌తో కూడిన పెర్గోలాస్, ఇల్యుమినేటెడ్ లైట్ శిల్పాలు, డెకరేటివ్ లెడ్, హైమాస్ట్ లైటింగ్, థీమ్ పోస్ట్‌టాప్‌లు, వివిధ రకాలైన 4లక్షల మొక్కలు ఏర్పాటుచేశారు. వీటితో పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, టికెట్ కౌంటర్, సెక్యూరిటీ గదులు, శౌచాలయాల వంటి సకల సౌకర్యాలను కల్పించింది.[2]
ప్రారంభం
[మార్చు]ఈ పార్కును 2023లో , సెప్టెంబరు 26న రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్, హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ పరంజ్యోతిలతోపాటు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.[3]
వివరాలు
[మార్చు]2023 అక్టోబరు 1వ తేదీ నుండి సందర్శకులను ఈ పార్కు లోనికి అనుమతించారు. ఉదయం ఐదున్నర నుంచి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఈ పార్కు తెరిచి ఉంటుంది. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు మార్నింగ్ వాకర్లను అనుమతిస్తారు. పిల్లలకు 10, పెద్దలకు 50రూపాయలు, మార్నింగ్ వాకర్ల నుంచి నెలకు 100 రూపాయలు ప్రవేశ రుసుంగా నిర్ణయించబడింది. పుట్టినరోజు వేడుకలు, గెట్ టు గెదర్ ఫంక్షన్స్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు వంద మంది మించకుండా చేసుకునేందుకు 11 వేలురూపాయలుగా నిర్ణయించారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Lake Front Park Opening Hyderabad Today:హుస్సేన్‌సాగర్ వద్ద సరికొత్త అందాలు.. నేడే 'లేక్ ఫ్రంట్ పార్కు' ప్రారంభోత్సవం". ETV Bharat News. 2023-09-26. Archived from the original on 2023-09-30. Retrieved 2023-09-30.
- ↑ "Tank Bund: లేక్ ఫ్రంట్ పార్కు బంపరాఫర్.. ఫ్యామిలీ పార్టీలు చేసుకోవచ్చు". Samayam Telugu. Archived from the original on 2023-10-02. Retrieved 2023-10-02.
- ↑ telugu, NT News (2023-09-27). "సాగర్‌కు సరికొత్త అందం లేక్‌ఫ్రంట్ పార్కు". www.ntnews.com. Archived from the original on 2023-09-27. Retrieved 2023-09-30.
- ↑ Telugu, ntv (2023-10-01). "Lakefront Park: సందర్శకులకు పండగే.. నేటి నుంచే లేక్ ఫ్రంట్ పార్క్‌లోకి అనుమతి". NTV Telugu. Archived from the original on 2023-10-02. Retrieved 2023-10-02.