హైడ్రాక్సీ క్లోరోక్విన్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(RS)-2-[{4-[(7-chloroquinolin-4-yl)amino]pentyl}(ethyl)amino]ethanol | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Plaquenil, others |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a601240 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) ? (US) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) POM (UK) ℞-only (US) ℞ Prescription only |
Routes | నోటి ద్వారా (tablets) |
Pharmacokinetic data | |
Bioavailability | Variable (74% on average); Tmax = 2–4.5 hours |
Protein binding | 45% |
మెటాబాలిజం | Liver |
అర్థ జీవిత కాలం | 32–50 days |
Excretion | Mostly Kidney (23–25% as unchanged drug), also biliary (<10%) |
Identifiers | |
CAS number | 118-42-3 |
ATC code | P01BA02 |
PubChem | CID 3652 |
IUPHAR ligand | 7198 |
DrugBank | DB01611 |
ChemSpider | 3526 |
UNII | 4QWG6N8QKH |
KEGG | D08050 |
ChEBI | CHEBI:5801 |
ChEMBL | CHEMBL1535 |
Synonyms | Hydroxychloroquine sulfate |
Chemical data | |
Formula | C18H26ClN3O |
Mol. mass | 335.872 g/mol |
| |
(what is this?) (verify) |
దోమలు కుట్టడం వల్ల వచ్చే మలేరియా సంక్రామ్యతను నిరోధించడానికి లేదా చికిత్స చేయడానికి హైడ్రోక్సిక్లోరోక్వినైన్ ఉపయోగించబడుతుంది. ప్రత్యేకంగా దీనిని క్లోరోక్విన్-సెన్సిటివ్ మలేరియా కోసం ఉపయోగిస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ల్యూపస్, పోర్ఫైరియా కుట్టెనా టార్టా చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు దీని వలన మరికొన్ని ఉపయోగాలు ఉన్నాయి.దీన్ని నోటి ద్వారా తీసుకుంటారు. ఇది కరోనావైరస్ వ్యాధి 2019 (COVID-19) కు ప్రయోగాత్మక చికిత్సగా కూడా ఉపయోగించబడుతోంది[1].
ఈ మందు వాడటం వలన సాధారణ దుష్ప్రభావాలలో వాంతులు, తలనొప్పి, దృష్టిలో మార్పులు, కండరాల బలహీనత ఉన్నాయి. తీవ్రమైన దుష్ప్రభావాలలో అలెర్జీ ప్రతిచర్యలు ఉండవచ్చు . అన్ని ప్రమాదాన్ని మినహాయించలేనప్పటికీ, ఇది గర్భధారణ సమయంలో రుమాటిక్ వ్యాధికి చికిత్సగా అవసరమవుతుంది.ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్ యాంటీమలేరియల్, 4-అమైనోక్వినోలిన్ కుటుంబాలలో ఉంది. ఇది డిసీజ్-మాడిఫై యాంటీరుమాటిక్ డ్రగ్స్ (DMARDs) అని పిలవబడే ఔషధాల తరగతికి చెందినది. ఇది ల్యూపస్ లో చర్మ సమస్యలను తగ్గించి, ఆర్థరైటిస్ లో వాపు/నొప్పిని నిరోధిస్తుంది, అయితే ఈ మందు ఎలా పనిచేస్తుంది అనేది ఖచ్చితంగా తెలియదు.[2] 1955 లో యునైటెడ్ స్టేట్స్ లో వైద్య వినియోగానికి హైడ్రోక్సిక్లోరోక్వినైన్ ఆమోదించబడింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ముఖ్యమైన ఔషధాల జాబితాలో, ఆరోగ్య వ్యవస్థలో అవసరమైన సురక్షితమైన, అత్యంత ప్రభావవంతమైన ఔషధాల జాబితాలో వున్నది.
కరోన నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్
[మార్చు]కరోనా అనుమానిత, పాజిటివ్ కేసులతో సన్నిహితంగా ఉండే వైద్య సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా క్లోరోక్విన్‌ను వాడాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) సిఫారసు చేసింది[3]ని వాడకానికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా బాధితులకు, అనుమానితులకు, వైద్య సేవలు అందించే వారిలో కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వొచ్చని తెలిపింది. కరోనా రోగుల బంధువులు కూడా తీసుకోవచ్చని పేర్కొంది. అయితే, దీనిని సంబంధిత వైద్యుల సూచన మేరకే వేసుకోవాలి ఈ మందులు వాడుతున్నప్పుడు కూడా కరోనా బాధిత కుటుంబసభ్యులు ఆదేశాల మేరకు క్వారంటైన్‌లో ఉండాలి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తున్న సమయంలో ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాన్ని వాడాలి.
వైద్య సేవలు అందిస్తున్న వారు తొలి రోజు రెండుసార్లు 400 మిల్లీగ్రాముల చొప్పున వాడాలని, ఆ తర్వాత ఏడు వారాలపాటు వారానికి ఒకసారి 400 ఎంజీ భోజనంతో కలిపి తీసుకోవాలని సూచించింది. రోగులతో కలిసి ఉంటున్న కుటుంబ సభ్యులు తొలి రోజు రెండుసార్లు 400 మిల్లీగ్రాములు, ఆ తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎంజీ చొప్పున భోజనంతో పాటు ఈ మందు తీసుకోవాలని వివరించింది.
క్లోరోక్విన్ వాడకంలో జాగ్రత్తలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "కరోన నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్... ఐసీఎంఆర్ ప్రకటన". Samayam Telugu. Retrieved 2020-03-24.
- ↑ "Drugs & Medications". www.webmd.com (in ఇంగ్లీష్). Retrieved 2020-03-24.
- ↑ "కొవిడ్ నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్". web.archive.org. 2020-03-24. Archived from the original on 2020-03-24. Retrieved 2020-03-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)