Jump to content

హేగే జీంగోబ్

వికీపీడియా నుండి
(హేగే గీంగోబ్ నుండి దారిమార్పు చెందింది)
Hage Geingob
నమీబియా అధ్యక్షుడు
In office
2015 మార్చి 21 – 2024 ఫిబ్రవరి 4
Vice Presidentనిక్కీ లాంబో
నమీబియా ప్రధానమంత్రి
In office
2012 డిసెంబర్ 4 – 2015 మార్చి 20
వ్యక్తిగత వివరాలు
జననం(1941-08-03)1941 ఆగస్టు 3
, దక్షిణాఫ్రికా
మరణం2024 ఫిబ్రవరి 4(2024-02-04) (వయసు 82)
విండోక్ నమీబియా
రాజకీయ పార్టీనమీబియా పీపుల్స్ పార్టీ
జీవిత భాగస్వామి3
సంతానం3
వృత్తిరాజకీయ నాయకుడు

హేజ్ గాట్‌ఫ్రైడ్ గీంగోబ్ (3 ఆగస్టు 1941 - 4 ఫిబ్రవరి 2024) నమీబియా దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ఆయన 2015 నుండి 2024 ఫిబ్రవరిలో మరణించే వరకు నమీబియా మూడవ అధ్యక్షుడిగా పనిచేశాడు. హేగే గీంగోబ్ 1990 నుండి 2002 వరకు నమీబియాకు మొదటి ప్రధానమంత్రిగా ప్రధానమంత్రిగా పనిచేశాడు. 2012 నుండి 2015 వరకు రెండవసారి ప్రధానమంత్రిగా పనిచేశారు. 2008 నుంచి 2012 వరకు హేగే గింగోబ్ నమీబియా వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అతను 2017 నుండి మరణించే వరకు అధికార నమీబియా పీపుల్స్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశాడు.

2014లో, హేగే గీంగోబ్ నమీబియా అధ్యక్ష ఎన్నికలలో గెలిచి నమీబియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు . నవంబర్ 2017లో, హేగే గీంగోబ్ నమీబియా పీపుల్స్ పార్టీ మూడవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

బాల్యం

[మార్చు]

హేగే గీంగోబ్ , 1941 ఆగస్టు 3న సౌత్ వెస్ట్ ఆఫ్రికా (ప్రస్తుత నమీబియా )లోని ఓట్జివరోంగోలో జన్మించాడు. [1] హేగే గీంగోబ్ తన ప్రారంభ విద్యను సౌత్ వెస్ట్ ఆఫ్రికాలోని ఒటావిలో బంటు విశ్వవిద్యాలయంలో ప్రారంభించాడు. హేగే గీంగోబ్ 1958లో నమీబియాలోని అగస్టినియం శిక్షణ కళాశాల లో చేరాడు. 1960లో, అగస్టినియం శిక్షణ కళాశాలలో విద్య సరిగ్గా ఉండడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్నాడని హేగే గీంగోబ్ కళాశాల నుంచి బహిష్కరించారు. 1961లో హేగే గీంగోబ్ టీచర్-ట్రైనింగ్ కోర్సు పూర్తి చేశాడు. తదనంతరం, హేగే గీంగోబ్ సెంట్రల్ నమీబియాలోని సుమెబ్ ప్రైమరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా బాధ్యతలను చేపట్టాడు. అయితే కొంతకాలానికి ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఉపాధ్యాయుడిగా హేగే గీంగోబ్ పనికిరాడు అని అధికారులు చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హేగే గీంగోబ్ ఫుట్‌బాల్ క్రీడకు అభిమాని అనేక ఉన్నత స్థాయి ఫుట్బాల్ ఆటలకు హాజరయ్యాడు. [2]

1967లో హేగే గీంగోబ్ న్యూయార్క్ నగరానికి చెందిన ప్రిసిల్లా చార్లీన్ క్యాష్‌ను వివాహం చేసుకున్నాడు; ఈ దంపతులకు నాంగులా గింగోస్-డ్యూక్స్ అనే ఒక కూతురు ఉంది. [3] హేగే గీంగోబ్ తరువాత 1993 సెప్టెంబర్ 11న రెండవ పెళ్లి చేసుకున్నాడు.లోయిని కండుమే అనే వ్యాపారవేత్తను విండ్‌హోక్‌లో వివాహం చేసుకున్నాడు, ఒక కూతురు ఒక కొడుకు సంతానం.[4] హేగే గీంగోబ్ మే 2006లో విడాకులు తీసుకున్నాడు ‌ [4] హేగే గీంగోబ్ 2015 ఫిబ్రవరి 14న మోనికా కలోండోను మూడవ పెళ్లి చేసుకున్నాడు. [5]

మరణం

[మార్చు]

