హేమల్ రణసింగ్
హేమల్ సచింద్ర రణసింగ్ | |
---|---|
జననం | హేమల్ సచింద్ర రణసింగ్ 1984 ఆగస్టు 25 |
జాతీయత | శ్రీలంక |
విద్య | సెయింట్ థామస్ కళాశాల,మాతలే |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2012 – present |
ఎత్తు | 186 సెంటీమీటర్లు (6 అ. 1 అం.)[2] |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు |
|
హేమల్ రణసింగ్ (జననం ఆగష్టు 25 1984) శ్రీలంక సినిమా నటుడు.[3] 2016, 2018 లో డెరానా ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడుగా మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డును పొంది విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.ప్రస్తుతం సినిమాల్లో శ్రీలంకలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకడు అయ్యాడు.ఉత్తమ ప్రామిసింగ్ యాక్టర్‌ని గెలుచుకున్నాడు.[4]రణసింగ్ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించాడు.మొదటిలో అనేక ప్రకటనల ప్రకటనలలో నటించాడు.2012 లో సూపర్ సిక్స్‌లో సినీ రంగ లోకి వచ్చాడు.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]హేమల్ రణసింగ్ ఆగష్టు 1984 న 25 జన్మించాడు. అతనికి ఇద్దరు అన్నలు,ఒక తమ్ముడు ఉన్నారు.తల్లి దండ్రులు సేనరత్నే రణసింగ్,విశాఖ చిత్రాణి మేడివాక.అతని తండ్రి తల్లి ఆయుర్వేద వైద్యులు.హేమల్ రణసింగ్ మొదట ప్రైవేట్ కంపెనీలో పనిచేశాడు.తర్వాత శ్రీలంకలోని కళారంగాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. హేమల్ రణసింగ్ సెయింట్ థామస్ కాలేజీ సెకండరీ విద్య కోసం చదివాడు.నలుగురు సోదరుల్లో రణసింగ్ మూడోవాడు.[6] హేమల్ రణసింగ్ నటన జీవితంలో తల్లి దండ్రులు ప్రోత్సహించేవారు.రణసింగ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కలవాడు.23 సెప్టెంబర్ 2010న హేమల్ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు అతని తండ్రి సేనరత్నే రణసింగ్ మరణించాడు.[7][8][9]హేమల్ రణసింగ్ కి ఇష్టమైన సినిమాలు గ్లాడియేటర్,అవతార్.
నటనా వృత్తి
[మార్చు]హేమల్ నటించిన తొలి చిత్రం సూపర్ సిక్స్ తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు.2015 సరసవియ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్, ది మోస్ట్ పాపులర్ యాక్టర్,ఫోర్త్ డెరనా ఫిల్మ్ అవార్డ్స్ గెలుచుకున్నాడు.[10] ఇండిపెండెంట్ టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడిన ఈలంగాట మొకాడ వెన్నె లో నటించాడు.2021లో లియానాగే దర్శకత్వం వహించిన థ్రిల్లర్ సినిమాలో దొంగ పాత్రలో నటించాడు.[11]2009లో అతను స్పెయిన్‌లో "ది మోడల్ ఆఫ్ ది వరల్డ్"లో పాల్గొన్నాడు. మేల్ మోడల్ ఆఫ్ ది వరల్డ్ 2009 టైటిల్‌ను గెలుచుకున్నాడు అలాగే పోటీ సమయంలో 'బెస్ట్ గ్లామర్' 'బెస్ట్ క్యాట్‌వాక్' అవార్డును గెలుచుకున్నాడు.2010లో మిస్టర్ శ్రీలంక టైటిల్‌ను గెలుచుకున్నాడు.సూపర్ సిక్స్ సినిమా శ్రీలంక సినిమా అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. దర్శకుడు ఉదరా పల్లియగురుగే శ్రీలంక చిత్రాన్ని హిందీలో డబ్ చేసి భారతదేశంలో ప్రారంభించిన మొదటి శ్రీలంక దర్శకుడు.సూపర్ సిక్స్ యొక్క ఐదు కాపీలు 2012లో ముంబైలోని థియేటర్లలో విడుదలయింది.శ్రీలంక నటీనటులు నటించిన నిర్మాణం భారతదేశంలోని థియేటర్లలోకి రావడం ఇదే మొదటిసారి.మొదటి సినిమాతోనే హేమల్ రణసింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.శ్రీలంకలో ప్రముఖ నాన్-బ్యాంకు ఆర్థిక సంస్థ పబ్లిక్ లీజింగ్ ఫైనాన్స్‌తో ప్రగటన చేయడానికి ఒప్పందం (MOU) పై సంతకం చేశాడు.
ఇతర విశషాలు
[మార్చు]పోటీలు
[మార్చు]- 2009 స్పెయిన్‌లో "ది మోడల్ ఆఫ్ ది వరల్డ్"లో పాల్గొన్నాడు. మేల్ మోడల్ ఆఫ్ ది వరల్డ్ 2009 టైటిల్ ను గెలుచుకున్నాడు.అలాగే పోటీ సమయం లో బెస్ట్ గ్లామర్ బెస్ట్ క్యాట్‌వాక్' అవార్డును గెలుచుకున్నాడు.[12][13]
- 2010లో, రణసింగ్ మిస్టర్ శ్రీలంక టైటిల్‌ను గెలుచుకున్నాడు. కొరియాలో జరిగిన మిస్టర్ వరల్డ్ 2010 లో శ్రీలంక కు ప్రాతినిధ్యం వహించాడు
మోడలింగ్
[మార్చు]- 2018లో, అతను పీపుల్స్ లీజింగ్ & ఫైనాన్స్ PLC లిమిటెడ్, శ్రీలంకలోని OXYకి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడ్డాడు .
