హుస్సేన్ తలత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హుస్సేన్ తలత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహ్మద్ హుస్సేన్ తలత్
పుట్టిన తేదీ (1996-02-12) 1996 ఫిబ్రవరి 12 (వయసు 28)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబ్యాటింగ్ ఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 219)2019 జనవరి 22 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 77)2018 ఏప్రిల్ 1 - వెస్టిండీస్ తో
చివరి T20I2021 ఫిబ్రవరి 14 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012–2013Zarai Taraqiati Bank
2013/14–2018/19Sui Northern Gas
2014/15–2018/19Lahore
2016/17Federally Administered Tribal Areas
2017–2021Islamabad United (స్క్వాడ్ నం. 12)
2017–2018Federal Areas
2018కేప్‌టౌన్ బ్లిట్జ్
2018/19పంజాబ్
2019/20బలూచిస్తాన్
2020/21Southern పంజాబ్ (స్క్వాడ్ నం. 90)
2021/22సెంట్రల్ పంజాబ్
2022పెషావర్ జాల్మి (స్క్వాడ్ నం. 8)
2022/23బలూచిస్తాన్
2023లాహోర్ కలందర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 18 58 81
చేసిన పరుగులు 2 394 3,073 2,271
బ్యాటింగు సగటు 2.00 24.62 37.93 39.15
100లు/50లు 0/0 0/2 5/17 6/12
అత్యుత్తమ స్కోరు 2 63 253 141*
వేసిన బంతులు 12 36 2,761 1,276
వికెట్లు 0 4 48 31
బౌలింగు సగటు 13.50 38.31 41.90
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/12 3/24 4/54
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 5/– 30/– 24/–
మూలం: ESPNcricinfo, 20 January 2023

మొహమ్మద్ హుస్సేన్ తలత్ (జననం 1996, ఫిబ్రవరి 12) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. 2018 ఏప్రిల్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. దేశీయంగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ లో లాహోర్ క్వాలండర్స్ తరపున ఆడాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

క్వెట్టా గ్లాడియేటర్స్‌లో అరంగేట్రం చేసి, అర్థ సెంచరీని సాధించాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ 1 పరుగుతో గెలవడానికి సహకారం అందించాడు.[1] 2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం ఫెడరల్ ఏరియాస్ జట్టులో ఎంపికయ్యాడు.[2][3] టోర్నీ ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.[4] 2018 జూన్ 3న, గ్లోబల్ టీ20 కెనడా టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్ కోసం ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో టొరంటో నేషనల్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు.[5][6]

2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజామ్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం బలూచిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[7][8] 2020 ఆగస్టులో, 2020–21 దేశీయ సీజన్ కోసం దక్షిణ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[9] 2020 అక్టోబరులో, 2020-21 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీలో, తలత్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 253 పరుగులతో తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు.[10]

కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్‌లో రావలకోట్ హాక్స్‌లో చేరాడు. 2021 కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఘనీ గ్లాస్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2018 మార్చిలో, వెస్టిండీస్‌తో జరిగిన వారి సిరీస్ కోసం పాకిస్తాన్ యొక్క ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో అతను ఎంపికయ్యాడు.[11][12] 2018 ఏప్రిల్ 1న వెస్టిండీస్‌పై పాకిస్తాన్ తరపున తన టీ20 అరంగేట్రం చేసాడు, అందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[13]

2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[14][15] 2018 డిసెంబరులో, అతను 2018 ఏసిసి ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[16] మరుసటి నెలలో, దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం పాకిస్తాన్ యొక్క వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[17] 2019 జనవరి 22 న దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[18] 2020 నవంబరులో, న్యూజిలాండ్ పర్యటన కోసం పాకిస్తాన్ 35 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[19]

మూలాలు

[మార్చు]
  1. "Hussain Talat". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  2. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 2023-09-04.
  3. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 2023-09-04.
  4. "Final (D/N), Pakistan Cup at Faisalabad, May 6 2018". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  5. "Global T20 Canada: Complete Squads". SportsKeeda. Retrieved 2023-09-04.
  6. "Global T20 Canada League – Full Squads announced". CricTracker. 4 June 2018. Retrieved 2023-09-04.
  7. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  8. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  9. "Six Cricket Association squads confirmed". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  10. "Hussain Talat (253) and Shan Masood (134) send Northern on a leather chase". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  11. "Asif Ali, Talat and Shaheen Afridi picked for WI T20Is". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  12. "Afridi, Talat, Ali bring gush of youth to Pakistan". International Cricket Council. Retrieved 2023-09-04.
  13. "1st T20I, West Indies tour of Pakistan at Karachi, Apr 1 2018". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  14. "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  15. "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  16. "Pakistan squad announced for Emerging Asia Cup 2018 to Co-Host by Pakistan and Sri Lanka". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.
  17. "Mohammad Amir, Mohammad Rizwan back in Pakistan ODI squad". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  18. "2nd ODI (D/N), Pakistan tour of South Africa at Durban, Jan 22 2019". ESPN Cricinfo. Retrieved 2023-09-04.
  19. "Pakistan name 35-player squad for New Zealand". Pakistan Cricket Board. Retrieved 2023-09-04.

బాహ్య లింకులు

[మార్చు]