2013లో, హేగే జింగోబ్‌ మెదడుకు శస్త్రచికిత్స జరిగింది. హేగే జింగోబ్‌ కు 2014లో మెదడు క్యాన్సర్ ఉందని తేలింది. హేగే గీంగోబ్ గుండెకు 2023లో దక్షిణాఫ్రికాలో శస్త్రచికిత్స జరిగింది. [6]

2024 జనవరి 8న హేగే జింగోబ్‌ తనకు రొమ్ము క్యాన్సర్ కూడా ఉన్నట్లు ప్రకటించాడు. [7] హేగే జింగోబ్‌ 2024 జనవరి 25న యునైటెడ్ స్టేట్స్‌లో చికిత్స కోసం వెళ్ళాడు. రెండు రోజుల చికిత్స తర్వాత జనవరి 30న నమీబియాకు తిరిగి వచ్చాడు. [8] నమీబియా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 4న విండ్‌హోక్‌లోని లేడీ పోహంబా హాస్పిటల్‌లో చికిత్స పొందుతు హేగే జింగోబ్‌ మరణించినట్లు ప్రకటించింది. [9]

అవార్డులు

[మార్చు]
  • 1980లో, విద్యారంగంలో హేగే జింగోబ్‌ చేసిన సేవలకు గాను ఫ్రెంచ్ ప్రభుత్వం పామ్స్ అకాడెమిక్స్ (ఆఫీసర్ క్లాస్) అవార్డును ప్రదానం చేసింది.
  • 1987లో, హేగే జింగోబ్‌ కు నమీబియా దేశానికి చేసిన సేవలకు గాను ఓముగులుగ్వొంబాషే మెడల్ లభించింది.
  • 1994లో హేగే జింగోబ్‌, LL అవార్డును పొందారు.ఎల్ ఎల్ డి. కొలంబియా కాలేజ్, ఇల్లినాయిస్ ద్వారా హానోరిస్ కాసా . అవార్డును పొందారు. [10]
  • 1994లో, క్యూబా దేశ అత్యున్నత పురస్కారం కార్లోస్ మాన్యుయెల్ డి సెస్పెడెస్‌ అవార్డును అందుకున్నారు.
  • 1994లో, అత్యుత్తమ రాజకీయ నాయకత్వాన్ని అందించినందుకు నమీబియా ప్రభుత్వంచే ఆర్డర్ ఆఫ్ ది సన్, అవార్డును అందుకున్నారు.
  • 1995లో, LL అవార్డు లభించింది.డి. (డాక్టరేట్ ఆఫ్ లాస్) డిల్లీ విశ్వవిద్యాలయం, నుండి డాక్టరేట్ అందుకున్నారు.[10]
  • 1997లో, LL అవార్డును పొందారు.నమీబియా విశ్వవిద్యాలయంచే డాక్టరేట్ అందుకున్నారు. [10]
  • 1998లో, ది అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ రోమ్ ద్వారా డాక్టరేట్ ఆఫ్ హ్యూమన్ లెటర్స్ (హానోరిస్ కాసా) లభించింది. [10]
  • 2001లో, అణగారిన పిల్లలకు విద్యను అందించాలనే లక్ష్యంతో హేగే జింగోబ్‌ కొత్త పాఠశాల ను ప్రారంభించారు. విండ్‌హోక్ చుట్టుపక్కల ఉన్న చదువుతున్న పిల్లలకు హేజ్ జి. గింగోబ్ హై స్కూల్ చాలా మందికి విద్యను అందిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. Eligon, John; Zhuang, Yan (4 February 2024). "Hage Geingob, Namibia's President, Dies at 82". The New York Times. Retrieved 5 February 2024.
  2. "President Hage Geingob's tribute to Namibian Sports Mascot Robson "Robbie" Savage". Government of Namibia. 21 July 2017. Archived from the original on 8 August 2017. Retrieved 6 August 2018.
  3. PM's ex-wife Patty dies Archived 4 జూన్ 2016 at the Wayback Machine, The Namibian, 5 December 2014
  4. 4.0 4.1 "Geingob marriage on rocks" Archived 4 జూన్ 2016 at the Wayback Machine, The Namibian, 24 July 2008.
  5. Geingob, Monica say 'I do' Archived 4 జూన్ 2016 at the Wayback Machine, The Namibian, 16 February 2015
  6. "Hage Geingob, Namibia's president, dies aged 82 after cancer treatment". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). 4 February 2024. ISSN 0261-3077. Retrieved 4 February 2024.
  7. "Namibian President Geingob dies in hospital while receiving treatment". Africanews (in బ్రిటిష్ ఇంగ్లీష్). 4 February 2024. Retrieved 4 February 2024.
  8. Petersen, Shelleygan (4 February 2024). "President Hage Geingob is dead". The Namibian (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
  9. "Namibian President Hage Geingob dies in a hospital where he was receiving treatment". National Public Radio. Associated Press. 4 February 2024. Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
  10. 10.0 10.1 10.2 10.3 "Hage G. Geingob". The Namibian (The President's 77th Birthday Supplement ed.). 3 August 2018. p. 4.