Jump to content

హెర్బ్ మెక్‌గిర్

వికీపీడియా నుండి
హెర్బ్ మెక్‌గిర్
దస్త్రం:Herb McGirr.jpg
1927లో న్యూజిలాండ్ జట్టులో భాగంగా మెక్‌గిర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హెర్బర్ట్ మెండెల్సన్ మెక్‌గిర్
పుట్టిన తేదీ(1891-11-05)1891 నవంబరు 5
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
మరణించిన తేదీ1964 ఏప్రిల్ 14(1964-04-14) (వయసు 72)
నెల్సన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మాధ్యమం
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 16)1930 14 February - England తో
చివరి టెస్టు1930 21 February - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 2 88
చేసిన పరుగులు 51 3,992
బ్యాటింగు సగటు 51.00 28.71
100లు/50లు 0/1 5/23
అత్యధిక స్కోరు 51 141
వేసిన బంతులు 180 14,973
వికెట్లు 1 239
బౌలింగు సగటు 115.00 27.49
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 9
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 1/65 7/45
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 54/–
మూలం: Cricinfo, 2017 1 April

హెర్బర్ట్ మెండెల్సన్ మెక్‌గిర్ (1891, నవంబరు 5 - 1964, ఏప్రిల్ 14) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. 1930లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

జననం

[మార్చు]

హెర్బర్ట్ మెండెల్సన్ మెక్‌గిర్ 1891, నవంబరు 5న వెల్లింగ్టన్‌లో జన్మించాడు. ఇతని తండ్రి విలియం మెక్‌గిర్[1] 1883-84 నుండి 1889-90 వరకు వెల్లింగ్టన్ తరపున 14 మ్యాచ్‌లు ఓపెనింగ్ బౌలర్‌గా ఆడాడు. 11.80 సగటుతో 46 వికెట్లు తీశాడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

1929-30 సీజన్‌లో, హెరాల్డ్ గిల్లిగాన్ నేతృత్వంలోని ఎంసిసి జట్టు న్యూజీలాండ్‌తో మొదటి టెస్టులు ఆడినప్పుడు, మెక్‌గిర్ ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో మూడవ, నాల్గవ టెస్టుల్లో మాత్రమే ఆడాడు. నాల్గవ టెస్టులో మెక్‌గిర్ హాఫ్ సెంచరీని సాధించాడు. స్టాన్ నికోల్స్ ను ఔట్ చేసి తన ఏకైక టెస్ట్ వికెట్‌ను తీసుకున్నాడు.

కెరీర్‌లో హాఫ్ సెంచరీతో కూడిన అతి తక్కువ పరుగులు (51) చేసిన టెస్ట్ మ్యాచ్ రికార్డును కలిగి ఉన్నాడు.[2][3] టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతి పెద్ద వయసు (38 ఏళ్ళ 101 రోజులు) కలిగిన న్యూజీలాండ్ ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు.[4]

క్రికెట్ తరువాత

[మార్చు]

క్రికెట్ తర్వాత నెల్సన్ కాలేజీలో క్రికెట్ కోచ్‌గా పనిచేశాడు.[5] 1965లో విజ్డెన్‌లో మెక్‌గిర్ సంస్మరణలో అతను 67 సంవత్సరాల వయస్సు వరకు క్లబ్ క్రికెట్ ఆడాడని,[6] స్కోర్ చేసిన మరుసటి రోజు "పాలు తీసుకునేటప్పుడు అతను జారిపడ్డాడు" అనే కారణంగా వదిలిపెట్టాడని నమోదు చేసింది. 1964లో నెల్సన్‌లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. William McGirr at Cricket Archive
  2. Walmsley, Keith (2003). Mosts Without in Test Cricket. Reading, England: Keith Walmsley Publishing Pty Ltd. p. 457. ISBN 0947540067..
  3. "How many bowlers have taken four wickets in five balls in an ODI?". ESPN Cricinfo. Retrieved 21 April 2020.
  4. Wisden 2012, p. 1315.
  5. Brittenden, p. 108.
  6. Wisden 1965, p. 969.

బాహ్య లింకులు

[మార్చు]