హెన్రీ స్ట్రైకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెన్రీ స్ట్రైకర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హెన్రీ బెర్నార్డ్ స్ట్రైకర్
పుట్టిన తేదీ1888
బీకన్స్‌ఫీల్డ్, కేప్ కాలనీ
మరణించిన తేదీ1917 ఫిబ్రవరి 15
(వయస్సు 29)
డోడోమా,
జర్మన్ తూర్పు ఆఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుతెలియదు
బంధువులులూయిస్ స్ట్రైకర్ (సోదరుడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1912/13–1913/14Transvaal
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 3
చేసిన పరుగులు 70
బ్యాటింగు సగటు 23.33
100లు/50లు –/1
అత్యుత్తమ స్కోరు 66*
వేసిన బంతులు 198
వికెట్లు 2
బౌలింగు సగటు 80.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు 1/23
క్యాచ్‌లు/స్టంపింగులు 3/–
మూలం: Cricinfo, 2022 9 June

హెన్రీ బెర్నార్డ్ స్ట్రైకర్ (1888 - 1917, ఫిబ్రవరి 15) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. దక్షిణాఫ్రికా ఆర్మీ సైనికుడిగా పనిచేశాడు.

క్రికెట్ రంగం[మార్చు]

స్ట్రైకర్ 1888లో లూయిస్ స్ట్రైకర్ సీనియర్ - మౌడ్ దంపతులకు బీకాన్స్‌ఫీల్డ్‌లో జన్మించాడు.[1] జోహన్నెస్‌బర్గ్‌లోని సేక్రేడ్ హార్ట్ కళాశాలలో చదువుకున్నాడు. స్ట్రైకర్ 1913 మార్చిలో ట్రాన్స్‌వాల్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు, గ్రిక్వాలాండ్ వెస్ట్‌పై ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి అజేయంగా 66 పరుగులు చేశాడు.[1] 1914 జనవరిలో పర్యటిస్తున్న మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌కు వ్యతిరేకంగా ట్రాన్స్‌వాల్ కోసం మరో రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[2] మూడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో, 23.33 సగటుతో 70 పరుగులు చేశాడు.[3] బంతితో 23 పరుగులకు 1 వికెట్లతో రెండు వికెట్లు తీశాడు.[4] స్ట్రైకర్ మొదటి ప్రపంచ యుద్ధంలో దక్షిణాఫ్రికా సైన్యంలో పనిచేశాడు, అక్కడ దక్షిణాఫ్రికా సర్వీస్ కార్ప్స్ (జంతు రవాణా)లో కండక్టర్‌గా పనిచేశాడు.

మరణం[మార్చు]

ఇతని తన 29 సంవత్సరాల వయస్సులో 1917, ఫిబ్రవరి 15న జర్మన్ తూర్పు ఆఫ్రికాలోని డోడోమాలో బ్లాక్‌వాటర్ జ్వరంతో మరణించాడు.[1] ఇతని సోదరుడు టెస్ట్ క్రికెటర్ లూయిస్ స్ట్రైకర్ .

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 McCrery, Nigel (30 July 2015). Final Wicket: Test and First Class Cricketers Killed in the Great War. Pen and Sword. p. 306. ISBN 978-1473864191.
  2. "First-Class Matches played by Henry Stricker". CricketArchive. Retrieved 2022-06-10.
  3. "First-Class Batting and Fielding For Each Team by Henry Stricker". CricketArchive. Retrieved 2022-06-10.
  4. "First-Class Bowling For Each Team by Henry Stricker". CricketArchive. Retrieved 2022-06-10.

బాహ్య లింకులు[మార్చు]