హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ బట్టతల బాధితులకు తిరిగి జుట్టు మొలిపించుటకు చేసే చికిత్సా ప్రక్రియ.

నేపధ్యము[మార్చు]

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లిష్టమైన ప్రక్రియ. చాలా జాగ్రత్తగా, ఓపికతో చేయాల్సిన సర్జరీ ఇది. ఈ రోజుల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌లో చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన హెయిర్ స్టయిల్ ఉంటుంది. దానికనుగుణంగా డాక్టర్లు కొత్త పద్ధతులు అభివృద్ధి పరుస్తున్నారు. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటున్న వ్యక్తి ముందుగా మంచి పేరున్న నిపుణులైన డాక్టర్‌ను, క్లినిక్‌ను కలవాలి. డాక్టర్‌ను కలిసినపుడు హెయిర్‌లాస్ ఏ మేరకు ఉంది? శిరోజాలు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎంత భాగం చేయాలి? తదితర అంశాలను పరిశీలించి సూచనలు చేస్తారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్న వ్యక్తి తలలో నుంచే శిరోజాలను తీసుకోవడం జరుగుతుంది. అందుకే పూర్తి సహజసిద్ధంగా, ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఉంటుంది.

చికిత్సా పద్దతి[మార్చు]

హెయిర్‌ట ట్రాన్స్‌ప్లాంట్‌లో రెండు ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. స్ట్రిప్ లేదా ఎఫ్‌యూఈ (ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్). సర్జరీ కోసం ఒకరోజంతా క్లినిక్‌లోనే ఉండాల్సి ఉంటుంది. కొన్ని గంటల పాటు సర్జరీ జరుగుతుంది. ఈ సర్జరీకి లోకల్ అనస్థీషియా సరిపోతుంది. అంటే క్లయింట్ సర్జరీ జరుగుతున్నంత సేపు మెలకువగానే ఉంటాడు. ఎఫ్‌యూఈ పద్ధతిలో ఒక్కో వెంట్రుకను తీసుకుంటూ బట్టతల ప్రాంతంలో అతికించడం జరుగుతుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తరువాత ఎర్రగా మారడం, వాపు ఉంటాయి. కొన్ని వారాల తరువాత ఇవి తగ్గిపోతాయి. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తరువాత శిరోజాలు రాలిపోతాయి. కానీ అక్కడి నుంచే కొత్త జుట్టు పెరగడం మొదలవుతుంది. ఏడాది తరువాత జుట్టు పూర్తిగా పెరిగిపోతుంది. శిరోజాలు తీసే స్థలంలో, అతికించే స్థలంలో అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల నొప్పి ఏ మాత్రం తెలియదు. డాక్టర్‌ను కలిసినపుడు ఇప్పటి వరకు ఎన్ని సర్జరీలు చేశారు? వారి ఫోటోలు చూపించగలరా? సర్జరీకి ముందు సర్జీరీ తరువాత వారి శిరోజాలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలను ఫోటోలు చూసి తెలుసుకుంటే మంచిది. వీలుంటే సర్జరీ చేయించుకున్న క్లయింట్స్‌తో ఒకసారి మాట్లాడించమని అడగవచ్చు. సర్జరీ చేయించుకుంటే మీ హెయిర్ స్టయిల్ ఎలావస్తుందో స్కెచ్ గీసి చూపించమని కోరవచ్చు. ఎన్ని సెషన్లు రావాల్సి ఉంటుందో తెలుసుకోవడం మరవద్దు. మొత్తం సర్జరీకి ఎంత ఖర్చవుతుందో ముందుగా తెలుసుకోవడం చాలా అవసరం. డాక్టర్‌ను కలిసినపుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకుని సందేహాలు నివృత్తి చేసుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఇతర మందులు వాడే అలవాటు ఉంటే సర్జరీకి కొన్ని వారాల ముందు నుంచి ఆపేయాలి. దీనివల్ల ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్‌రాకుండా ఉంటాయి. అధికంగా మద్యం సేవించడం, ఇతర వ్యాధులకు వాడే మందుల వల్ల సర్జరీ సమయంలో లేదా తరువాత బ్లీడింగ్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్న వారు తప్పనిసరిగా ఈ అలవాట్లను మానుకోవాలి. ఒక్ సెషన్‌లో 1500 నుంచి 3 వేల వరకు శిరోజాలను తీసి అతికించవచ్చు. రోజంతా సర్జరీ చేసినపుడు ఇది సాధ్యమవుతుంది. చాలా వరకు రోగులు ఉదయం క్లినిక్‌కు వస్తే సాయంత్రంకల్లా ఇంటికి వెళ్లిపోవచ్చు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోగానే నిండైన జుట్టుతో అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ దానికి సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన శిరోజాలు నెమ్మదిగా పెరుగుతాయి. సర్జరీ చేసిన కొన్ని వారాల తరువాత ట్రాన్స్‌ప్లాంట్ హెయిర్స్ రాలిపోతాయి. ఆ తరువాత నెమ్మదిగా పెరగటం మొదలవుతుంది. మూడు నెలల్లో మెల్లగా శిరోజాలు పెరుగుతుండటం గమనించవచ్చు. ఆరు నుంచి ఏడాదిలోపల జుట్టు పూర్తిగా పెరుగుతుంది. సర్జరీకి ముందు, సర్జరీ తరువాత తేడాను స్పష్టంగా గమనించవచ్చు. ఈ జుట్టు పూర్తిగా సాధారణ జుట్టు మాదిరిగానే ఉంటుంది. ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉండదు. మామూలుగా దువ్వుకోవడం చేయవచ్చు. ఈ జుట్టు ఊడిపోవడం మళ్లీ బట్టతల రావడం అంటూ జరగదు. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జుటు జీవితాంతం నిగనిగలాడుతూ ఉంటుంది. బట్టతల సమస్యకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ ఒక వరం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌తో బట్టతలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పవచ్చు.