హైదరాబాద్ బ్లూస్ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాద్ బ్లూస్ 2
హైదరాబాద్ బ్లూస్ 2 సినిమా పోస్టర్
దర్శకత్వంనగేశ్ కుకునూర్
రచననగేష్ కుకునూర్
నిర్మాతదేవికా బహుధనం
ఎలాహే హిప్టూలా
నగేష్ కుకునూర్
తారాగణంనగేష్ కుకునూర్
జ్యోతి డోగ్రా
టిస్కా చోప్రా
ఛాయాగ్రహణంజి.ఎస్. భాస్కర్
కూర్పుసంజీబ్ దత్తా
సంగీతంసలీం-సులైమాన్
ట్రిక్ బేబీ
పంపిణీదార్లుయూటివి మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
2 జూన్ 2004 (2004-06-02)
దేశంభారతదేశం
భాషఆంగ్లం

హైదరాబాద్ బ్లూస్ 2 అనేది 2004 జూన్ 2న విడుదలైన ఆంగ్ల సినిమా. ఈ సినిమాకు రచన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను నగేష్ కుకునూర్ చేపట్టాడు.[1] ఇది హైదరాబాద్ బ్లూస్ సినిమాకు సీక్వెల్.[2][3] ఈ సినిమాలో వరుణ్ పాత్రను పోషించినందుకు నగేష్ కుకునూర్ స్క్రీన్ వీక్లీ అవార్డ్స్‌లో "ఇంగ్లీష్‌లో భారతీయ చలనచిత్రంలో ఉత్తమ ప్రదర్శన" విభాగంలో నామినేట్ చేయబడ్డాడు.[4]

కథా సారాంశం

[మార్చు]

సీక్వెల్ కథ మొదటి సినిమా జరిగిన 6 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అశ్వినితో వివాహం తర్వాత, వరుణ్ భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అశ్విని తన స్వంత క్లినిక్‌ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉండగా అతను కాల్ సెంటర్‌ను ప్రారంభించాడు.

సీమ, సంజీవ్‌ల కుటుంబాన్ని చూసి, పెళ్ళయిన 6 సంవత్సరాల తర్వాత అశ్వినికి పిల్లలు కావాలి, అయితే వారిద్దరూ ఒకరికొకరు బాగున్నారంటూ వరుణ్ ఎప్పుడూ టాపిక్‌ని తప్పించుకుంటాడు. అశ్విని పిల్లలను కనాలని తహతహలాడుతుండగా, వరుణ్ ఆఫీసులో అందమైన మేనక వరుణ్‌ని ఇష్టపడుతుంది. వరుణ్ తన హద్దులు దాటకుండా మేనకను అడ్డుకుంటాడు. అయితే అశ్విని వరుణ్‌ని నమ్మకుండా అతనితో విడాకులు తీసుకుంటుంది, కానీ తన తప్పును తెలుసుకుంటుంది. తరువాత ఆమె క్షమాపణలు చెప్పడంతో వరుణ్, అశ్విని మళ్ళీ కలుస్తారు.

నటవర్గం

[మార్చు]
 • నగేష్ కుకునూర్ (వరుణ్ నాయుడు)
 • జ్యోతి డోగ్రా (అశ్వినీ రావు నాయుడు)
 • టిస్కా చోప్రా (మేనక)
 • ఎలాహే హిప్టూలా (సీమా రావు)
 • విక్రమ్ ఇనామ్దార్ (సంజీవ్ రావు)
 • అనుజ్ గుర్వారా (ఆజం)
 • అనూప్ రత్నకర్ రావు (హరీష్ చందాని)
 • అను చెంగప్ప (శశి నాయుడు)
 • సౌమిక్ బెనర్జీ (సన్నీ)

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు సలీం-సులైమాన్ సంగీతం సమకుర్చారు.

 • "స్లిప్పింగ్ త్రూ యువర్ ఫింగర్స్" – గాయకులు: ట్రిక్ బేబీ
 • "తేరే బినా" – గాయకుడు: ఫుజోన్
 • "దిల్ పే మత్ లో" – గాయకుడు: ఆనంద్
 • "మో భాంగ్రా బ్లూస్" – గాయకుడు: సోనిక్ గురుస్
 • "వన్ మ్యాన్" – గాయకులు: ట్రిక్ బేబీ
 • "మోరా సైయా మోస్ బోలెనా" – గాయకుడు: ఫుజోన్
 • "సీ ఆఫ్ స్టోరీస్" – గాయకుడు: ట్రిక్ బేబీ
 • "అద్దితప్ప" – గాయకుడు: కాలిచే
 • "ప్యాలెస్ ఆన్ వీల్స్, ఆజ్ కి రాత్" – గాయకుడు: బిడ్డు

మూలాలు

[మార్చు]
 1. "Hyderabad Blues 2". Deccan Herald. 4 July 2004. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 5 Dec 2011.
 2. "Review: Hyderabad Blues 2". Rediff.com. 2004-07-01. Retrieved 2019-11-29.
 3. IANS. "20 years on, 'Hyderabad Blues' prequel on Nagesh Kukunoor's mind | Business Standard News". Business-standard.com. Retrieved 2019-11-29.
 4. "Screen Weekly Awards (2005)". IMDB.com. Retrieved 30 Nov 2011.

బయటి లింకులు

[మార్చు]