డాన్స్
[మార్చు]- 2011లో స్వర్ణవాహిని డాన్స్ స్టార్స్ డ్యాన్స్ పోటీలో పాల్గొన్నారు. నెలల పోటీ తర్వాత, హేమల్ పోటీలో 1వ రన్నరప్‌గా నిలిచాడు.అతను వివిధ స్థానిక ప్రదర్శనల కార్యక్రమాలలో ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు.హిరు సూపర్ డాన్సర్ రియాలిటీ పోటీ యొక్క ముగ్గురు న్యాయనిర్ణేతలలో ఒకరిగా కూడా అతను వ్యవహరిస్తాడు.
నటించినా చిత్రాలు
[మార్చు]తన నటనా వృత్తితో పాటు వివిధ రంగాలలో నటనకు దోహదపడింది. 2012 చిత్రం సూపర్ సిక్స్‌తో శ్రీలంక చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు
- సూపర్ సిక్స్
- ప్రవేగాయ
- కళింగ
- ఆదరణీయ కథవాక్
- జూమ్
- బన్ధనాయ
- దేడును ఆకాసే
- తాల
- విజయబా కొల్లాయ నయనానంద
- యూ టర్న్
- కొలంబో ఆస్కార్
- లవ్ స్టోరీ
- ఐస్ క్రీం
- సిహీనాభిషేకం
- ఆశావారి
- మరియా
వివాదాలు
[మార్చు]ఆదరణీయ కథవాక్ సినిమాలో హేమల్ ప్రధాన పాత్రలో నటించాడు.ఈ చిత్రంలో ఆల్కహాల్ పొగాకును ప్రోత్సహించడంతోపాటు నేషనల్ టుబాకో అండ్ ఆల్కహాల్ అథారిటీ (నాటా) చట్టాన్ని ఉల్లంఘించినందుకు తీవ్రంగా విమర్శలు వచ్చాయి. పలు మీడియా కథనాలలో ప్రచురితమైన ఆరోపణలను హేమల్ బహిరంగంగా విమర్శించారు.
అవార్డులు ప్రశంసలు
[మార్చు]స్థానిక చలనచిత్రోత్సవాలలో అనేక అవార్డులను గెలుచుకున్నాడు[14][15]
ఫిల్మ్ అవార్డులు
[మార్చు]- 2016 అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు
- 2016 క్రిటిక్ అవార్డు
- 2016 ప్రవేగాయ జ్యూరీ అవార్డు
- 2018 అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు
- 2017 సిగ్నిస్ ఫిల్మ్ అవార్డులు
మూలాలు
[మార్చు]- ↑ "Biography". Wix.com. 25 August 1984. Retrieved 10 May 2012.[permanent dead link]
- ↑ "Show Contestant – Mister World – Mister World". Mrworld.tv. Retrieved 2 January 2017.
- ↑ "Actor in Sinhala cinema – Hemal Ranasinghe". National Film Corporation. Archived from the original on 23 అక్టోబరు 2017. Retrieved 11 March 2017.
- ↑ "With Love, love love..." Daily News. Retrieved 3 August 2019.
- ↑ "Hemal Ranasinghe". Sinhala Cinema Database. Retrieved 11 March 2017.
- ↑ "Hemal Sachindra Ranasinghe ~ Sri Lankan Actress and Models Photos". Slactressmodels.blogspot.com. Retrieved 2 January 2017.
- ↑ "Talk with Hemal". Sarasaviya. Archived from the original on 23 జూన్ 2018. Retrieved 17 November 2017.
- ↑ "Mrworld Home". Mrworld.tv. Archived from the original on 13 June 2012. Retrieved 10 May 2012.
- ↑ "The new hero in Sinhala cinema". Sarasaviya. Archived from the original on 25 మార్చి 2018. Retrieved 11 March 2017.
- ↑ "Most popular Hemal-Dinakshi,Best Jackson-Kaushalya at Derana cinema film awards". Gossip Lanka News [English]. 15 May 2016. Archived from the original on 27 డిసెంబరు 2016. Retrieved 2 January 2017.
- ↑ "To be successful, you must take risks every day: Hemal Ranasinghe speaks to the media after three years". Sarasaviya. Retrieved 2021-04-12.
{{cite web}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Models of the Year and Mr. Sri Lanka | Fashion". Dailymirror.lk. 15 October 2010. Archived from the original on 29 August 2011. Retrieved 10 May 2012.
- ↑ "Hemal Sachindra Ranasinghe at NEXT Hottest Model – next hottest model". Nextmodelmen.typepad.com. Archived from the original on 13 April 2012. Retrieved 10 May 2012.
- ↑ "Fourth Derana Awards". Sarasaviya.lk. Archived from the original on 24 July 2016. Retrieved 11 March 2017.
- ↑ "Stars shower at Hiru Awards". Sarasaviya. Archived from the original on 18 మార్చి 2017. Retrieved 11 March 2017.