హేమంత్ కనిత్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హేమంత్ కనిత్కర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1942-12-08)1942 డిసెంబరు 8
మరణించిన తేదీ2015 జూన్ 9(2015-06-09) (వయసు 72)
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగు-
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫస్ట్ క్లాస్
మ్యాచ్‌లు 2 87
చేసిన పరుగులు 111 5006
బ్యాటింగు సగటు 27.75 42.78
100లు/50లు -/1 13/-
అత్యధిక స్కోరు 65 250
వేసిన బంతులు - 82
వికెట్లు - 1
బౌలింగు సగటు - 54.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - -
అత్యుత్తమ బౌలింగు - 1/29
క్యాచ్‌లు/స్టంపింగులు -/- 70/20
మూలం: [1]

హేమంత్ కనిత్కర్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, మహారాష్ట్ర స్టంపర్.15 ఏళ్ల క్రికెట్ అనుభవం ఉన్న కనిత్కర్ 1974-75 మధ్యకాలంలో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండిస్ జట్టు భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంలో టీమిండియా తరపున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. అమరావతిలో జన్మించిన కనిత్కర్ 1963-64, 1977-78 మధ్యకాలంలో ఆయన మహారాష్ట్ర తరపున క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించారు.

జీవిత విశేషాలు[మార్చు]

1942, డిసెంబర్ 8న మహారాష్ట్రలోని అమ్రావతిలో జన్మించారు. హేమంత్ కనిత్కర్‌కు ఇద్దరు కుమారులు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించిన సమాచారం మేరకు కనిత్కర్ కుమారుడు హృషికేష్ కూడా టీమిండియా మాజీ ఆటగాడని తెలుస్తోంది. బంతిని అతి బలంగా కొట్టగలిగే వికెట్ కీపర్లలో హేమంత్ కనిత్కర్ ఒకరు. మహారాష్ట్ర తరుపున రంజీల్లో ఆడిన హేమంత్ కనిత్కర్ 5,007 పరుగులు సాధించారు. ఇందులో 13 సెంచరీలను నమోదు చేశారు. 1970-71లో రాజస్ధాన్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో అత్యధికంగా 250 పరుగులు చేశారు. సుమారు పదేళ్ల పాటు రంజీ క్రికెట్‌కు సేవలందించారు. బీసీసీఐ ఆల్ ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా కూడా సేవలు అందించారు.

కనిత్కర్‌ 1963-64 లో సౌరాష్ట్రతో తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడారు. రిటైరైన తర్వాత 1977-78లో మహారాష్ట్రకు కోచ్‌, సెలెక్టర్‌గా వ్యవహరించారు. తర్వాత 1996-97 నుంచి 1998-99 వరకు జాతీయ జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 'హేమంత్‌ కనిత్కర్‌ భారత జట్టు తరఫున రెండు టెస్టులే ఆడినప్పటికీ మహారాష్ట్ర తరఫున దశాబ్దంనరకు పైగా రంజీ ట్రోఫీలో ఆడి మంచి బ్యాట్స్‌మెన్‌గా, వికెట్‌ కీపర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.[1]

ఇతర వివరాలు[మార్చు]

  • 1974లో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 2 టెస్టులు ఆడినాడు.
  • హేమంత్ కుమారుడు హృషికేశ్ కనిత్కర్ కూడా 1990లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
  • తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను 1974, నవంబర్ 22న. మలి టెస్ట్ డిసెంబర్ 11న ఆడినాడు. 2 టెస్టులలో కలిపి 27.75 సగటుతో 111 పరుగులు సాధించాడు.
  • టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 65 పరుగులు.
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హేమంత్ 87 మ్యాచ్‌లు ఆడి 42.78 సగటుతో 5006 పరుగులు చేశాడు.
  • క్రికెట్ జీవితంలో ఇతడికి 13 సెంచరీలు ఉన్నాయి.
  • ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 250 పరుగులు.

మరణం[మార్చు]

అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పూణెలోని సొంత నివాసంలో 2015 జూన్ 9న రాత్రి తుదిశ్వాస విడిచారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]