హెచ్.ఆర్.కేశవమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హొచ్చిహళ్ళి రామస్వామయ్య కేశవమూర్తి
వ్యక్తిగత సమాచారం
జననం (1920-09-20) 1920 సెప్టెంబరు 20 (వయసు 103)
హొచ్చిహళ్ళి, చిక్కమగళూరు జిల్లా,కర్ణాటక, భారతదేశం
సంగీత శైలిభరత నాట్యం (మైసూర్ బాణీ)
వృత్తిభరతనాట్యం కళాకారుడు

హొచ్చిహళ్ళి రామస్వామయ్య కేశవమూర్తి ఒక భరతనాట్య కళాకారుడు, నాట్యాచార్యుడు.[1]

విశేషాలు[మార్చు]

ఇతడు 1920, సెప్టెంబర్ 7వ తేదీన కర్ణాటక రాష్ట్రం, చిక్కమగళూర్ జిల్లా హోచ్చిహళ్ళి అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు నట్టువనార్ కోలార్ గుండప్ప వద్ద భరతనాట్యం నేర్చుకున్నాడు. ఇతడు కర్ణాటక గాత్ర సంగీతాన్ని నరసింహయ్య, ఎన్.చెన్నకేశవయ్యలవద్ద వేణువును మైసూర్ శ్రీనివాసమూర్తి వద్ద అభ్యసించాడు.[2] ఇతడు 1949లో బెంగళూరులో "కేశవ నృత్యశాల" అనే శిక్షణా సంస్థను స్థాపించి దాని ద్వారా 2000మందికి పైగా విద్యార్థులకు నాట్యం నేర్పించాడు. వారిలో లలితా శ్రీనివాసన్, శ్యామ్‌ ప్రకాష్, వసంతలక్ష్మి మొదలైన వారు ముఖ్యులు. ఇతడు శ్రీకృష్ణ తులాభార, కావేరీ వైభవ, జటాయు మోక్ష, మోహినీ భస్మాసుర, పార్వతి కొరవంజి, తిరుకన కణసు, శకుంతల, గదాయుద్ధ మొదలైన 30కి పైగా నృత్యనాటికలకు దర్శకత్వం వహించాడు.

ఇతడు 50యేళ్ళకు పైగా కర్ణాటక రాష్ట్రంలో భరతనాట్యకళ అభివృద్ధికి పాటుపడ్డాడు. కర్ణాటక నృత్యకళా పరిషత్తుకు అనేక సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నాడు.

పురస్కారాలు[మార్చు]

ఇతడికి లభించిన అనేక పురస్కారాలలో కొన్ని ముఖ్యమైనవి:

మూలాలు[మార్చు]

  1. web master. "H. R. Keshava Murthy". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
  2. web master. "founder-director". KNS. Archived from the original on 16 అక్టోబర్ 2020. Retrieved 25 April 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)